రథ సప్తమి, సూర్య ఆరాధన వైభవం -బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ-ratha saptami surya aradhana vaibhvam from chilakamarthi prabhakar sarma check full details which are given here ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  రథ సప్తమి, సూర్య ఆరాధన వైభవం -బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

రథ సప్తమి, సూర్య ఆరాధన వైభవం -బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

HT Telugu Desk HT Telugu
Feb 02, 2025 10:00 AM IST

12 రాశులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టిన రోజు కాదు.. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.

రథ సప్తమి, సూర్య ఆరాధన వైభవం
రథ సప్తమి, సూర్య ఆరాధన వైభవం (pinterest)

yearly horoscope entry point

హిందూ సంప్రదాయంలో సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడిగా కొలుస్తాం. మాఘ మాసం శుక్ల పక్షం సప్తమి తిథి రోజు నాటి పర్వదినమే రథ సప్తమి.

సూర్యుడు ఏడు గుర్రాలతో రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.

విశ్వాన్ని ఒక వృత్తంలా భావిస్తే.. దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతోంది. సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు.

సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.

ఏడు గుర్రాలు.. ఏడు వారాలు

సూర్యుని ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు. ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అంటారు. మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో సూర్యుడు ప్రయాణిస్తాడు.

ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టిన రోజు కాదు.. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.

ద్వాదశ ఆదిత్యులు

భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలకూ అధిదేవతలు. వీరి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.

7 గుర్రాల పేర్లు

గాయత్రి, త్రిష్టుప్, జగతి అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ఠిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner