Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అదిరిపోతోంది.. ఆస్తి లాభం, నూతన వాహనాలతో పాటు ఎన్నో-rasi phalalu today these zodiac signs will get wealth new vehicles property and many more check yours also ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అదిరిపోతోంది.. ఆస్తి లాభం, నూతన వాహనాలతో పాటు ఎన్నో

Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అదిరిపోతోంది.. ఆస్తి లాభం, నూతన వాహనాలతో పాటు ఎన్నో

HT Telugu Desk HT Telugu
Published Feb 16, 2025 04:00 AM IST

Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 16.02.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అదిరిపోతోంది
Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అదిరిపోతోంది (freepik)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 16.02.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మాఘ, వారం : ఆదివారం, తిథి : కృ. చవితి, నక్షత్రం : హస్త

మేషం

పరపతి పెరుగుతుంది. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రుల చేయూతతో ముందడుగు వేస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం.

పెండింగ్ బాకీలు వసూలవుతాయి. ధనలబ్ది. కుటుంబసభ్యులు మీపై మరింత ప్రేమానురాగాలు కురిపిస్తారు. శుభవార్తలు. కొద్దిపాటి రుగ్మతలు బాధించవచ్చు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. పైస్థాయి వారి సహాయం అందుకుంటారు. రాజ కీయవర్గాలకు సన్మానాలు, మహిళలకు సమస్యలు తీరతాయి. సవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృషభం

కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆప్తులు చేయూత. అందిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి.

రుణబాధలు తొలగుతాయి. కుటుంబసమస్యల నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటారు. శుభకార్యాల ప్రస్తావన. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారాలు బాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబదులు అందుతాయి. ఉద్యోగాల్లో రావలసిన బకాయిలు అందుతాయి. నుంచి గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. సన్మానాలు జరుగుతాయి. ఐటీ నిపుణులు కార్యసాధనలో విజయం. లక్ష్మీస్తుతి మంచిది.

మిధునం

పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థులు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం. కుటుంబసభ్యులతో విభేరాలు తొలగుతాయి. ఉత్సాహవంతంగా గడుపుతారు.

శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు అందుతాయి. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న ప్రమోషన్లు రాగలవు. అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలు... విదేశీ పర్యటనలు జరుపుతారు. సన్మానాలు జరుగుతాయి. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. శివాష్టకం పఠించండి.

కర్కాటకం

కొన్ని కార్యక్రమాలు సజావుగా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీ చెడ్డా విచారిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. గతం గుర్తుకువచ్చి ఉత్సాహంగా గడుపుతారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

అందరితోనూ సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారులకు అనుకున్న సమయానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు గతంలో చేజారిన పదోన్నతులు ప్రస్తుతం అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు అంచనాలు నిజం చేసుకుంటారు. ప్రభుత్వపరంగా సహాయం అందుతుంది. ఐటీ నిపుణులు సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. మహిళలు అనుకున్నది. సాధిస్తారు. ఆస్తిలాభం, శివాష్టకం పరించండి.

సింహం

పనులు చకచకా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం రాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆస్తుల విషయంలో నూతన అగ్రిమెంట్లు, విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది.

కుటుంబసభ్యులతో విభేదాలు పరిష్కారం, సోదరుల నుంచి సహాయం అందుతుంది. ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల్లో అనుకున్న బాధాలు తథ్యం. విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. పైస్థాయి వారి అభినందనలు అందుకుంటారు. రాజకీయవర్గాలకు ఆశించిన పదవులు దక్కుతాయి. సన్మానాలు, సత్కారాలు, మహిళలకు ఆస్తిలాభసూచనలు, దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కన్య

పలుకుబడి పెరుగుతుంది. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. శత్రువులు కూడా మిత్రంలుగా మారతారు. ఆప్తల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. రుణబాధలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆరోగ్యసమస్యలు తీరి ఉపశమనం పొండుతారు.

వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల వారు విదేశీ పర్యటనలు జరుపుతారు. కొత్త సంస్థలు. ప్రారంభిస్తారు. మహిళలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఆదిత్య హృదయం పఠించండి.

తుల

ముఖ్య కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేసి. ముందుకు సాగుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. కుటుంబసభ్యులతో సఖ్యత నెలకొంటుంది.

ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది. వ్యాపార విస్తరణయత్నాలు ముమ్మరం చేస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో ఊహించని రీతిలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. విధి నిర్వహణలో ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తలకు విదేశాల్లో సంస్థల ఏర్పాటులో శుభవార్తలు. ఐటీరంగంవాకు గతం నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి. మహిళలు ద్విగుణీ కృత ఉత్సాహంతో అడుగు ముందుకు వేస్తారు. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.

వృశ్చికం

సన్నిహితులు, శ్రేయోభిలాషులు అన్నింటా సహకరిస్తారు. కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. శు భకార్యాల్లో పాల్గొంటారు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. కుటుంబసభ్యులతో కొన్ని చర్చలు జరుపుతారు.

ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శారీరక రుగ్మతలు. వ్యాపారాల్లో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. అనుకున్న లాభాలు తధ్యం. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు దక్కుతాయి. రాజకీయవేత్తలను అనుకోని సర్మానాలు, పదవీయోగం. కళాకారులు అవార్డులు దక్కించుకుంటారు. ఐటీరంగం వారు మీ నైపుణ్యానికి గుర్తింపు పొందుతారు. మహిళలు స్వీయప్రతిభతో గుర్తింపు పొందుతారు. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు

పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు, గౌరవం పెరుగుతుంది.

ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. మహిళలు సోదరులతో విభేదాలు తొలగుతాయి. అన్నింటా విజయం మీదే కనకధారాస్తోత్రం పఠించండి.

మకరం

పనులు సకాలంలో పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరులకు కూడా సహాయపడతారు. ఆస్తుల వివాదాలు తీరి లబ్దిపొందుతారు. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ధనప్రాప్తి కుటుంబ సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.

సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొద్దిపాటి రుగ్మతలు ఉంటాయి. వ్యాపారాల్లో అనుకూలస్థితి, చిక్కులు తొలగుతాయి. కాశించిన బాభాలు తథ్యం ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు ఉంటాయి. ఉన్నతపోస్టులు రావచ్చు. కళాకారులకు నూతనోత్సాహం. సన్మానాలు, మహిళలకు ఆస్తిలాభ సూచనలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం

వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. తీర్ధయాత్రలు చేస్తారు. అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు శ్రమ మరింత పెరుగుతుంది. రావలసిన సొమ్ము సైతం అందక ఇబ్బంది పడతారు. కుటుంబసభ్యులతో ఆకారణవైరం. మీ నిర్ణయాలు వ్యతిరేకిస్తారు. తరచూ శారీరక రుగ్మతలతో బాధపడతారు.

వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులు ఉన్నతస్థాయి ఆదేశాలు ఖచ్చితంగా పాటించడం మంచిది. పనిభారం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీయానం వాయిదా, శ్రమ పెరుగుతుంది. ఐటీరంగంవారికి కొత్త బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. మహిళలకు మానసిక ఆందోళన. హనుమాన్ చాలీసా పఠించండి.

మీనం

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మాడతారు.. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయపడతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలదు. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబంలోని అందరితోనూ సంతోషకరంగా గడుపుతారు.

బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. కొద్దిపాటి అనారోగ్య సూచనలు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. బాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. ప్రమోషన్లు లభించవచ్చు. పారిశ్రామికవర్గాల కంపెనీల ఏర్పాటులో విజయం సాధిస్తారు. ఐటీ నిపుణుల పరిశోధనలు మంచి ఫలితాలిస్తాయి. మహిళలకు శుభవార్తలు అందుతాయి. గణేశ స్త్రోత్రాలు పఠించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner