రథసప్తమికి ఉన్న ప్రాముఖ్యత ఇంతా అంతా కాదు. రథ ఆరోగ్య సప్తమి అని కూడా దీనిని పిలుస్తారు. ఈరోజు సూర్యభగవానుడిని ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది. ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి నాడు సూర్యదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము. రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించినా, దానధర్మాలు చేసినా మన కోరికలు నెరవేరుతాయి.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈసారి మాఘ మాసం శుక్లపక్షంలో సప్తమి తిధి ఫిబ్రవరి 4, 2025 ఉదయం 7:56 గంటలకు ప్రారంభమవుతుంది. తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 5, 2025 తెల్లవారుజామున 5:29 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయంలో వచ్చే తిథిని చూసుకోవాలి కనుక ఫిబ్రవరి 5న బుధవారం సప్తమి తిధి ముగుస్తుంది కనుక ఫిబ్రవరి 4న రథసప్తమి జరుపుకోవాలని.
రథసప్తమి నాడు ఎందుకు జిల్లేడు ఆకులు, రేగు పండ్లను శిరస్సుపై పెట్టి స్నానం చేయాలి? రథసప్తమి రోజు నదీ స్నానం చేయడం వలన ఎంతో విశిష్ట ఫలితం ఉంటుంది. సూర్యుడుని ఆరాధించడం వలన తేజస్సు, ఐశ్వర్యం కలుగుతాయి. సూర్యోదయానికి ముందు నిద్రలేచి నదీ స్నానం చేయడం వలన సప్త జన్మల పాపాలు తొలగిపోతాయి. శోకము, రోగము వంటి బాధల నుంచి బయటపడవచ్చు.
అగ్నిష్వాత్తులు అనే పండితులు ఎంతో నిష్టగా ఎన్నో యజ్ఞాలు చేశారు. దానితో పరమాత్మ తృప్తి చెంది, స్వర్గానికి తీసుకురమ్మని దేవ విమానం పంపారు. ఆ సమయానికి వారు పూర్ణాహుతి చేస్తున్నారు. ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని చేస్తుండగా దేవ విమానాన్ని చూసి.. ఆ క్రతువుని కంగారుగా చేసేసారు.
అప్పుడే పెద్ద గాలి రావడం వలన వేడి నెయ్యి మేకపై పడి, చర్మ ఊడి చనిపోయింది. దీనితో ఆయన కంటే ముందు ఆ మేక ఆత్మ వెళ్లి దేవ విమానంలో కూర్చుంది. ఆ ఊడిపోయిన చర్మం జిల్లేడు చెట్టుపై పడడంతో ఆకులు కూడా మేక చర్మంలా మారాయి.
దీనితో అగ్నిష్వాత్తులు బాధ పడ్డారు. అప్పుడు ఆకాశవాణి చేసిన యజ్ఞఫలం మేకకి, జిల్లేడు చెట్టుకి దక్కిందని చెప్పింది. ఆ రోజు మాఘశుద్ధ సప్తమి అందుకే ఈ రోజున జిల్లేడు ఆకుల్ని శిరస్సుపై పెట్టుకుని స్నానం చేస్తే మంచిదని.. అలా చేసిన వారికి కూడా యజ్ఞఫలం వస్తుందని దేవతలు వరం ఇచ్చారు. అందుకే రథసప్తమి నాడు శిరస్సుపై జిల్లేడు ఆకులను పెట్టుకుని స్నానం చేస్తాము.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం