Rasi Phalalu: ఈ రాశుల వారికి సంతోషాలే.. ఆకస్మిక బహుమానాలు, గౌరవం, ఆదాయపరమైన పెరుగుదలతో పాటు ఎన్నో-rasi phalalu today these zodiac signs will get money gifts respect and many more check your zodiac sign also ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rasi Phalalu: ఈ రాశుల వారికి సంతోషాలే.. ఆకస్మిక బహుమానాలు, గౌరవం, ఆదాయపరమైన పెరుగుదలతో పాటు ఎన్నో

Rasi Phalalu: ఈ రాశుల వారికి సంతోషాలే.. ఆకస్మిక బహుమానాలు, గౌరవం, ఆదాయపరమైన పెరుగుదలతో పాటు ఎన్నో

HT Telugu Desk HT Telugu
Jan 17, 2025 04:00 AM IST

Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 17.01.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి సంతోషాలే
Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి సంతోషాలే

రాశిఫలాలు (దిన ఫలాలు) : 17.01.2025

yearly horoscope entry point

ఆయనము: ఉత్తరాయణం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: పుష్యం, వారం : శుక్రవారం, తిథి : కృ. చవితి, నక్షత్రం : మక

మేష రాశి

ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన విషయాలలో ప్రయాణాలలో వాయిదాలకి అవకాశం ఉంది. తోబుట్టువులతో ఆత్మీయులతో విభేదాలు రాకుండా వీలైనంతవరకూ మౌనం పాటించటమేలు. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆగిన పనులు ముందుకు సాగుతాయి. గురువులని పెద్దలని కలిసి ఆశీర్వచనం తీసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన ఆనందాన్నిస్తుంది.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామితో అనుకూలమైన చర్చలు చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత శ్రద్ధ, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవు తాయి. పనులలో ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ వ్యక్తి గత విభేదాలు రాకుండా సంయమనం పాటించాలి. ఆత్మీయ సోదర వర్గం సహకారం అనుకూలంగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్ల ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

మిధున రాశి

రాశి వారికి ఈ రోజు సంతానముతో, ఆత్మీయ వ్యక్తులతో అహ్లాదకరంగా గడుపుతారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఉన్నత వ్యక్తులని కలుస్తారు. వారి అశీస్సులు తీసుకుంటారు. మీ ఆలోచనలు బాగుంటాయి. సృజనాత్మకత బాగుంటుంది. అనుకున్న విషయాలు సత్ఫలితాలు వస్తాయి. ఇంతకుముందు రుణములు తీసుకున్న వారి చెల్లిస్తారు. వృత్తిపరమైన అంశములలో, సామాజిక సంబంధాలలో వైరాగ్య భావనల అధికంగా ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. భాగస్వామి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఈ రోజు గృహ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంతాన, విద్య, అభివృద్దికి సంబంధించిన విషయాలు వింటారు. ఆలోచనలు ఉద్వేగ పూరితంగా ఉన్నప్పటికీ ఫలవంతంగా ఉంటాయి. ఆకస్మిక బహుమానాలు అందుకుంటారు, భాగస్వామికి సంబంధించి కొత్త నిర్ణయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు. మీ కుటుంబములోని పెద్దలు తీర్ధయాత్రలు చేయడానికి సంకల్పిస్తారు.

సింహ రాశి

ఈ రాశి వారికి ఈ రోజు వాహనము కొరకు, గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్యాపరమైన అంశములు మీద శ్రద్దను పెంచుకోవాలి. వ్యవసాయ అంశములు అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో అనుకూ లంగా ఉంటుంది. వృత్తిపరంగా దూర ప్రదేశాలలో తోబుట్టువులకు నూతన అవకాశములు. ఎంతోకాలం ఎదురు చూస్తున్న దూర ప్రదేశంలో నుంచి అందుకున్న ఒక వార్త ఆనందాన్నిస్తుంది.

కన్యా రాశి

ఈ రాశి వారికి ఈ రోజు మిత్రుల సహకారం ఆశించిన విధముగా అనుకూలంగా ఉంటుంది. ధైర్యము, పరాక్రమం పెరుగుతుంది. నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. ఆదాయము అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంచుకోవాలి. గృహ వాహన సంబంధ అంశములలో చిన్న పాటి రిపేర్లకు మరమ్మతులకు అవకాశం. వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉన్నప్పటికీ మీరు సమయానికి మీ పనిచేసే ఉన్నత అధికారులు ప్రశంసలను పొందుతారు.

ధనస్సు రాశి

రాశి వారికి ఈ రోజు అధిక ఖర్చులతో మొదలైనప్పటికీ అవి ఉపయోగకరంగా ఉంటాయి. ఆత్మసంతృప్తిని, వ్యక్తిగత అభివృద్ధిని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలతో సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. కుటుంబంలో భాగస్వామితో అన్యోన్యతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మాట పట్టింపులు లేకుండా, వాగ్వాదములకు చోటు ఇవ్వకుండా ముందుకు సాగాలి. కొత్త వ్యక్తుల పరిచయాలు, లాభాలు వచ్చినప్పటికీ వాటిని దుర్వినియోగము కాకుండా అనుకూలంగా మరల్చుకోవడానికి ప్రయత్నములు వేయాలి.

మకర రాశి

ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, చిన్ననాటి స్నేహితుల పలకరింపులతో ఉత్సాహంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. తండ్రి నుంచి, దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకుంటారు. వృత్తిలో గౌరవం, ఆదాయపరమైన పెరుగుదల, ఆశించిన ప్రదేశములకు స్థానచలనమునకు ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం ఆనందాన్నిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు.

మీనరాశి

రాశి వారికి ఈ రోజు విద్యా పరంగా అభివృద్ధి ఉంటుంది. పెద్దలు గురువుల ఆశీస్సులతో ముందుకు సాగుతారు. ఆత్మీయ వ్యక్తుల సహకారం మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది. విదేశీ ప్రయత్నం చేయు వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానానికి అభివృద్ధికరంగా, విదేశీ పరమైన విద్యకి అవకాశంగా సూచనలు ఉన్నాయి. వృత్తిపరమైన వైరాగ్యంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సంబంధం లేని వ్యక్తుల విమర్శలు చికాకును కలిగిస్తాయి. వాహనములను నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner