మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకం చదవడం వలన చాలా సమస్యల నుంచి సులువుగా బయటపడడానికి అవుతుంది. సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేసినది. వీలైనప్పుడల్లా దీనిని చదువుకోవచ్చు.
రోజుకి ఒకసారి లేదా నచినన్నిసార్లు చదువుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా చదవవచ్చు. అందులో నియమం లేదు. 3, 5 లేదా 11 సార్లైనా పట్టించవచ్చు. కష్టాల్లో ఉన్నవారు ఈ అష్టకాన్ని చదివితే కష్టాలన్నీ తీరిపోతాయి. ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు.
హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మ బంధో..
శ్రీశాది దేవగణపూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (1)
దేవాది దేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద..
దేవర్షి నారదమునీంద్రసుగీతకీర్తే
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (2)
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ..
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (3)
క్రౌంచా సురేంద్ర పరిఖండన శక్తి శూల
పాశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణే..
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (4)
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్..
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (5)
హారాదిరత్నమణియుక్త కిరీటహార
కేయూర కుండలలసత్కవచాభి రామ..
హే వీర తారక జయాఽమరబృందవంద్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (6)
పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (7)
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్..
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (8)
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః..
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి....
పెళ్లి సమస్యలతో బాధపడే మగవారు సుబ్రహ్మణ్య కల్యాణాన్ని చేయాలి. 41 రోజుల పాటు భక్తులతో పారాయణ చేసి, ఏదైనా స్వహస్తాలతో నైవేద్యంగా చేసి పెడితే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు.
రోజూ సుబ్రమణ్య స్వామి ఆలయానికి వెళ్లి 21 ప్రదక్షిణాలు చేయాలి. గోత్ర నామాలతో అర్చన చేయించుకుంటే కూడా మంచిది. సంకల్పం చెప్పేటప్పుడు వివాహ దోష పరిహారం అని చెప్పాలి. ఇలా చెప్తే వివాహ దోషాలు పరిష్కారం అవుతాయి. శుభం కలుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం