Saphala Ekadashi: 2 శుభయోగాల్లో సఫల ఏకాదశి.. ఈ రోజు అన్నం ఎందుకు తినకూడదు? పాపాలు తొలగిపోవాలంటే ఇలా చేయండి
Saphala Ekadashi: సఫల ఏకాదశికి విశేష ప్రాముఖ్యత ఉంది. సనాతన విశ్వాసాల ప్రకారం ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా మీరు జీవితంలో విజయం సాధించవచ్చు. ఈసారి సఫల ఏకాదశి డిసెంబర్ 26న వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున రోజంతా ఉపవాసం ఉండటం వల్ల కోరికలు నెరవేరడంతో పాటు అన్ని పనుల్లో విజయం లభిస్తుంది.
సఫల ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండటం వల్ల కోరికలు నెరవేరడంతో పాటు అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. సఫల ఏకాదశి నాడు అన్నం తినకూడదు. దాని వెనుక పెద్ద కథ కూడా ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం.
సఫల ఏకాదశికి విశేష ప్రాముఖ్యత ఉంది. సనాతన విశ్వాసాల ప్రకారం ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా మీరు జీవితంలో విజయం సాధించవచ్చు. ఈసారి సఫల ఏకాదశి డిసెంబర్ 26న వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున రోజంతా ఉపవాసం ఉండటం వల్ల కోరికలు నెరవేరడంతో పాటు అన్ని పనుల్లో విజయం లభిస్తుంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి డిసెంబర్ 25 రాత్రి 10:30 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 26 తెల్లవారుజామున 12:45 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున సుకర్మ, ధృతి యోగం ఏర్పడతాయి. డిసెంబర్ 25 మధ్యాహ్నం 3.22 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 6.10 గంటల వరకు స్వాతి నక్షత్రం ఉంటుంది. డిసెంబర్ 26న ఏకాదశి పర్వదినం ఉన్న రోజే ఈ ఉపవాసాన్ని ఆచరించనున్నారు.
ఉపవాస విధానం:
ఉపవాస దినం రోజున, బ్రహ్మ ముహూర్తంలో రోజువారీ పనుల పూర్తి అయ్యాక, మీ ఆరాధ్య దైవాన్ని పూజించిన తరువాత, సఫల ఏకాదశి నాడు ఉపవాసం మొదలు పెట్టాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. ఏ ఆహారం తీసుకోకుండా ఉండలేని వారు పాలు లేదా పండ్లు తీసుకోవచ్చు. శ్రీహరి యొక్క ప్రత్యేక అనుగ్రహం కోసం, 'ఓం నమో నారాయణ్' లేదా ' ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపించాలి.
ఈ రోజున అన్నం ఎందుకు తినకూడదు?
ఉపవాసం లేకపోయినా ఈ రోజున అన్నం తినడం నిషిద్ధం. ఆదిశక్తి ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు మేధామహర్షి తన శరీరాన్ని త్యాగం చేశాడని మత విశ్వాసం. ఆ తర్వాత వాటి భాగం భూమిలో కలిసిపోయింది. మేధామహర్షి భూమిలో లీనమైన రోజు ఏకాదశి. తరువాత అవి బియ్యం రూపంలో ఉత్పత్తి అయ్యాయని నమ్ముతారు, కాబట్టి ఈ రోజున బియ్యం తినకూడదు అని అంటారు.
సఫల ఏకాదశి నాడు ఏం చేయాలి?
- సఫల ఏకాదశి నాడు తెలిసి చేసిన పాపాలు తెలియకుండా చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి.
2. ఈ ఏకాదశిని పవిత్రంగా భావిస్తారు. ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. పూజగదిని అలంకరించుకొని లక్ష్మీనారాయణ ఫోటోకి బొట్లు పెట్టాలి.
3. ఒకవేళ లక్ష్మీనారాయణ ఫోటో లేకపోతే మీరు నరసింహస్వామికి లేదా రాముడు, కృష్ణుడికి పూజ చేయవచ్చు.
4. ఫోటో ముందు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచి జరుగుతుంది.
5. విష్ణుమూర్తికి ఇష్టమైన పూలను సమర్పించండి. విష్ణుమూర్తికి నందివర్ధనం, తుమ్మి పూలు, తెల్ల గన్నేరు, జాజిపూలు అంటే ఎంతో ప్రీతి.
6. పూజ చేసాక తియ్యటి పదార్థాలని నైవేద్యంగా పెట్టండి. పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి. ఇలా పూజ చేసినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. మంచి జరుగుతుంది. పాపాలన్నీ తొలగిపోతాయి సంతోషంగా ఉండొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.