Sankranti 2025: శ్రీమద్రమారమణ గోవిందో హరీ అనే ఈ హరిదాసులు ఎవరు? అసలు వారికి అక్షయపాత్రలో ఎందుకు బియ్యం వేస్తారు?
హరిదాసుల తలపై అక్షయపాత్ర ఉంటుంది. దాన్ని పట్టిన వెంటనే ఇంటి ముందు ఉన్న హరిదాసుకి బియ్యం వేస్తూ ఉంటారు. అయితే అసలు వీరు ఎవరు? ఎందుకు వీరికి బియ్యం వేయాలి? దాని వెనుక కారణాలు, చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి పండుగ గురించి ఎంత వివరించినా చాలా ఉంటుంది. సంక్రాంతి పండుగకు ఎక్కడ లేని జనం అంతా పల్లెల్లో సందడి చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
అలాగే పల్లెను వదిలేసి చాలామంది నగరాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వారంతా సంక్రాంతి పండుగకు గ్రామాల్లో సందడి చేస్తూ ఉంటారు.
సంక్రాంతి పండుగ అంటే కుటుంబమంతా సంతోషంగా గడపడంతో పాటుగా.. హరిదాసులు, గాలిపటాలు ఎగరవేయడం, గంగిరెద్దులు, భోగి మంటలు, పిండి వంటలు ఇలా ఎన్నో... అయితే హరిదాసుల గురించి కచ్చితంగా చెప్పుకొని తీరాలి.
అక్షయపాత్ర
మామూలుగా మన ఇళ్ళ ముందుకు హరిదాసులు వచ్చి హరి నామాన్ని గానం చేయడం, కాళ్లకు గజ్జలు, భుజం మీద వీణతో శిరస్సు మీద అక్షయపాత్రతో కనబడుతూ ఉంటారు. వారు హరినామ సంకీర్తన చేస్తూ వీధిలో వెళ్తూ ఉంటారు. వారి కాళ్ల గజ్జల శబ్దం, గానం విని హరిదాసులు వచ్చారని బియ్యం వేస్తూ ఉంటాం.
హరిదాసుల తలపై అక్షయపాత్ర ఉంటుంది. దాన్ని పట్టిన వెంటనే ఇంటి ముందు ఉన్న హరిదాసుకి బియ్యం వేస్తూ ఉంటారు. అయితే అసలు వీరు ఎవరు? ఎందుకు వీరికి బియ్యం వేయాలి? దాని వెనుక కారణాలు, చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు హరిదాసు అంటే ఎవరు?
పరమాత్మతో సమానంగా హరిదాసుని భావించేవారు. మహావిష్ణువుకి ప్రతినిధులు హరిదాసులు. వీళ్ళ అక్షయపాత్రలో బియ్యం పోస్తే ఎన్నో పాపాలు తొలగిపోతాయని... తెలిసి పాపం చేసినా, తెలియక పాపం చేసినా అది తొలగిపోతుందని నమ్ముతారు. హరిదాసులు దానధర్మాలను స్వీకరిస్తే ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయట.
నెల రోజులు హరినామం..
నెల రోజులు హరినామాన్ని గానం చేస్తారు. సంక్రాంతి నాడు స్వయంపాకంగా అందరూ ఇచ్చే దానాలను స్వీకరిస్తారు. హరినామ సంకీరతన చేస్తూ దానాలను తీసుకుంటారు. అక్షయపాత్రను వారు ఎక్కడా దించరు. వారి ఇంటికి వెళ్లిన తర్వాత ఇల్లాలు హరిదాసు పాదాలు కడిగి, హరిదాసు నెత్తి మీద ఉన్న అక్షయపాత్రను దించుతుంది.
శ్రీకృష్ణుడికి మరో రూపం..
హరిదాసుల్ని శ్రీకృష్ణుడికి మరో రూపం అని కూడా అంటారు. ఏ బేధం లేకుండా అందరి ఇళ్ళకి కూడా వీళ్ళు వెళ్తారు. వీధి వీధి తిరుగుతారు ఒకవేళ ఎవరైనా గుమ్మంలో లేకపోతే మరో ఇంటికి వెళ్తారు. మహావిష్ణువుకి శక్తి కొద్ది పెట్టిన నైవేద్యంగా భావిస్తారు. హరిదాసు తలపై పెద్ద రాగి పాత్ర ఉంటుంది. భూమికి సంకేతంగా ఆ రాగి పాత్రని శ్రీమహావిష్ణువు పెట్టాడని కథ కూడా ఉంది.
సంక్రాంతి ముందు ధనుర్మాసంలో మాత్రమే వీళ్ళు కనపడతారు. మళ్ళీ సంవత్సరం వరకు కనపడరు. ధనుర్మాసం నెల రోజులు కూడా సూర్యోదయానికి ముందు శ్రీకృష్ణ, గోదాదేవిని స్మరిస్తారు. తిరుప్పావై పఠించి అక్షయపాత్రని ధరిస్తారు. గ్రామ సంచారాన్ని మొదలుపెడతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం