Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి అనుకోని సన్మానాలు, రివార్డులు, ఆకస్మిక విదేశీ పర్యటనలు.. మీ రాశిఫలాలు చూసుకున్నారా?
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 02.02.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 02.02.2025
సంబంధిత ఫోటోలు
Feb 17, 2025, 12:25 PM43 రోజుల పాటు ఈ రాశులకు మెండుగా అదృష్టం.. ఆర్థికంగా, మానసికంగా ప్రయోజనాలు!
Feb 17, 2025, 09:40 AMVenus Transit: పూర్వాభాద్ర నక్షత్రంలో శుక్రుడు.. ఈ 3 రాశులకు అదృష్టం, కొత్త అవకాశాలు, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 17, 2025, 06:00 AMఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు! భారీగా ధన లాభం, అన్ని కష్టాలు దూరం..
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మాఘ, వారం : ఆదివారం, తిథి : శు. చవితి, నక్షత్రం : ఉత్తర బాధ్రపద
మేషం
ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు, వాహనాలు, భూములు కొంటారు. ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు తీరి లాభాలబాటలో పడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించండి.
వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు ఎదురు కావచ్చు. ఆత్మస్థైర్యం, పట్టుదలతో ముందుకు సాగండి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఇంటి నిర్మాణాలు వాయిదా వేస్తారు. కుటుంబ బాధ్యతలపై కొంత విముఖత చూపుతారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించండి.
మిధునం
ఈ రాశి వారికి ఈ రోజు మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురురైనా పట్టుదలతో అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారంపై చర్చలు జరుపుతారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. కళారంగం వారికి అనుకోని సన్మానాలు, రివార్డులు. కాలభైరవాష్టకం పఠించండి.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు. విద్యార్థులకు విజయాలు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉండి రుణాలు తీరతాయి. వ్యతిరేకులు కూడా మీకు సహకరించడం విశేషం. వ్యాపారాలు పుంజుకుంటాయి. వాహన యోగం, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు ఫలిస్తాయి. ఆంజనేయ దండకం పఠించండి.
సింహం
ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్య వ్యవహారాలు ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ పుంజుకుంటుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో తగినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. శివాష్టకం పఠించండి.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా సర్దుబాటు చేసుకుంటారు. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు మన్నిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనువైన సమయం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు మిశ్రమంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
తుల
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఎదురై కొంత చికాకు పరుస్తాయి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ రోజు ఎంత శ్రమకోర్చినా అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవు తాయి. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వాహనాల విషయంలో అప్రమత్తంగా మెలగండి. వ్యాపారాలలో నిదానం అవసరం, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు. కళారంగం వారికి గందరగోళంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ధనుస్సు
ఈ రాశి వారికి ఈ రోజు ఎంతటి పనైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం. వాహనాలు, భూముల కొనుగోలు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. లక్ష్మీస్తుతి మంచిది.
మకరం
ఈ రాశి వారికి ఈ రోజు పనులు కొంత మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా చికాకులు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమాధిక్యం, వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. పనిభారం, రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి.
కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలలో గందరగోళం తొలగుతుంది. మీపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడతారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కార మవుతాయి. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. భూములు, వాహనాల కొనుగోలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయి. కళారంగం వారికి అవకాశాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు ఆస్తుల వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు అరుదైన సన్మానాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
టాపిక్