తెలుగింట నవ్య తేజస్సును ప్రసరింపజేసే ఆనందం, ఆహ్లాదాన్ని పంచే పండుగ సంక్రాంతి - బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ
ఆనందం, ఆహ్లాదాన్ని పంచే గొప్ప పండుగ సంక్రాంతి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తపంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.జ్యోతిష్యం, ఖగోళ మార్పుల పరంగా అత్యంత శ్రేష్ఠమైన సందర్భం ఈ పర్వదినం.
తెలుగింట నవ్య తేజస్సును ప్రసరింపజేసే ఆనందం, ఆహ్లాదాన్ని పంచే గొప్ప పండుగ సంక్రాంతిఅని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తపంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.జ్యోతిష్యం, ఖగోళ మార్పుల పరంగా అత్యంత శ్రేష్ఠమైన సందర్భం ఈ పర్వదినం.

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని ఉత్తరాయన పుణ్యకాలంగా ఆస్తికలోకం జపతపాలు, అనుష్ఠానాలు, క్రతువులు, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు అంకురార్పణ చేస్తుంది. విశేషంగా ఇది ప్రకృతిని పూజించే ఉత్కృష్ట పండుగ కూడా.
పంటలన్నీ ఇంటికి చేరిన శుభసందర్భాన మూడు రోజులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలుగా ప్రత్యేక పూజలు, విశేషమైన సంబరాలతో తెలుగు లోగిళ్లు సరికొత్త శోభను సంతరించుకుంటాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు ఉత్తరాయనంలో ప్రవేశిస్తాడు.
ఇదే రోజున దేవతలకు బ్రహ్మముహూర్తం ప్రారంభమవుతుంది. అందుకని ఉత్తరాయన కాలాన్ని సాధన, పర-అపర విద్యలను ప్రాప్తింపజేసుకునే దృష్టితో సిద్ధికాలమని శాస్త్రకారులు నిర్ణయించారు. సంక్రాంతి ప్రతినెలా వస్తుంది. కాని మకర కర్కాటక రాశుల్లో సూర్యుడు ప్రవేశించడానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. 10వ రాశియైన మకరరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఇది హిందువులకు ఎంతో పుణ్యప్రదమైన రోజు. ఈ రోజున నువ్వులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కనుక ఈ సంకాంతిని 'తిల సంక్రాంతి' అని కూడా అంటారు.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన తరువాత 40 ఘడియల (16 గంటలు) కాలాన్ని పుణ్యకాలమంటారు. ఇందులో 20 ఘడియల (8 గంటలు) పాటు ఎంతో ఉత్తమమైనది. ఈ సమయంలో చేసే దానధర్మాలు, జపతపాలు, ఇతర ధార్మిక అనుష్ఠానాలు ఎంతో పుణ్యాన్ని ప్రాప్తింపజేస్తాయి. మకర సంక్రాంతి నాడు పవిత్ర నదులు, సరోవరాల్లో స్నానాలు చేసి నువ్వులు, బెల్లం, పులగం మొదలైన పదార్థాలను దానం చేయడానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజు గాలి పటాలు ఎగరవేయడం దేశం మొత్తం పాటించే ఆచారం.
సంక్రాంతి కాలానికి సంబంధించిన పండుగ. ఈ కాలంలో ముగ్గురు ముఖ్య దేవతలను పూజించాలి. మొదటగా సూర్యభగవానుడు, తదుపరి పరమశివుడు, మూడో దైవం దేవ గురువైన బృహస్పతి. ఈయన ధనుస్సు రాశికి అధిపతి. రోగ నివారణ, లక్ష్మీప్రాప్తి కోసం సూర్యభగవానుని: ఆపన్నివారణ, శత్రునాశనం కోసం పరమశివుని: కీర్తి, గౌరవం, జ్ఞానం, విద్యల కోసం దేవగురువు బృహస్పతిని విధ్యుక్తంగా పూజించాలి.
సంక్రాంతి పూజకు ఆవుపాలు, పెరుగు, నెయ్యి, నువ్వులు, పసుపురంగు పట్టువస్త్రం, యజ్ఞోపవీతం అవసరమవుతాయి. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, సూర్యభగవానునికి: నువ్వులు, బెల్లం మిశ్రమం శివునికి; పసుపురంగు వస్త్రం బృహస్పతికి సమర్పించి, పూజించాలి. ఈ వర్ణన శ్రీమద్భాగవతం, దేవీ పురాణంలో వివరంగా ఉంది అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తపంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంబంధిత కథనం