Remedies for Daily problems: ఎండు మిరపకాయలతో ఈ పరిహారాలను పాటిస్తే.. ధన వర్షం కురుస్తుంది.. అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి
Remedies for Daily problems: పదే పదే కష్టాలని ఎదుర్కొంటున్నా, మీ పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నా దానికి కారణం చెడు దృష్టి కావచ్చు. చెడు దృష్టి నుంచి బయటపడడానికి శనివారం మీపై మీ పిల్లలపై ఎర్ర మిరపకాయలని తిప్పి మంటల్లో వేయండి. ఇలా చేయడం వలన చెడు దృష్టి తొలగిపోతుంది.
ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ముందుకు వెళ్లాలని అనుకుంటారు. అందుకోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి కష్టపడి పని చేసినా కూడా ఫలితం రాదు. ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ ఫలితం రానట్టయితే ఇలా చేయండి. జ్యోతీష్య నిపుణులు జ్యోతిష్యం ప్రకారం కొన్ని పరిహారాలని చెప్పారు.
ఇలా చేయడం వలన మంచి జరిగి కష్టాల నుంచి గట్టెక్కొచ్చు. ఇబ్బందులను కూడా ఉండవు. సంతోషంగా ఉండొచ్చు. ఎలాంటి ఆటంకాలు అయినా తొలగిపోవడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తయిపోతాయి.
చెడు దృష్టిని తొలగించడానికి ఇలా చేయండి
శనివారం నాడు ఇలా చేయండి
పదే పదే కష్టాలని ఎదుర్కొంటున్నా, మీ పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నా దానికి కారణం చెడు దృష్టి కావచ్చు. చెడు దృష్టి నుంచి బయటపడడానికి శనివారం మీపై మీ పిల్లలపై ఎర్ర మిరపకాయలని తిప్పి మంటల్లో వేయండి. ఇలా చేయడం వలన చెడు దృష్టి తొలగిపోతుంది.
హనుమాన్ ఆలయం
కుటుంబ ఆర్థిక సంక్షోభాన్ని అతిక్రమించడానికి శనివారం నాడు సమీపంలోని హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమంతుడికి నాలుగు ఎర్ర మిరపకాయలను సమర్పించండి. శనివారం నాడు ఈ పరిహారాన్ని పాటించడం వలన డబ్బుకి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది.
వ్యాపారంలో లాభాలు రావాలంటే ఇలా చేయండి
చాలామంది ప్రతికూల ప్రభావం వలన వ్యాపారంలో నష్టపోతూ ఉంటారు. వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయి. అలాంటి వాళ్ళు వ్యాపారంలో లాభాలు రావడానికి శనివారం నాడు ఆఫీసు ముఖద్వారం దగ్గర రెండు ఎర్ర మిరపకాయలని కట్టాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పరిహారాన్ని పాటించడం వలన ప్రతికూలత తొలగిపోతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పురోగతిని కలుగుతుంది.
ప్రతికూల శక్తిని ఇలా తొలగించండి
పదేపదే మీ చుట్టూ ప్రతికూల శక్తి తిరుగుతున్నట్లు మీకు అనిపిస్తున్నట్లయితే ఇలా చేయండి. కొంతమందికి ప్రతికూల శక్తి కారణంగా వచ్చిన డబ్బులు పోవడం, కుటుంబంలో గొడవలు జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు శనివారం ఇంటి ప్రధాన ద్వారానికి 7 ఎండు మిరపకాయలని కట్టండి. ఈ పరిహారాన్ని పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
గ్రహ దోషాలని ఇలా తొలగించుకోవచ్చు
జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలగడానికి గ్రహాలు, నక్షత్రాలు కదలికలు సరిగ్గా ఉండేటట్లు చాలా ముఖ్యం. గ్రహదోషాలని తొలగించుకోవడానికి నక్షత్రాలు కదలికలు సరిగ్గా ఉంచడానికి శనివారం ఎర్ర మిరపకాయలని నీటిలో వెయ్యండి. ఇలా చేయడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం