కార్తీక మాసంలో సంకటహర చతుర్ధి ఏరోజు ఆచరించాలి? దాని ఫలితమేమిటి?-sankata hara chaturthi in kartika masam observance and outcomes ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కార్తీక మాసంలో సంకటహర చతుర్ధి ఏరోజు ఆచరించాలి? దాని ఫలితమేమిటి?

కార్తీక మాసంలో సంకటహర చతుర్ధి ఏరోజు ఆచరించాలి? దాని ఫలితమేమిటి?

HT Telugu Desk HT Telugu
Nov 29, 2023 05:30 PM IST

సంకట హర చతుర్ధి వ్రతం సాయంకాల సమయంలో చవితి చంద్రుడు వ్యాప్తి ఉన్న సమయమునే ఆచరించాలని శాస్త్రాలు తెలియచేసిన కారణంగా 30 నవంబర్‌ 2023 సాయంత్ర సమయానికే సంకటహర చతుర్ధి వ్రతాన్ని ఆచరించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు

సంకట హర చతుర్థి రోజు గణేషుడిని పూజించాలి
సంకట హర చతుర్థి రోజు గణేషుడిని పూజించాలి (Pixabay)

న కార్తీకే సమో మాసః కార్తీక మాసంతో సమానమైన మాసం మరొకటి లేదని ఈ మాసంలో ఆచరించేటటువంటి వ్రతాలు, పుణ్యనదీ స్నానాలు, జపతప హోమాలు శివ మరియు విష్ణు ఆరాధనలు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్‌ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 30 నవంబర్‌ 2023 తృతీయ తిథి మధ్యాహ్నం 2.24 నిమిషాల వరకు వ్యాప్తి ఉందని, మధ్యాహ్నం 2.25 నుండి 1 డిశంబర్‌ 2023 శుక్రవారం మధ్యాహ్నం 3.35 వరకు చవితి తిథి ఉందని వివరించారు.

అయితే సంకట హర చతుర్ధి వ్రతం సాయంకాల సమయంలో చవితి చంద్రుడు వ్యాప్తి ఉన్న సమయమునే ఆచరించాలని శాస్త్రాలు తెలియచేసిన కారణంగా 30 నవంబర్‌ 2023 సాయంత్ర సమయానికే సంకటహర చతుర్ధి వ్రతాన్ని ఆచరించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఏ వ్యక్తి అయినా తన జీవితంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవ్వకపోతే ఏదైనా పని ప్రారంభించినా లేదా పని జరుగుతున్నసమయంలో విఘ్నాలు ఎదురవుతున్నా అవివాహితులకు వివాహం ఆలస్యము అయినా, వివాహితులకు కుటుంబమునందు సమస్యలు ఏర్పడినా, ఉద్యోగులకు ఉద్యోగములో నిలకడ లేకపోయినా వ్యాపారస్తులకు వ్యాపార సమస్యలు ఏర్పడుతున్నా ఇటువంటి వారందరు సంకటహర చతుర్ధి వ్రతాన్ని ఆచరించడం వలన వారి సమస్యలు తొలగుతాయని శాస్త్రాలు తెలియచేస్తున్నాయని చిలకమర్తి తెలిపారు.

ఇక కార్తీక మాసంలో సంకటచతుర్ధి వంటి వ్రతాన్ని ఆచరించడం అత్యంత ఫలదాయకమని చిలకమర్తి వివరించారు. 30 నవంబర్‌ 2023 గురువారం రోజు నియమనిష్టలతో శుచియై కార్తీక పుణ్య స్నానాదులు వంటివి ఆచరించుకుని ఉదయం నుండి ఉపవాసముండి సాయంత్రం చంద్రోదయం అయిన తరువాత సంకటహర చతుర్ధి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అట్టి వారికి, వినాయకవ్రతాన్ని ఆచరించి నక్షత్ర దర్శనం తరువాత ఆహారాన్ని స్వీకరిస్తారో అట్టివారికి సంకటహర చతుర్ధి వ్రతఫలం లభించి వినాయకుని యొక్క అనుగ్రహం చేత విఘ్నములు తొలగి శుభములు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

WhatsApp channel