జూలై నెలలో శని సంచారంలో మార్పు ఉంటుంది. జూలై 13 నుంచి శని తిరోగమనంలో ఉంటాడు. ఆ తర్వాత కుజుడు కూడా జూలై నెలలో రాశి మార్పు చెందుతాడు. ఈ రెండు గ్రహాల మార్పు వలన కొన్ని రాశుల వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. న్యాయానికి అధిపతి అయిన శని, మీన రాశిలో తిరోగమనం చెందుతాడు. మీన రాశిలో శని తిరోగమనం మూడు నెలల వరకు కొనసాగుతుంది. జూలై నెలలో కుజుని సంచారం కూడా ఉంటుంది.
ప్రస్తుతం కుజుడు సింహ రాశిలో ఉన్నాడు. జూలై నెలలో కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల సంచార మార్పు వలన 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది.
కానీ మూడు రాశుల వారికి మాత్రం ఎక్కువ మార్పులు చోటు చేసుకుంటాయి. శని తిరోగమనం, కుజుడి రాశి మార్పు కొన్ని రాశుల వారికి ఆర్థికపరంగా బాగా ఉంటుంది. ఈ సమయంలో సంపాదన పెరుగుతుంది, డబ్బు వస్తుంది. మరి ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూద్దాం.
ధనుస్సు రాశి వారికి జూలై నెలలో శని, కుజుడి సంచార మార్పు ఊహించని మార్పులు తీసుకువస్తుంది. కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారు పని ప్రదేశంలో అనేక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థికపరంగా కూడా బాగా ఉంటుంది.
మీన రాశి వారికి శని తిరోగమనం, కుజుడి రాశి మార్పు కలసి వస్తుంది. ఈ సమయంలో మీన రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. భార్యాభర్తల మధ్య సంబంధం బాగా ఉంటుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది
మకర రాశి వారికి జూలై నెలలో బాగా ఉంటుంది. శని తిరోగమనం, కుజుడి రాశి మార్పు వలన అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ధైర్యం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు చేస్తారు. కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.