Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి పదోన్నతికి అవకాశం.. పెట్టుబడుల్లో లాభాలు, లక్ష్మీదేవిని ధ్యానిస్తే మంచిది
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 12.02.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

రాశిఫలాలు (దిన ఫలాలు) : 12.02.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మాఘ, వారం : బుధవారం, తిథి : శు. పూర్ణిమ, నక్షత్రం : ఆశ్రేష
మేషం
ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. మిత్రుల సాయం లభిస్తుంది. వృథా వ్యయాలను అరికట్టండి. గతంలోని పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. వ్యాపారంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.
వృషభం
సంకల్పం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. బంధుమిత్రులతో ఆత్మీయంగా వ్యవహరించండి. కలహాలకు ఆస్కారం ఉంది. ఆస్తి విలువ పెరుగుతుంది. వ్యాపారంలో కొన్ని అవరోదాలు ఉన్నాయి. వాటిని సమర్థంగా అధిగమించండి. కాలం మిశ్రమంగా ఉంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. పరమేశ్వరుడిని ఆరాధించండి.
మిథునం
అంతరాత్మ ప్రబోధంతో నిర్ణయాలు తీసుకోండి. ఆశయాలు నెరవేరతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వివాదాస్పద వ్యవహారాల జోలికి వెళ్లకండి. ఉద్యోగంలో సమయస్ఫూర్తి అవసరం, వ్యాపార సమస్యలకు సకాలంలో స్పందించండి. ఒత్తిడిని అదిగమించండి. వారాంతంలో శుభం జరుగుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం
అదృష్టయోగం సూచితం. ఉత్తమ ఫలితాలు ఉంటాయి. సకాలంలో డబ్బు అందుతుంది. రుణ భారాన్ని తగ్గించుకోండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార వ్యవహారాల్లో ఇతరుల ప్రభావానికి గురికావద్దు. ఆరోగ్యం జాగ్రత్త అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆధ్యాత్మిక సాధన పెరగాలి. ఇష్టదైవాన్ని స్మరించండి.
సింహం
ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగులు కొత్త విజయాలు సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోడానికి సరైన సమయం. మీ కల నిజం కాబోతోంది. ఆర్థిక స్థిరత్వం గురించి ఆలోచిస్తారు. వ్యాపార లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెద్దల అభిమానం పొందుతారు. కుటుంబానికి సమయం ఇవ్వండి. శ్రీనివాసుడిని పూజించండి.
కన్య
దైవబలం నడిపిస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో స్పష్టత వస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఏకాగ్రత అవసరం, ఉన్నతాధికారులతో అభిప్రాయ భేదాలకు ఆస్కారం ఉంది. సామరస్యంతో మెలగండి. ఓ ఆపద నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్త, దుర్గాదేవిని ధ్యానించండి.
తుల
వ్యాపారం లాభదాయకం. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. బుద్ధిబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులున్నా, సమర్థంగా బయటపడతారు. మీ ఆలోచనల్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతాయి. ఆచితూచి స్పందించండి. న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోతాయి. ఇష్టదైవాన్ని ఉపాసించండి.
వృశ్చికం
ఉద్యోగంలో కలిసొస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ప్రశంసలు పొందుతారు. నలుగురి మధ్యా ఉన్నప్పుడు గంభీరంగా వ్యవహరించండి. పంచమ శుక్రయోగం సంపదల్ని ప్రసాదిస్తుంది. కొందరు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తారు. అయినా, ఆ వలలో పడకండి. ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించండి.
ధనుస్సు
వ్యాపార యోగం పుష్కలం. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. అవరోధాలు ఎదురైనా, బుద్ధిబలంతో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక సేవలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. పెట్టుబడులకు సరైన సమయం. దీర్ఘకాలిక ప్రయత్నాలు వారాంతంలో ఫలితాన్ని ఇస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి.
మకరం
విజయాలు వరిస్తాయి. ఆశించిన ఫలితాలు అందుతాయి. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ధనధాన్యాది యోగాలు ఉన్నాయి. పొదుపు చర్యలు అవసరం. ఒత్తిడికి గురికావద్దు. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. మహాలక్ష్మిని ధ్యానించండి.
కుంభం
విధి నిర్వహణలో మరింత శ్రద్ధ అవసరం. సమయానుకూలంగా వ్యవహరించండి. ధనయోగం ఉంది. వివిధ గ్రహాలు దోష స్థానంలో ఉండటం వల్ల అవరోధాలు ఎదురవుతాయి. ఆత్మబలంతో వాటిని అధిగమించండి. వ్యాపార విజయానికి ప్రణాళిక అవసరం. అధికారులతో సామరస్యంగా వ్యవహరించాలి. ఓ శుభవార్త వింటారు. నవగ్రహాల్ని ప్రార్ధించండి.
మీనం
వృత్తి, ఉద్యోగాల్లో మంచి జరుగుతుంది. ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. నిర్ణయాలు మార్చుకోకండి. ఉద్యోగులకు అధికార లాభం సూచితం. నలుగురికీ మేలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. వివిధ మార్గాల్లో లాభాలు అందుకుంటారు. ధన, ధాన్య యోగాలున్నాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. వినాయకుడిని స్మరించండి.
టాపిక్