Ravi Pradosh Vrat: రేపే రవి ప్రదోష వ్రతం.. శుభ ముహూర్తం, పూజా విధానంతో పాటు, శివుడుని ప్రసన్నం చేసుకునే మార్గాలు చూడండి
Ravi Pradosh Vrat: 2025 ఫిబ్రవరి 9వ తేదీన రవి ప్రదోష వ్రతం ఉంది. ఈ రోజు శివుని పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రవి ప్రదోష వ్రతం చేస్తే దీర్ఘాయువు లభిస్తుందని నమ్ముతారు.

హిందూ ధర్మంలో ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు దేవాలయాలలో దేవతలకు పూజలు జరుగుతాయి. ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి తిథి రోజున ప్రదోష వ్రతం ఉంటుంది. ధార్మిక నమ్మకాల ప్రకారం, ప్రదోష వ్రతం చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, సంపదలు పెరుగుతాయి.
అన్ని దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది. ద్రిక్ పంచాంగం ప్రకారం, ఫిబ్రవరి నెలలో మొదటి ప్రదోష వ్రతం 2025 ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం నాడు ఉంది. కాబట్టి దీన్ని రవి ప్రదోష వ్రతం అంటారు.
రవి ప్రదోష వ్రతం చేస్తే దీర్ఘాయువు, ఆరోగ్యం లభిస్తుందని చెబుతారు. ప్రదోష వ్రతం సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం మరియు ఇతర విషయాలను తెలుసుకుందాం.
రవి ప్రదోష వ్రతం ఎప్పుడు?
ద్రిక్ పంచాంగం ప్రకారం, మాఘ మాసం శుక్ల పక్ష త్రయోదశి తిథి ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 7:25 నిమిషాలకు ప్రారంభమై, తరువాతి రోజు ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం 6:57 నిమిషాలకు ముగుస్తుంది. ప్రదోష వ్రతంలో సాయంకాలపు పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఫిబ్రవరి 9వ తేదీన ప్రదోష వ్రతం ఉంటుంది.
ప్రదోష కాల పూజ ముహూర్తం:
ప్రదోష వ్రతం రోజు సాయంత్రం ప్రదోష కాలంలో శివుని పూజ చేయడం చాలా ముఖ్యం. ఈ రోజు సాయంత్రం 6:18 నిమిషాల నుండి రాత్రి 8:49 నిమిషాల వరకు ప్రదోష పూజకు శుభ ముహూర్తం.
పూజా సామాగ్రి:
రవి ప్రదోష రోజు పూజకు ఒక కలశం, ఉమ్మెత్త పూలు, కర్పూరం, తెల్లని పూలు, తెల్లని స్వీట్లు, తెల్లని చందనం, ధూపం, దీపం, నెయ్యి, తెల్లని వస్త్రాలు, మామిడి కొమ్మలు, హోమ సామాగ్రితో సహా అన్ని పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి.
రవి ప్రదోష వ్రతం 2025 పూజా విధానం
- రవి ప్రదోష వ్రతం రోజు ఉదయం త్వరగా లేవండి. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి.
- శివలింగానికి జలం అర్పించండి.
- ఆ తరువాత శివ పార్వతులకు పూజ చేయండి. సాయంత్రం శివుని పూజకు సిద్ధం చేసుకోండి.
- శివాలయానికి వెళ్లండి లేదా ఇంట్లోనే పూజ చేయండి.
- శివలింగానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గంగాజలం, చక్కెర అర్పించండి.
- శివునికి బిల్వపత్రాలు, పూలు సమర్పించండి. శివ పార్వతుల ముందు దీపం వెలిగించండి.
- శివుని మంత్రాలు -'ఓం నమః శివాయ' మరియు 'ఓం ఐం నమః శివాయ' అని జపించండి. ఆ తరువాత శివ పార్వతులతో సహా అన్ని దేవతలకు హారతి ఇవ్వండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.