Rasi Phalalu: ఈ రాశుల వాళ్లకు బాగా కలిసి వస్తుంది, వ్యాపారంలో లాభాలతో పాటు బోలెడు లాభాలు.. మీ రాశి ప్రకారం ఏం చేయాలంటే-rasi phalalu today these zodiac signs will get profit in business and many more benefits check your rasi as well ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rasi Phalalu: ఈ రాశుల వాళ్లకు బాగా కలిసి వస్తుంది, వ్యాపారంలో లాభాలతో పాటు బోలెడు లాభాలు.. మీ రాశి ప్రకారం ఏం చేయాలంటే

Rasi Phalalu: ఈ రాశుల వాళ్లకు బాగా కలిసి వస్తుంది, వ్యాపారంలో లాభాలతో పాటు బోలెడు లాభాలు.. మీ రాశి ప్రకారం ఏం చేయాలంటే

HT Telugu Desk HT Telugu
Jan 15, 2025 04:00 AM IST

Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 15.01.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు (freepik )

రాశిఫలాలు (దిన ఫలాలు) : 15.01.2025

సంబంధిత ఫోటోలు

ఆయనము: ఉత్తరాయణం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: పుష్యం, వారం : బుధవారం, తిథి : కృ. విదియ, నక్షత్రం : పుష్య

మేషం

ఈ రాశి వారికి ఈ రోజు బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనులు ఆటంకాలు లేకుండా చకచకా సాగుతాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు చికాకులు, ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల వారు అభివృద్ధి పథంలో సాగుతారు.

వృషభం

రాశి వారికి ఈ రోజు దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ధనప్రాప్తి, శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల శ్రమ వృథా కాదు. వ్యాపారాలు పుంజుకుని లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలించి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ వేత్తలకు మరింత పురోగతి కనిపిస్తుంది.

మిథునం

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్న పనులు సజావుగా కొనసాగుతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కే అవకాశం, కళారంగం వారికి నూతనోత్సాహం. మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ రోజు మిత్రుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురుండదు. ఇంటిలో శుభకార్యాలపై ఒక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి. కళారంగం వారు పురస్కారాలు పొందుతారు. పంచాక్షరి మంత్రం పఠించండి.

సింహం

రాశి వారికి ఈ రోజు కొద్దిపాటి చికాకులు ఉన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.

కన్య

ఈ రాశి వారికి ఈ రోజు ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. శ్రీ భువనేశ్వరి మంత్రం పఠించండి.

తుల

ఈ రాశి వారికి ఈ రోజు దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులలో విజయం సాధిస్తారు. ఒక వ్యక్తి ద్వారా కొంత సాయం అందే సూచనలు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా చేస్తారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగే అవకాశం. పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహం.

వృశ్చికం

ఈ రాశి వారికి ఈ రోజు పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతస్థితి లభించే అవకాశం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు

ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారాలలో మరింత విస్తరించే అవకాశం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

మకరం

రాశి వారికి ఈ రోజు వ్యయప్రయాసలు ఎదుర్కొంటారు. పనుల్లో కొంత జాప్యం తప్పదు. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపార విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఇబ్బందిగా మారతాయి.. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం

రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరం, సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వాహనాలు, ఇళ్లు కొనుగోలు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు, మంచి గుర్తింపు రాగలవు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం

బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు కూడా అనుకూలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఆదిత్య హృదయం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner