Sankranti: సంక్రాతి నాడు ఈ 3 దానం చేయకండి.. సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది
Sankranti: సంక్రాంతి నాడు కొన్ని దానం చేయడం వలన విశేష ఫలితాలు కనపడతాయి. అయితే, సంక్రాంతి నాడు కొన్నిటిని పొరపాటున కూడా దానం చేయకూడదు. వీటిని ఎవరికైనా ఇస్తే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గమనించండి.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి, పల్లెటూర్లలో పండుగ చేసుకుంటారు. మకర సంక్రాంతి నాడు బంధు మిత్రులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. విందు భోజనాలు, పిండి వంటలు ఇలా చెప్పకపోతే సంక్రాంతి గురించి చాలానే ఉంటుంది. అయితే, మకర సంక్రాంతి రోజు దానధర్మాలు చేస్తే కూడా పుణ్యం వస్తుంది.
సంక్రాంతి నాడు కొన్ని దానం చేయడం వలన విశేష ఫలితాలు కనపడతాయి. అయితే, సంక్రాంతి నాడు కొన్నిటిని పొరపాటున కూడా దానం చేయకూడదు. వీటిని ఎవరికైనా ఇస్తే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గమనించండి.
సంక్రాంతి పండుగ ఈసారి ఎప్పుడు వచ్చింది?
సంక్రాంతి పండుగ జనవరి 14న వచ్చింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 14న ఉదయం 9:03 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మకర సంక్రాంతి నాడు పుణ్యా నదుల్లో స్నానాలు చేయడం వలన ఎంతో గొప్ప పుణ్యం ఫలితం ఉంటుంది. అలాగే సంక్రాంతి నాడు దానాలు చేయడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. అయితే, కొన్నిటిని మాత్రం దానం చేయకూడదని గుర్తుపెట్టుకోండి. వేటిని దానం చేయకూడదు అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి నాడు వీటిని దానం చేయకండి
1.నూనె
సంక్రాంతి నాడు నూనెను దానం చేయడం మంచిది కాదు. ఈరోజు నూనెను దానం చేస్తే, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నూనెను దానం చేయడం వలన ప్రతికూల ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి, సంక్రాంతి నాడు నూనెను మాత్రం ఎవరికీ ఇవ్వకండి.
2.నలుపు వస్త్రాలు
నలుపు రంగు బట్టల్ని ఎవరికీ కూడా సంక్రాంతి నాడు ఇవ్వకూడదు. అలా చేస్తే కూడా ప్రతికూల శక్తి కలిగి సానుకూల శక్తి ప్రవహించకుండా పోతుంది. మకర సంక్రాంతి నాడు నల్లటి వస్త్రాలని ఎవరికీ ఇవ్వద్దు. ఇలా చేయడం వలన అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
3.పదునైన వస్తువులు
మకర సంక్రాంతి నాడు ఎవరికీ కూడా కత్తులు, కత్తెర్లు లాంటివి దానం చేయకండి. ఇలాంటి పదునైన వస్తువులను దానం చేయడం వలన కూడా ప్రతికూల శక్తి కలిగి సానుకూల శక్తి పోతుంది. గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం