సంకటహర చతుర్థి రోజున గణపతికి ఏమి సమర్పించాలి, ఎప్పుడు పూజించాలి?-sankatahara chaturthi pooja date and how to perform pooja on that day do these for lord ganesha blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సంకటహర చతుర్థి రోజున గణపతికి ఏమి సమర్పించాలి, ఎప్పుడు పూజించాలి?

సంకటహర చతుర్థి రోజున గణపతికి ఏమి సమర్పించాలి, ఎప్పుడు పూజించాలి?

Peddinti Sravya HT Telugu
Jan 16, 2025 01:30 PM IST

పిల్లల శ్రేయస్సు కోసం ఈ ఉపవాసం ఆచరిస్తారు. ఈ ఏడాది జనవరి 17న సంకటహర చతుర్థి జరుపుకోనున్నారు. ఈ పూజలో గణపతికి ఏమి సమర్పించాలో తెలుసుకుందాం.

Ganesh chaturthi
Ganesh chaturthi

పిల్లల శ్రేయస్సు కోసం ఈ ఉపవాసం ఆచరిస్తారు. ఈ ఏడాది జనవరి 17న సంకటహర చతుర్థి జరుపుకోనున్నారు. ఈ రోజున, పిల్లలు వారి దీర్ఘాయుష్షు, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. తల్లులు తమ పిల్లల దీర్ఘాయుష్షును కాంక్షిస్తూ ఈ రోజున ఉపవాసం పాటిస్తారు.

yearly horoscope entry point

సాయంత్రం చంద్రుడిని చూసిన తరువాత ఉపవాసం ప్రారంభిస్తారు. ఆ తర్వాతే ఉపవాస దీక్ష పూర్తయినట్లు భావిస్తారు. ఈ ఉపవాసంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తరువాత సాత్విక ఆహారాన్ని తినవచ్చు. చంద్రుడు వచ్చే వరకు నీరు తాగరు.

గణేశుడికి ఏమి సమర్పించాలి?
1. గరిక, తమలపాకును గణేశుడికి సమర్పించాలి.

2. ఈ రోజున వినాయకుడు నువ్వులు, పండ్లను సమర్పించాలి.

3. రోజున వినాయకుడిని పూజించడం ద్వారా వినాయకుడు సంతోషిస్తాడని, పిల్లలు ఆరోగ్యాంగా ఉంటారని చెబుతారు. గణపతికి తులసి దళాలను ఎప్పుడూ సమర్పించకూడదని గుర్తుంచుకోవాలి.

4. చాలా చోట్ల ఉదయాన్నే ఉపవాసం చేసి ఆ తర్వాత సాయంత్రం వినాయకుడిని పూజిస్తారు.

5. ముందుగా వినాయకుడుని పూజించి, ఆ తరవాత ఉపవాసం కథను చదువుతారు.

6. ఆ తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి, చంద్రుడికి సకల వస్తువులను సమర్పించిన తర్వాత హారతి ఇచ్చి సంతానం దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తారు.

చంద్రుని దర్శనం

  1. ఇంట్లో పూజ చేసినా, దేవాలయంలో పూజ చేసుకున్న తప్పకుండా చంద్ర దర్శనం చేసుకోవాలి.
  2. ఆ తర్వాత శిరస్సున అక్షితలు వేసుకోవాలి. అప్పుడే ఈ వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది.
  3. వ్రతం ఆచరించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. సునంద లోకంలో కానీ గణేశుని లోకంలో కానీ శాశ్వత స్థానం పొందడానికి అవుతుంది.

విఘ్నాలు తొలగిపోతాయి

  1. సంకటహర చతుర్థి నాడు కష్టాల నుంచి గట్టెక్కడానికి ఈ వ్రతం ఆచరిస్తే విఘ్నాలు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు.
  2. గణేషుడు స్తోత్రం చదువుకుని వ్రత కథని చదవాలి.

వ్రత విధానం

  1. సంకటహర చతుర్థి వ్రతాన్ని 3,5, 11, 21 నెలలు పాటు చేస్తారు.
  2. ఉదయాన్నే శిరస్సున స్నానం చేసి తర్వాత గణపతిని ఆరాధించాలి.
  3. తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్టుముక్కను వినాయకుడు ముందు పెట్టాలి.
  4. పసుపు, కుంకుమలతో అలంకరణ చేయాలి.
  5. తర్వాత మూడు గుప్పెళ్ళ బియ్యంతో పాటుగా తమలపాకు రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి కోరికను తలుచుకుని దానిని మూట కట్టాలి.
  6. వ్రత కథ చదువుకోవాలి. తర్వాత మూటని దేవుడి దగ్గర పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ కానీ పండ్లు కానీ స్వామికి నివేదన చేయాలి. వినాయకుని ఆలయంలో 3, 11 లేదంటే 21 ప్రదక్షిణలు చేయాలి

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner