Ratha Saptami: రథసప్తమి నాడు ఈ 7 పాటిస్తే సూర్య భగవానుడి ఆశీస్సులు కలిగి కష్టాలు తీరుతాయి.. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా
Ratha Saptami: ఈరోజు సూర్యుడిని ఆరాధించడం వలన ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. రథసప్తమి నాడు దానధర్మాలు చేయడం వలన మన కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. సూర్యుడిని ఈరోజు ఆరాధించడం వలన ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
రథసప్తమినాడు సూర్యభగవానుడని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. ప్రతీ సంవత్సరం మాఘ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి నాడు రథసప్తమి పండుగను జరుపుకుంటాము. ఈరోజు ప్రత్యేకించి సూర్యదేవుని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు.

ఈరోజు సూర్యుడిని ఆరాధించడం వలన ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. రథసప్తమి నాడు దానధర్మాలు చేయడం వలన మన కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. సూర్యుడిని ఈరోజు ఆరాధించడం వలన ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
సంక్రాంతి నాడు సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. రథసప్తమి అంటే సూర్యుడు పుట్టిన రోజుగా భావిస్తారు. రథసప్తమి నాడు ఏం చేస్తే సూర్యుని అనుగ్రహాన్ని పొందవచ్చు?, ఎలా పాపాలని తొలగించుకుని శుభ ఫలితాలను పొందవచ్చు వంటి విషయాలని తెలుసుకుందాం.
రథసప్తమి నాడు పాటించాల్సిన పరిహారాలు
1. ఉపవాసం
హిందూ పురాణం ప్రకారం ఈరోజు ఉప్పు తినకూడదు. వీలైతే ఉపవాస దీక్ష ఆచరించడం మంచిది. ఉపవాసం ఉన్నవారు పండ్లు మాత్రమే తీసుకోవాలి. రథ సప్తమి నాడు ఈ విధంగా ఆచరించడం వలన జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల నుంచి సులువుగా బయటపడవచ్చు.
2.దానం
ఈ పవిత్రమైన రోజు ఉప్పుని దానం చేయడం వలన శక్తి, సామర్ధ్యాలు పెరుగుతాయి ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు. బెల్లం, రాగి వస్తువులు, గోధుమలు, ఎరుపు పసుపు రంగులో ఉండే దుస్తులను, ఎర్రచందనాన్ని దానం చేస్తే మంచిది.
3.నదిలో స్నానం
రథసప్తమి నాడు పవిత్ర నదిలో స్నానం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. నదికి వెళ్లడం వీలు కాని వారు నదీ జలాన్ని కొంచెం నీటిలో కలుపుకొని స్నానం చేయొచ్చు.
4.వీటిని పఠించండి
రథసప్తమి నాడు ఆదిత్య హృదయ స్తోత్రం, గజేంద్రమోక్షాన్ని పఠిస్తే మంచి ఫలితం కనబడుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు.
5.అర్ఘ్యం సమర్పించండి
రథసప్తమి నాడు సూర్యునికి పూజ చేసి రాగి పాత్రలో నీటితో నింపిన ఎర్రని పుష్పాన్ని ఉంచాలి. ఆ తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ విధంగా ఆచరించడం వలన అదృష్టం కలుగుతుంది. కష్టాల నుంచి బయట పడవచ్చు. అలాగే శత్రువులపై విజయం కూడా దక్కుతుంది.
6.ఇలా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడవచ్చు
సూర్యోదయానికి ముందు రథసప్తమి నాడు తలస్నానం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చు. దీర్ఘకాలిక సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.
7.లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి?
రథ సప్తమి నాడు మట్టికుండలో పాలను పెట్టండి. వాటిని వేడి చేసి తర్వాత పాలను సూర్యకిరణాల్లో ఉంచి సూర్యుడికి, లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో సూర్యుడు స్థానం కూడా బలపడుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం