Sankranti: సంక్రాతి పండుగ నాడు ఈ పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుంది, ఎంతో పుణ్యం వస్తుంది.. ఈ తప్పులను మాత్రం చేయకండి-sankranti 2025 do these on sankranti and do not do these mistakes on that day these can change life get god blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sankranti: సంక్రాతి పండుగ నాడు ఈ పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుంది, ఎంతో పుణ్యం వస్తుంది.. ఈ తప్పులను మాత్రం చేయకండి

Sankranti: సంక్రాతి పండుగ నాడు ఈ పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుంది, ఎంతో పుణ్యం వస్తుంది.. ఈ తప్పులను మాత్రం చేయకండి

Peddinti Sravya HT Telugu
Jan 13, 2025 09:00 AM IST

Sankranti: 12 రాశుల పర్యటనలో భాగంగా సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు, మకర సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటాము. సంక్రాంతి పండుగను రకరకాల పేర్లతో వివిధ ప్రాంతాల్లో జరుపుతారు. తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే ఈ పండుగ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

Sankranthi: సంక్రాతి పండుగ నాడు ఈ పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుంది
Sankranthi: సంక్రాతి పండుగ నాడు ఈ పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుంది (pinterest)

సంక్రాంతి పండుగకి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 12 రాశుల పర్యటనలో భాగంగా సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు, మకర సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటాము. సంక్రాంతి పండుగను రకరకాల పేర్లతో వివిధ ప్రాంతాల్లో జరుపుతారు. తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే ఈ పండుగ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాలుగు రోజుల పాటు ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. ఈ సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు.

yearly horoscope entry point

నాలుగు రోజుల పండుగ

భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు రోజులు కూడా పండుగను జరుపుకుంటారు. ఈ నాలుగు రోజులూ కూడ కుటుంబంతో సంతోషంగా గడపచ్చు. పిండివంటలు తయారు చేసుకోవచ్చు. సంక్రాంతి నాడు కొన్ని పనులు చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే కొన్నిటిని అస్సలు చేయకూడదు.

ఈసారి సంక్రాంతి పండగ ఎప్పుడు వచ్చింది? ఏం చేస్తే మంచిది?

మకర సంక్రాంతి పండుగ జనవరి 14న వచ్చింది. భోగి పండుగ జనవరి 13న వచ్చింది. మకర సంక్రాంతి నాడు వీటిని దానం చేస్తే మంచిది. సంక్రాంతి నాడు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది.

సంక్రాంతి నాడు స్నానం చేసిన తర్వాత నువ్వులను దానం చేయాలి. నల్ల నువ్వుల్ని దానం చేస్తే చాలా మంచి కలుగుతుంది. నల్ల నువ్వులు అందుబాటులో లేనట్లయితే తెల్ల నువ్వులనైనా దానం చేయొచ్చు. నువ్వులను దానం చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. శని దోషం కూడా తొలగిపోతుంది.

సంక్రాతి నాడు బెల్లం దానం చేస్తే మంచిది. చాలామంది బెల్లం, నల్ల నువ్వులను లడ్డు చేసి దానం చేస్తూ ఉంటారు. సంక్రాంతి నాడు పూజ చేశాక పేదలకి ఏమైనా వస్త్రాలని దానం చేస్తే మంచిది. జాతకంలో రాహు గ్రహానికి సంబంధించిన దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి.

సంక్రాంతి నాడు నువ్వులను తింటే మంచిది. సంక్రాంతి నుంచి వాతావరణంలో మార్పులు మొదలవుతాయి. అందుకని శరీరం తట్టుకోవడానికి నువ్వుల్ని తినమని చెప్తూ ఉంటారు. సంక్రాంతి నాడు నువ్వుల హోమాన్ని ఆచరిస్తే సుఖసంతోషాలు కలుగుతాయి. సౌభాగ్యాలు కలుగుతాయి.

మకర సంక్రాంతి నాడు సూర్య భగవానుడిని ఆరాధించి అర్ఘ్యం సమర్పిస్తే మంచిది. నీళ్లు, ఎర్రటి పూలు, దుస్తులు, అక్షతలు, గోధుమలు, తమలపాకులు వంటి వాటిని మకర సంక్రాంతి నాడు అర్ఘ్య సమయంలో సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎవరైనా ఇంటికి వచ్చి దానం చేయమంటే వట్టి చేతులతో పంపించడం మంచిది కాదు. సంక్రాంతి నాడు ఎవరైనా వస్తే ఏమి ఇవ్వకుండా పంపించకండి.

సంక్రాంతి నాడు మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. సంక్రాంతి నాడు ఉపవాసాలు, వ్రతాలు చేసే వాళ్ళు నిష్టగా చేస్తే మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner