Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ఆర్థికస్థితి మెరుగుపడుతుంది.. దూర ప్రయాణాలు, బహుమతులు ఇలా ఎన్నో
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 17.02.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

రాశిఫలాలు (దిన ఫలాలు) : 17.02.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మాఘ, వారం : సోమవారం, తిథి : కృ. పంచమి, నక్షత్రం : చిత్త
మేషం
వృత్తివ్యాపారాలలో ధైర్యం, ఆత్మస్థైర్యం ప్రదర్శించి లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారంచుడతారు. ఉద్యోగవిషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వైవాహికజీవనం ఆనందమయంగా ఉంటుంది. నెలాఖరులో ఆర్థికవిషయాలు మిశ్రమంగా ఉంటాయి.
వృషభం
ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. పోటీపరీక్షలలో రాణించి రెవిన్యూఅధికారిగా, లేదా పోలీసుశాఖలో ఉన్నత ప్రభుత్వ అధికారాన్ని పొందే అవకాశం ఉంది.
మిథునం
చట్టపరమైన సమస్యలు వస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. తల నరాల నొప్పి, అజీర్ణం, రక్త ప్రసరణ సమస్యలు, ఫైల్స్ వంటి అనారోగ్యం సమస్యలు వస్తాయి, కొన్ని అనవసర ఖర్చులు, నష్టాలు కలుగుతాయి.
కర్కాటకం
వ్యయరాశిలో కుజవక్రం ముగియడం. శుభఫలితాలను, ఆరోగ్యాన్ని, మరిన్ని ఆదాయ వనరులను కల్పిస్తుంది. మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరైన సమయం.
సింహం
జీవితభాగస్వామి, పిల్లలతో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. కొత్త స్నేహితులను కూడా సంపాదించుకుంటారు. ఆనందకరమైన జీవనశైలిని కలిగి ఉంటారు. పిల్లల విషయం సంతోషాన్ని కలిగిస్తుంది.
కన్య
ఉద్యోగంలో వికాసం, ఉన్నతి కలుగవచ్చు. వృత్తివ్యాపారాల్లో ఇతరులపై ఆధిపత్యం ప్రదర్శిస్తారు. ధనాదాయం పెరుగుతుంది.
తుల
మిత్రులతోనూ, బంధువులతోనూ అవగాహనాలోపం వల్ల చిక్కులు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. వైద్యసహాయం అవసర మవుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ధనానికి లోటుండదు.
వృశ్చికం
వ్యవసాయం ఫలించి ధనం వస్తుంది. కొత్తగా పారిశ్రామికసంస్థలలో పెట్టుబడులు లేక వాటాలు తీసుకోవడం అవుతుంది. కుటుంబంలో వంశోద్ధారకులు పుట్టే అవకాశం ఉంది.
ధనుస్సు
కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. మీ పిల్లలు విద్యలలో రాణిస్తారు. తోబుట్టువులతో ఆనందంగా గడిపే అవకాశం కూడా ఉంది.
మకరం
విద్యార్థులు వక్తృత్వపు పోటీలలో, చర్చావేదికలలో రాణించి బహుమతులు గెలుచుకుంటారు. వ్యక్తిగతంగా విలువ పెంచుకోవడం అంటే ఇదే. ఉద్యోగనియామకపు పరీక్షలలో నెగ్గుతారు.
కుంభం
వృత్తివ్యాపారాలలో అనూహ్యమైన అవ కాశాలను, లాభాలను తెస్తుంది. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యవిషయాలు కూడా అనుకూలం. దూరప్రయాణాలు కలసివస్తాయి.
మీనం
సోదరులు, స్నేహితులు మీ బలానికి మూలస్తంభాలవుతారు. మీలోని సృజనాత్మకశక్తి పెరిగి రాణిస్తారు. అధిక ఆదాయాన్ని పొందుతారు. ఆరోగ్యం కూడా సంతృప్తికరంగా ఉంటుంది. మీ సామాజికస్థితి బాగుంటుంది. ఊహించని లాభాలు వస్తాయి.
టాపిక్