Radhakrishna Ashtakam: హోలీ రోజు ఈ శక్తివంతమైన అష్టకాన్ని పఠించండి, శ్రీకృష్ణుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి-recite radhakrishna ashtakam on holi for lord krishna blessings and difficulties goes away ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Radhakrishna Ashtakam: హోలీ రోజు ఈ శక్తివంతమైన అష్టకాన్ని పఠించండి, శ్రీకృష్ణుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి

Radhakrishna Ashtakam: హోలీ రోజు ఈ శక్తివంతమైన అష్టకాన్ని పఠించండి, శ్రీకృష్ణుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి

Peddinti Sravya HT Telugu
Published Mar 14, 2025 07:00 AM IST

Radhakrishna Ashtakam: హోలీ పండుగ నాడు రాధాకృష్ణుడిని ఆరాధిస్తూ ఉంటాం. రాధాకృష్ణుడిని ఆరాధించడం వలన ప్రేమ జీవితంలో, వైవాహిక జీవితంలో ప్రశాంతత కలుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు. శ్రీరాధాకృష్ణాష్టకమ్ చదవడం వలన రాధాకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది.

శ్రీరాధాకృష్ణాష్టకమ్
శ్రీరాధాకృష్ణాష్టకమ్ (pinterest)

ఈసారి మార్చి 14న అంటే ఈరోజు హోలీ పండుగను జరుపుకోనున్నాము. హోలీ రోజున ప్రతీ ఒక్కరూ ఒకరితో ఒకరు శత్రుత్వాన్ని మరచి సరదాగా రంగుల పండుగను జరుపుకుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి కూడా ఇది ఒక ప్రత్యేక సమయం. రంగుల హోలీ రోజున అందరూ హోలీ సరదాలో మునిగిపోతారు.

ఈ రోజున, ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకోవడం,కుటుంబంతో సరదాగా గడపడం నృత్యం చేయడం వంటివి చేస్తారు. వీటితో పాటుగా హోలీ పండుగ నాడు రాధాకృష్ణుడిని ఆరాధిస్తూ ఉంటాం. రాధాకృష్ణుడిని ఆరాధించడం వలన ప్రేమ జీవితంలో, వైవాహిక జీవితంలో ప్రశాంతత కలుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు. హోలీ నాడు శ్రీరాధాకృష్ణాష్టకమ్ చదవడం వలన రాధాకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. పైగా శుభ ఫలితాలను కూడా అందుకోవచ్చు.

శ్రీరాధాకృష్ణాష్టకమ్

యః శ్రీ గోవర్ధనాద్రిం సకల సురపతీంస్తత్రగోగోపబృందం

స్వీయం సంరక్షితుం చేత్యమరసుఖకరం మోహయన్ సందధార..

తన్మానం ఖండయిత్వా విజితరిపుకులో నీలధారాధరాభః

కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ..

యం దృష్ట్వా కంసభూపః స్వకృతకృతిమహో సంస్మరన్మంత్రివర్యాన్

కిం వా పూర్వం మయేదం కృతమితి వచనం దుఃఖితః ప్రత్యువాచ..

ఆజ్ఞప్తో నారదేన స్మితయుతవదనః పూరయన్సర్వకామాన్

కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ..

యేన ప్రోద్యత్ప్రతాపా నృపతికులభవాః పాండవాః కౌరవాబ్ధిం

తీర్త్వా పారం తదీయం జగదఖిలనృణాం దుస్తరంచేతి జగ్ముః..

తత్పత్నీచీరవృద్ధిప్రవిదితమహిమా భూతలే భూపతీశః

కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ..

యస్మై చోద్ధృత్య పాత్రాద్దధియుతనవనీతం కరైర్గోపికాభి

ర్దత్తం తద్భావపూర్తౌ వినిహితహృదయస్సత్యమేవం తిరోధాత్..

ముక్తాగుంజావళీభిః ప్రచురత మరుచిః కుండలా క్రాంతగండః

కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ..

యస్మాద్విశ్వాభి రామా దిహ జననవిధౌ సర్వనందాది గోపాః

సంసారార్తేర్విముక్తాః సకలసుఖకరాః సంపదః ప్రాపురేవ..

ఇత్థం పూర్ణేందువక్త్రః కలకమలదృశః స్వీయజన్మ స్తువంతః

కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ...

యస్య శ్రీనందసూనోః వ్రజయువతిజనాశ్చాగతా భర్తృపుత్రాం

స్త్యక్త్వా శ్రుత్వా సమీపే విచకితనయనాః సప్రమోదాః స్వగేహే..

రంతుం రాసాదిలీలా మనసిజదలితా వేణునాదం చ రమ్యం

కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ..

యస్మిన్ దృష్టే సమస్తే జగతి యువతయః ప్రాణనాథవ్రతాయా

స్తా అప్యేవం హి నూనం కిమపి చ హృదయే కామభావం దధత్యః..

తత్స్నేహాబ్ధిం వపుశ్చేదవిదితధరణౌ సూర్యబింబస్వరూపాః

కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ...

యః స్వీయే గోకులేఽస్మిన్విదితనిజకులోద్భూతబాలైః సమేతో

మాతర్యేవం చకార ప్రసృతతమగుణాన్బాలలీలావిలాసాన్..

హత్వా వత్సప్రలంబద్వివిదబకఖరాన్గోపబృందం జుగోప

కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ..

కృష్ణారాధాష్టకం ప్రాతరుత్థాయ ప్రపఠేన్నరః

య ఏవం సర్వదా నూనం స ప్రాప్నోతి పరాం గతిమ్...

ఇతి శ్రీరఘునాథచార్య విరచితం శ్రీరాధాకృష్ణాష్టకమ్

శ్రీరాధాకృష్ణాష్టకమ్ ఎలా చదువుకోవాలి?

  1. హోలీ రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి, రాధాకృష్ణుడు ఫోటో ముందు దీపారాధన చేయండి.
  2. ఆ తర్వాత ఆ పూలు, పండ్లు, రాధాకృష్ణుడికి ఇష్టమైన వెన్న సమర్పించండి.
  3. ఆ తర్వాత రాధాకృష్ణుడి అష్టకాన్ని చదువుకోండి.
  4. చివరగా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి రాధాకృష్ణుడి అనుగ్రహాన్ని పొందండి.
  5. రాధాకృష్ణులకి మీ కోరికలు చెప్పి ఇలా ప్రార్ధించడం వలన మీ కోరికలు తీరుతాయి. హోలీ రోజు ఇలా రాధాకృష్ణుని ఆరాధించడం వలన వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.

శ్రీరాధాకృష్ణాష్టకమ్ చదివితే ఏమవుతుంది?

శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందడంతో పాటుగా వైవాహిక జీవితంలో సంతోషాన్ని పొందవచ్చు. ప్రేమ జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి. సంతోషంగా, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇవి సానుకూల శక్తిని ప్రవేశించేలా చేస్తాయి. ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. ఈ స్తోత్రాన్ని చదవడం వలన మీ కోరికలు కూడా నెరవేరుతాయి.

Peddinti Sravya

eMail
Whats_app_banner

సంబంధిత కథనం