Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి అవకాశాలు తలుపు తడతాయి.. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి.. మహాలక్ష్మిని ధ్యానించండి
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 06.02.2025 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

రాశిఫలాలు (దిన ఫలాలు) : 06.02.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మాఘ, వారం : గురువారం, తిథి : శు. నవమి, నక్షత్రం : కృత్తిక
మేషం
ఈ రాశి వారికి ఈ రోజు శుభకాలం నడుస్తోంది. అనుకూలమైన వారం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. దశమంలో రవి బలం బావుంది. అవకాశాలు తలుపు తడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి సాధించడానికి సరైన సమయం. ఆర్థికంగా కలిసొస్తుంది. ఓ శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మహాలక్ష్మిని ధ్యానించండి.
వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్య నిర్ణయాల్లో శ్రద్ధ అవసరం. వ్యాపార వ్యవహారాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. మానసిక దృఢత్వం పెంచుకోవాలి. మిత్రుల సలహాలు మేలుచేస్తాయి. దశమంలో శుక్రబలం అనుకూలంగా లేదు. చిన్నపాటి అవరోదాలు ఎదురుకావచ్చు. వృథా వ్యయాల్ని అరికట్టాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి.
మిధునం
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక యోగం ఉంది. లాబాలు వరిస్తాయి. ఆ సొమ్మును పొదుపు-మదుపు దిశగా మళ్లించాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. చెడును అతిగా ఊహించుకోవద్దు. మిత్రుల సూచనల్ని విస్మరించొద్దు. సరైన ప్రణాళికతో ఒత్తిడిని అధిగమించండి. వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం. వృత్తి ఉద్యోగాల్లో సమర్థతను చాటుకోవాల్సిన సమయం. ఇష్టదైవాన్ని స్మరించండి.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు ఊరిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. పెట్టుబడుల విషయంలో మరింత దూకుడు అవసరం. సప్తమంలో బుధుని ప్రభావం వల్ల వ్యాపార ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అయినా, ఒత్తిడికి గురికావద్దు. ముఖ్య నిర్ణయాల సమయంలో లోతుగా ఆలోచించాలి. మీ ప్రతిభకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. వేంకటేశ్వర స్వామిని పూజించండి.
సింహం
ఈ రాశి వారికి ఈ రోజు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. కొత్తగా ఆలోచిస్తారు. గ్రహబలం మెరుగవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పేరు తెచ్చుకుంటారు. కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా నేర్పుగా వ్యవహరిస్తారు. ఖర్చులను నియంత్రణలో ఉంచుకోండి. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. పంచాక్షర స్తోత్రాన్ని పఠించండి.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు విజయాలు సాదిస్తారు. ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఆలోచనా విధానంలో స్పష్టత అవసరం. పంచమంలోని బుధుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. వ్యాపారంలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. అన్నింటా కొంత మందగమనం తప్పదు. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. శుభవార్త వింటారు. విష్ణుమూర్తిని ధ్యానించండి.
తుల
ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. రవి సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనశ్శాంతిని కోల్పోవద్దు. కొత్త పరిచయాలు బలపడతాయి. నిర్ణయాల్లో పరాదీనత వద్దు. దైర్యంగా అడుగేయండి. శుభవార్త వింటారు. పంచాక్షరీ స్తోత్రాన్ని పఠించండి.
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ రోజు శుభయోగాలు ఉన్నాయి. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ధర్మబద్ధంగా వ్యవహరించండి. మీ ప్రతిభను సమాజం గుర్తిస్తుంది. జీవితంలో స్థిరత్వం సాధిస్తారు. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో తడబాటుకు గురికావద్దు. ఓ శుభ సందేశం అందుతుంది. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబాన్ని భాగం చేయండి. ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించండి.
ధనుస్సు
ఈ రాశి వారికి ఈ రోజు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు. ఆధ్యాత్మిక సంపత్తిని పెంచుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. సంయమనంతో వ్యవహరించండి. వాహన చోదనలో దూకుడు వద్దు. ఇష్టదైవాన్ని స్మరించండి.
మకరం
ఈ రాశి వారికి ఈ రోజు ఉత్తమకాలం నడుస్తోంది. సత్వర విజయాలు వరిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. కీలక సమయాల్లో ఆత్మవిశ్వాసం కోల్పోకండి. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంతో సంతోషంగా. గడుపుతారు. లక్ష్మీ అష్టోత్తరం పరించండి.
కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు ఏకాగ్రత అవసరం, జన్మ శుక్రబలం సంపదలను ప్రసాదిస్తుంది. కొన్ని సమస్యల్ని అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. ఒక మెట్టు దిగైనా సరే, కార్యాల్ని సాధించుకోండి. వ్యాపార ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. వ్యక్తిగత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అనుమతించకండి. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యభగవానుడిని ప్రార్ధించండి.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు విజయాలు వరిస్తాయి. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరించాలి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అశ్రద్ధ కారణంగా కొద్దిపాటి సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. మొహమాటం వల్ల ఆర్థికంగా నష్టపోగలరు. ఓ శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని ధ్యానించండి.
టాపిక్