Powerful Mantras: పీడకలలు బాగా ఇబ్బంది పెడుతున్నాయా? ఈ ఏడు మంత్రాలను నిష్టగా చదవండి!
Powerful Mantras: పీడకలలు తరచూ బాగా ఇబ్బంది పెడుతున్నాయా? అర్థరాత్రి అకస్మాత్తుగా మెలకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టడం కష్టతరంగా మారిందా. అయితే ఈ శక్తివంతమైన మంత్రాలు మీ కోసమే. పడుకునే ముందు వీటిని నిష్టగా చదివారంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు
పీడకలలు తరచూ చాలా మందిని ఇబ్బందిని పెడుతుంటాయి. వీటి కారణంగా నిద్రలో సడెన్ గా లేచి కూర్చొంటారు. తర్వాత నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. ఫలితంగా నిద్రలేమి, ఒత్తిడి, కోపం, చిరాకు వంటి మానసిక సమస్యలతో పాటు ఎన్నో శారీరక సమస్యలు తలెత్తుంటాయి. పురాణాల ప్రకారం వీటికి ఓ పరిష్కారం ఉంది. ఫిజికల్ గా కనిపించని ఎన్నో ప్రతికూల శక్తులను, దుష్ట శక్తులను అడ్డుకోవడానికి ఏకైక మార్గం దేవతారాధన. మంత్రాలను జపించడం, శ్లోకాలను పఠించడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడచ్చు.
మతగ్రంథాల ప్రకారం మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చేసే ప్రతి పనికి ప్రత్యేక మంత్రం ఉంటుంది. మంత్రాలు పఠించడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారిపోవడంతో పాటు తలపెట్టిన పని శుభప్రదంగా ముగుస్తుందని నమ్మిక. నిద్రపోయే సమయంలో కూడా మంత్రాలు చాలా బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా పీడకలల కారణంగా, నిద్ర సరిపోక మానసికంగా, ఎమోషనల్ గా బలహీనపడుతున్న వారికి కొన్ని మంత్రాలు సహాయపడతాయి. పడుకునే ముందు వీటిని నిష్టగా పఠించారంటే పీడకలలు, భయంభయంగా అనిపించడం వంటివి తొలగిపోతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గి అంతర్గత ప్రశాంతత పెరుగుతుంది. మనస్సును శుద్ధి చేసి దుష్ట శక్తుల ప్రభావం నుంచి రక్షణ కల్పిస్తుంది. వీటిని రోజూ పఠించడం వల్ల ప్రశాంతమైన రాత్రులు, పీడకలలు లేని నిద్రలతో హాయిగా ఉండొచ్చు.
నిద్రపోయే ముందు పఠించాల్సిన 7 శక్తివంతమైన మంత్రాలు
1. బౌద్ధ మంత్రం:
నిద్రకు ఉపక్రమించే ముందు 'ఓం మణి పద్మే హుమ్'ను పదేపదే చదవడం వల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది. ఈ బౌద్ధ మంత్రం వల్ల మనస్సు, శరీరం శుద్ధి అయి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. రోజూ 7 నుంచి 11 సార్లు చదవడం వల్ల మీ శరీరంలో ఒక కాంతిని గమనిస్తారు. మీ నిద్రలోనే సమస్యలను, భయాలను పూర్తిగా మరిచిపోతారు.
2. గాయత్రి మంత్రం:
గాయత్రి మంత్రం, "ఓం భూర్భువ: స్వాహా," అనేది పురాతన కాలం నుంచి పఠిస్తున్న ఒక వేదమంత్రం. ఇది ఆధ్యాత్మిక వికాసం, ప్రకాశాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ మంత్రాన్ని నిద్రకు ముందు జపించడం మానసిక శాంతిని తీసుకురావడంలో, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. గాయత్రి మంత్రాన్ని 3-5 సార్లు పఠించండి. ఈ మంత్రాన్ని చదువుతున్నంతసేపు ఈ శబ్ద అనుద్వనాలను మాత్రమే వింటూ ఉండండి.
3. మహా మృత్యుంజయ మంత్రం:
మహా మృత్యుంజయ మంత్రం, "ఓం త్రయంబకం యజామహే," అనేది ఒక శక్తివంతమైన మంత్రం. ఇది ప్రతికూల శక్తుల నుండి రక్షణను అందించి, శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. ఈ మంత్రాన్ని నిద్రకు ముందు జపించడం చెడు కలలు, భయానక కలలను తొలగించడంలో సహాయపడుతుంది. మహా మృత్యుంజయ మంత్రాన్ని 5-7 సార్లు పఠించండి. మీ చుట్టూ రక్షణ కవచం కలిగి ఉండాలని ధ్యానించండి.
4. శాంతి మంత్రం:
ఓం శాంతి శాంతి శాంతి: నిద్రకు ముందు పఠించేందుకు "ఓం శాంతి శాంతి శాంతి" మంత్రం చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. కానీ చాలా ప్రభావవంతమైనది. ఇది మానసిక శాంతిని అందించి విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఈ మంత్రం శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడంలో, ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ మంత్రాన్ని 3-5 సార్లు పఠించండి, శబ్దం ద్వారా మీ శరీరంలో కలుగుతున్న మార్పులను గమనిస్తూ ధ్యానించండి.
5. దుర్గా మంత్రం:
"ఓం దుం దుర్గాయే నమహా," అనేది దుర్గాదేవిని స్మరిస్తూ ఆమె శరణు కోరుకునే శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని నిద్రకు ముందు జపించడం వల్ల చెడు కలలు, భయానక కలలను రాకుండా అడ్డుకునేందుకు సహాయపడుతుంది. ఒక ప్రశాంతమైన నిద్రని ప్రోత్సహించి శరీరానికి చక్కటి విశ్రాంతిని ఇస్తుంది. రోజూ క్రమం తప్పకుండా దుర్గా మంత్రాన్ని 5-7 సార్లు పఠించండి. అమ్మవారి రక్షణ శక్తి మీ చుట్టూ ఉండేలా చూసుకోండి.
6. ఓం తత్ సత్:
"ఓం తత్ సత్"ని నిద్రకు ముందు పఠించడం విశ్వంతో కనెక్ట్ కావడంలో, ఆధ్యాత్మిక వికాసాన్ని ప్రోత్సహించడంలో శక్తివంతమైన మార్గం. ఈ మంత్రం మానసిక, శారీరక శాంతిని తీసుకొస్తుంది. ఒత్తిడిని దూరం చేసి ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఈ మంత్రాన్ని 3-5 సార్లు పఠించండి.
7. రక్షా మంత్రం:
"ఓం సర్వే భద్రాణి పశ్యంతు," అనేది ఒక రక్షణ మంత్రం, ఇది ప్రతికూల శక్తులను తొలగించి, శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. ఈ మంత్రాన్ని నిద్రకు ముందు జపించడం వల్ల శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. ఒత్తిడితో పాటు ఆందోళనను తగ్గించి శరీరానికి ప్రశాంతత చేకూరుస్తుంది. మీ చుట్టూ రక్షణ కవచం కలిగి ఉండేలా రక్షా మంత్రాన్ని ప్రతిరోజూ 5-7 సార్లు పఠించండి.