Sankranti Muggulu: సంక్రాతి నాడు ఎందుకు ముగ్గులు వేస్తారు, కారణం ఏంటంటే?
Sankranti Muggulu: మన హిందూ సంప్రదాయంలో ముగ్గులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముగ్గులు వేయడానికి చారిత్రక సంబంధం కూడా ఉంది. ముగ్గులలో మనకు ఎక్కువగా తామర పువ్వు ఆకారంలో ఉన్న ముగ్గులతో పాటుగా నెమళ్లు, మామిడి పండ్లు, చేపలు చిహ్నాలు కనబడుతూ ఉంటాయి. ముగ్గులను చూసినప్పుడు ప్రశాంతత కలుగుతుంది.
హిందువులు సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని అంటారు. సంక్రాంతి పండుగకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. సంక్రాంతి పండుగకు అనేక రకాల పిండి వంటలు చేస్తారు. సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత కూడా ఉంది.
సంక్రాంతి పండుగను నాలుగు రోజులు పాటు జరుపుకుంటారు. సంక్రాంతికి అందమైన రంగు ముగ్గులు వేస్తారు. సంక్రాంతి పండుగ నాడు ఎందుకు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి. దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సంక్రాంతి నాడు ఎందుకు అందమైన రంగురంగు ముగ్గులు వేస్తారు?
మన హిందూ సంప్రదాయంలో ముగ్గులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముగ్గులు వేయడానికి చారిత్రక సంబంధం కూడా ఉంది. ముగ్గులలో మనకు ఎక్కువగా తామర పువ్వు ఆకారంలో ఉన్న ముగ్గులతో పాటుగా నెమళ్లు, మామిడి పండ్లు, చేపలు చిహ్నాలు కనబడుతూ ఉంటాయి. ముగ్గులను చూసినప్పుడు ప్రశాంతత కలుగుతుంది.
అలాగే దైవిక శక్తుల ఉనికిని అనుభవిస్తాము. మన ఇంట లక్ష్మీదేవి ఉండాలని దేవతల్ని స్వాగతించడానికి ముగ్గులు వేస్తూ ఉంటాము. అలాగే అతిధులను స్వాగతించడానికి కూడా మంచి మంచి ముగ్గులు గుమ్మంలో వేస్తూ ఉంటాము. చెడును అరికట్టడానికి మంచి కలగడానికి తెల్లటి బియ్యం పిండితో ముగ్గులు వేస్తూ ఉంటారు.
లక్ష్మీదేవి అనుగ్రహం
సంక్రాంతి నాడు ఎందుకు రంగు రంగుల ముగ్గులు వేయాలి అనే విషయానికి వచ్చేస్తే, సంపదకు అది దేవత లక్ష్మీదేవి. తెల్లవారుజామున లక్ష్మీదేవి ప్రతి వీధిలోకి వస్తుంది. అయితే ఎవరి ఇంటి ముందు అయితే శుభ్రంగా తుడిచి ఉంటుందో, ఎక్కడైతే అందమైన ముగ్గులు ఉంటాయో, ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెళ్తుందట.
లక్ష్మీదేవి ఆయురారోగ్యాలు కలగాలని, ధన ధాన్యాలు కలగాలని దీవిస్తారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సుఖశాంతుల్ని కూడా పొందవచ్చు. అందుకని సంక్రాంతి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఇలా అందమైన ముగ్గులని వాకిట్లో వేస్తూ ఉంటారు.
పైగా దీని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. శుభ్రంగా తుడిచి కళ్ళాపి చల్లి ముగ్గు పిండితో ముగ్గు కనుక ఉన్నట్లయితే క్రిమి కీటకాలు రావు. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే ముగ్గు వేసేటప్పుడు వంగి లేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చక్కని వ్యాయామం అవుతుంది. ఒక యోగాసనం లాగ ముగ్గు వేయడం జరుగుతుంది.
భోగి, సంక్రాతి ముగ్గులు
భోగి, సంక్రాతి ముగ్గులు విషయానికి వస్తే భోగి మంటలు, పొంగలి, చెరుకు గడలు ఉండే ముగ్గులు వేస్తూ ఉంటారు. అలాగే అందమైన దీపాల ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు.
కనుమ నాడు ముగ్గులు
కనుమ నాడు రథం ముగ్గు తప్పకుండా వేస్తారు. రథం ముగ్గు వేసి నాలుగు వైపులా కూడా అందమైన బోర్డర్లు వేస్తూ ఉంటారు. ఇలా పండుగకి అందమైన ముగ్గులు వేయడం జరుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం