Mars Retrograde: కుజుడి తిరోగమనంతో ఈ రాశుల వారికి అశుభం, ఫిబ్రవరి వరకూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Mars Retrograde: డిసెంబర్ లో కుజుడు తిరోగమనంలో వస్తాడు. కుజుడి వ్యతిరేక కదలికల కారణంగా అనేక రాశుల వారు అశుభ ఫలితాలను పొందుతారు. 2025 ఫిబ్రవరి వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది. కుజుడి తిరోగమనం వల్ల ఏయే రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ధనం, కీర్తి, విజయం, శ్రేయస్సుకు కారకుడు. కుజుడు అనుకూలంగా లేకపోతే వ్యక్తి పేరు ప్రతిష్టలు పొగుట్టుకుంటాడు, ఆరోగ్య సమస్యుల తలెత్తుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరమైన సమస్యలు వెంటాడతాయి. గ్రహాల అధిపతి కుజుడు డిసెంబర్ 7న తన రాశిని మార్చుకుని కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కుజుడు తన ప్రయాణాన్ని తలకిందుగా చేస్తాడు. దీన్నే జ్యోతిష్య భాషలో తిరోగమనం అంటారు. కుజుడి తిరోగమన ప్రయాణం అన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష లెక్కల ప్రకారం మొదటి, రెండో, ఐదో, ఏడో, తొమ్మిదవ, పంచాంగంలో సంచరించే రాశిచక్రాల వారికి కుజుడి తిరోగమనం చాలా హానికరంగా ఉంటుంది.
ద్రిక్ పంచాంగం ప్రకారం, అంగారక గ్రహం(కుజుడు) 7 డిసెంబర్ 2024, శనివారం ఉదయం 05:01 గంటలకు కర్కాటక రాశిలోకి తిరోగమనం చెందుతుంది. తిరిగి ఫిబ్రవరి 24, 2025 సోమవారం ఉదయం 07:27 గంటలకు నేరుగా తిరుగుతుంది. అప్పటి వరకూ కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తప్పవు. ఆ రాశులేవో తెలుసుకుందాం.
కుజుడి తిరోగమనం ఏయే రాశుల వారికి కష్టాలను తెచ్చిపెడుతుంది?
1. మేష రాశి :
కుజుడి తిరోగమనం మేష రాశి వారికి చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా పనిచేయాలి, లేకపోతే నష్టం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుక మీ ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచండి. ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందదు. ఆర్థిక పరమైన ఇబ్బందులు బాధ పెడతాయి.
2. సింహం రాశి:
సింహ రాశి వారికి కుజుడు తిరోగమనం హానికరంగా ఉంటుంది. అంగారక గ్రహం రివర్స్ కదలిక సమయంలో వీరికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంట్లో చికాకు, గొడవలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అప్పుల బాధ పీడిస్తుంది.
3. ధనుస్సు రాశి:
అంగారక గ్రహం రివర్సలో కదలడం వల్ల ధనుస్సు రాశి వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి లేదంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. తోబుట్టువుల మధ్య వివాదాలు తలెత్తవచ్చు. మీరు శారీరక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇంటా, బయటా చికాకుతో కూడిన వాతావరణం ఇబ్బంది పెడుతుంది.
4. మీన రాశి:
కుజుడి తిరోగమన ప్రయాణంతో మీన రాశి జాతకుల మాటతీరు దెబ్బతింటుంది. ఆర్థికంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం లోపించవచ్చు. ప్రభుత్వ యంత్రాంగానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. వాదోపవాదాలకు దూరంగా ఉండండి, లేకపోతే మీరు కోర్టుకు వెళ్ళవలసి ఉంటుంది.