జులై 27, నేటి రాశి ఫలాలు.. ఈరోజు కన్యా రాశి వారి సంపద, కీర్తి పెరుగుతుంది-saturday july 27th today rasi phalalu in telugu check zodiac wise results for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జులై 27, నేటి రాశి ఫలాలు.. ఈరోజు కన్యా రాశి వారి సంపద, కీర్తి పెరుగుతుంది

జులై 27, నేటి రాశి ఫలాలు.. ఈరోజు కన్యా రాశి వారి సంపద, కీర్తి పెరుగుతుంది

HT Telugu Desk HT Telugu
Jul 27, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ27.07.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జులై 27 నేటి రాశి ఫలాలు
జులై 27 నేటి రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 27.07.2024

వారం: శ‌నివారం, తిథి : స‌ప్త‌మి,

నక్షత్రం: రేవతి, మాసం : ఆషాఢ‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేష రాశి

బంధు మిత్రులతో సత్సంబంధాలు క‌లిగి ఉంటారు. ఉద్యోగంలో కలిసి వ‌చ్చేకాలం. పై అధికారుల మ‌న్న‌నులు సొంతం చేసుకుంటారు. విద్యాప‌ర‌మైన విష‌యాల్లో ప్ర‌భుత్వ సాయం ల‌భిస్తుంది.

వృష‌భ రాశి

స్వ‌తంత్రం స్వభావం కలిగి ఉంటారు. ముక్కుసూటితనంతో ఇతరులపై విరుచుకుపడతారు. కుటుంబ‌స‌భ్యులతో స‌త్సంబంధాలు క‌లిగి ఉంటారు. ప్ర‌యాణాలు క‌లిసి వ‌స్తాయి. ఉద్యోగంలో స‌త్ఫ‌లితాలు సొంతం చేసుకుంటారు.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఉంటుంది. జాగ్ర‌త్త అవ‌స‌రం.

క‌ర్కాట‌క రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవ‌డానికి స‌హ‌నం అవ‌స‌రం. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం. ఆర్థిక విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండండి. చెడు స్నేహాలు వ‌దులుకోండి.

సింహ రాశి

అన్ని రకాల వృత్తుల వారికి అధికాదాయం ల‌భిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. భూమి, గృహ స్థిరాస్తులను కూడబెట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో క‌లిసి వ‌చ్చే కాలం. ఉన్న‌తాధికారుల ప్ర‌శంస‌లు అందుకుంటారు.

కన్యా రాశి

సంపద, కీర్తి పెరుగుతుంది. కీల‌క విష‌యాల్లో స్నేహితుల మద్దతు ల‌భిస్తుంది. ప్రయత్నాలలో విజయం పొందుతారు. గృహ సంబంధిత విష‌యాల్లో కీల‌క ఆలోచ‌న‌లు చేస్తారు. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. ఉద్యోగుల‌కు క‌లిసి వ‌చ్చేకాలం.

తులా రాశి

యత్నకార్యసిద్ధి ఉంది. విద్య, వృత్తి పరంగా ముందంజ వేస్తారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. అందరి మన్ననలు పొందుతారు. ఉద్యోగంలో నూత‌న ప్ర‌య‌త్నాలు క‌లిసి వ‌స్తాయి. ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తారు.

వృశ్చిక రాశి

సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతారు. గృహ, వాహ‌న యోగాలున్నాయి. మీ ప్రయత్నాలకు అనుగుణంగా ఆదాయం కూడా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఉద్యోగ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృత‌మ‌వుతాయి.

ధ‌నుస్సు రాశి

ఉద్యోగపరంగా గుర్తింపు పొందుతారు. సంతృప్తికరమైన జీవనం సాగిస్తారు. ఆర్థిక ప‌రంగా క‌లిసి వ‌చ్చే కాలం. కొన్ని విష‌యాలు మాన‌సిక క్షోభను మిగులుస్తాయి. అదృష్టం మీకు క‌లిసి వ‌స్తుంది.

మ‌క‌ర రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఉత్తమ ఫలితాలున్నాయి. మానసిక శారీరిక ఒత్తిడితో ఇబ్బంది ప‌డ‌తారు. స్త్రీలతో సంభాషణ సమయంలో జాగ్ర‌త్త అవ‌స‌రం. కీలక విష‌యాల్లో నోటిని కాస్త అదుపులో ఉంచుకోవ‌డం అవ‌స‌రం. ఆర్థిక విష‌యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.

కుంభ రాశి

చదువుల్లో ప్రతిభా పాటవాలతో రాణిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవ‌డంలో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. పోటీ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధిస్తారు. ఉద్యోగ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తారు. ఉద్యోగుల‌కు క‌లిసి వ‌చ్చే కాలం. కుటుంబ‌స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

మీన రాశి

దూర ప్ర‌యాణాలు చేస్తారు. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. స్వ‌ల్ప‌ ఆరోగ్య సమ‌స్య‌లున్నాయి. స్థిరాస్తి సంబంధిత క్ర‌య‌విక్ర‌యాలను కాస్త వాయిదా వేయండి. ఆర్థికంగా క‌లిసి వ‌చ్చేకాలం. విద్యార్థులు కొత్త విష‌యాలు నేర్చుకుంటారు. ఉద్యోగులు కీల‌క ప‌ద‌వీ బాధ్య‌త‌లు పొందుతారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner