Debts: అప్పుల బాధ నుంచి బయటపడాలంటే ఈ రుణ విమోచన స్తోత్రాన్ని పఠించండి
Debts: రుణ విమోచన శ్రీ లక్ష్మీనరసింహ స్తోత్రాన్ని రోజు 18 సార్లు చదువుకుంటే ధైర్యం పెరుగుతుంది. మీ అప్పుల్ని మీరు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. గురువారం నాడు ఈ స్తోత్రాన్ని పఠించడం మొదలు పెడితే మంచిది.
చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కొంచెం కష్టమైనదే. అప్పుల్లో కూరుకుపోయి, అందులో నుంచి బయటకు రాలేక ఎంతో మంది చింతిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యల నుంచి సులువుగా బయటపడొచ్చు. సంతోషంగా ఉండొచ్చు.
లక్ష్మీ నరసింహ స్వామిని తలుచుకుని ధ్యానం చేస్తే మంచి ఫలితాలు కనబడతాయి. అంతే కాకుండా ప్రతి రోజు సాయంత్రం దీపారాధన చేయడం మంచిది. రుణమోచన శ్రీ లక్ష్మీనరసింహ స్తోత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు కనబడతాయి.
ధ్యానం
వాగీశా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి
యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే
అథ స్తోత్రం
దేవతాకార్యసిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవమ్
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
లక్ష్మ్యాలింగిత వామాంకం భక్తానాం వరదాయకమ్
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణమ్
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
సింహనాదేన మహతా దిగ్విదిగ్భయనాశనమ్ (దిగ్దంతి)
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
ప్రహ్లాదవరద శ్రీశం దైత్యేశ్వరవిదారణమ్
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
వేదవేదాంతయజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితమ్
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
ఇత్థం యః పఠతే నిత్యం ఋణమోచన సిద్ధయే (సంజ్ఞితం)
అనృణో జాయతే శీఘ్రం ధనం విపులమాప్నుయాత్
సర్వసిద్ధిప్రదం నృణాం సర్వైశ్వర్యప్రదాయకమ్
తస్మాత్ సర్వప్రయత్నేన పఠేత్ స్తోత్రమిదం సదా..