ఈ రాశుల వారు రూబీని ధరిస్తే అదృష్టం, సంపదతో పాటు ఎన్నో లాభాలను పొందవచ్చు.. ఎలా ధరించాలో కూడా తెలుసుకోండి!-ruby will bring lots of luck wealth to these rasis and see how to wear as well ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ రాశుల వారు రూబీని ధరిస్తే అదృష్టం, సంపదతో పాటు ఎన్నో లాభాలను పొందవచ్చు.. ఎలా ధరించాలో కూడా తెలుసుకోండి!

ఈ రాశుల వారు రూబీని ధరిస్తే అదృష్టం, సంపదతో పాటు ఎన్నో లాభాలను పొందవచ్చు.. ఎలా ధరించాలో కూడా తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

రూబీ సూర్య గ్రహానికి సంబంధించినది. సూర్యుడు ఆత్మవిశ్వాసం, కీర్తి, విజయం, ఆరోగ్యాన్ని అందిస్తాడు. ఒకరి జాతకంలో సూర్యుడు స్థానం బలహీనంగా ఉంటే వారు విజయాన్ని సాధించలేరు. ఆత్మవిశ్వాసం కూడా వారికి తక్కువగా ఉంటుంది. వారు రూబీని ధరించడం మంచిది.

ఈ రాశుల వారు రూబీని ధరిస్తే అదృష్టం, సంపదతో పాటు ఎన్నో లాభాలను పొందవచ్చు (pinterest)

చాలా మంది ఏ సమస్య ఉండకూడదని రత్నాలను, రంగురాళ్లను ధరిస్తూ ఉంటారు. వీటి వలన సమస్యలు తొలగిపోతాయని భావిస్తారు. వాటిలో రూబీ కూడా ఒకటి. రూబీ సూర్య గ్రహానికి సంబంధించినది. సూర్యుడు ఆత్మవిశ్వాసం, కీర్తి, విజయం, ఆరోగ్యాన్ని అందిస్తాడు. ఒకరి జాతకంలో సూర్యుడు స్థానం బలహీనంగా ఉంటే వారు విజయాన్ని సాధించలేరు.

ఆత్మవిశ్వాసం కూడా వారికి తక్కువగా ఉంటుంది. కీర్తి రాదు. ఆరోగ్యం కూడా ఉండదు. రత్న శాస్త్రం ప్రకారం అటువంటివారు రూబీని ధరించడం వలన సమస్యలు ఏమీ ఉండవు.

రూబీని ధరించడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయి?

జ్యోతిష్య నిపుణులు, రూబీని ధరించడం వలన కలిగే లాభాలను వివరించారు. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాల్లో ఉన్నవారు రూబీ రత్నాన్ని ధరిస్తే విజయాన్ని, అనేక అవకాశాలని పొందవచ్చు. ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. కీర్తిని పొందవచ్చు.

ఈ రాశుల వారికి రూబీ అదృష్టాన్ని తీసుకువస్తుంది:

మేష రాశి, సింహ రాశి, ధనుస్సు రాశి వారు రూబీని ధరించడం వలన అనేక లాభాలని పొందవచ్చు. అదే విధంగా, సూర్యుడు అధిక లేదా సానుకూల స్థానంలో ఉంటే ఆ వ్యక్తులు రూబీని ధరించవచ్చు.

ఏ రాశుల వారు రూబీని ధరించకూడదు?

కన్య రాశి, మకర రాశి, మిథున రాశి, తులా రాశి, కుంభ రాశి వారు రూబీని ధరించడం మంచిది కాదు. ఒకవేళ ధరించాలంటే జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

రూబీని ఎలా ధరించాలి?

  1. రూబీని బంగారం లేదా రాగి ఉంగరంలో వేసి ధరించవచ్చు.
  2. ఉంగరాన్ని ఉంగరం వేలుకు ధరించాలి.
  3. ఆదివారం నాడు, సూర్యోదయం సమయంలో స్నానం చేసి గంగాజలం లేదా పచ్చిపాలతో శుద్ధి చేసి, ఆ తర్వాత పూజ చేసి ఉంగరాన్ని ధరించాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.