Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి కలిసి వస్తుంది.. నూతన బాధ్యతలు ప్రయాణాలు, శుభవార్తలు ఇలా ఎన్నో
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 21.01.2025 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 21.01.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: పుష్యం, వారం : మంగళవారం, తిథి : కృ. సప్తమి, నక్షత్రం : చిత్త
మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారికి మిత్రులతో సన్నిహితులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలు చేస్తారు. నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. ఆదాయము ఆనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంచుకోవాలి. గృహ వాహన సంబంధ అంశ ములలో చిన్నపాటి రిపేర్లకు మరమ్మతులకు అవకాశం. వృత్తి పరంగా అధిక భాధ్యతలు శ్రమ ఉన్నప్పటికీ మీరు సమ యానికి మీ పనిచేసే ఉన్నత అధికారుల ప్రశంసలను పొందుతారు.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని పనులలో ఆటంకాలు ఆలస్యాలు ఉన్నప్పటికీ పట్టుదలగా వెళ్లే ప్రయత్నాలు, మాట విలువ గౌరవం పెరుగుతుంది నూతన వృత్తి కోసం ప్రయత్నం చేసే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. యదార్థవారి బంధు విరోధి అన్నట్లుగా మాట్లాడే మాట నిక్కచ్చిగా ఉండటం వల్ల కొందరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు చేయడము లో చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.
మిధున రాశి
ఈ రోజు ఈ రాశి వారికి శారీరక శ్రద్ధ, అలంకరణమీద ఆసక్తి పెరుగుతాయి. భాగస్వామితో కలిపి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఆరో గ్యం బాగుంటుంది. మనసులోని కోరికలన్నీ నెరవేర్చుకో వడానికి కృషి చేస్తాడు. దూర ప్రయాణానికి సంకల్పం చేస్తా డుకస్మికమైన ఖర్చులు ఉంటాయి. కుటుంబ ఆదాయం లో కొంత ఆటంకాలు ఉంటాయి, కన్ను మరియు పన్ను వంటిఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వారికి అధిక ఖర్చులతో మొదలైనప్పటికీ అవి • పయోగకరంగా ఉంటాయి. ఆత్మసంతృప్తిని వ్యక్తిగత అని వృద్ధిని కలిగిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభాలు వచ్చినప్పటికీ వాటిని దుర్వినియోగము కాకుండా అనుకూలంగా మరల్చుకోవడానికి ప్రయత్నములు చేయాలి. ఆధ్యా త్మిక ఆలోచనలతో స్వాగతం పలుకుతారు. కుటుంబంలో భాగస్వామితో అన్యోన్యతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మాట పట్టింపులు లేకుండా, వాగ్వాదములకు చోటు ఇవ్వకుండా ముందుకు సాగాలి.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి చిన్ననాటి స్నేహితుల పలకరింపులతో ఉత్సా పొంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో సంతానంతో అహ్లాదకరమైన వాతావరణంలో, వృత్తిలో ఆశించిన స్థానాన్ని పొందటానికి అధిక శ్రమ పడతారు. తగిన గుర్తింపు పొందుతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. సంతోషంగా శుభవార్తలతో వృత్తి పరమైన అభివృద్దితో, మొదలవుతుంది. మధ్యలో వృత్తిపరంగా నూతన బాధ్యతలు ప్రయాణాలు, కొత్త వ్యక్తుల కలయిక శ్రమ బడలిక ఉన్నప్పటికీ అధిగమిస్తారు.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశి వారికి నూతన విషయాలు నేర్చుకుంటారు. సమయమునకు తగిన ఆహార స్వీకరణ అవసరము. వృత్తిపరంగా ఉన్నత అధికారుల సహకారంతో పనులు నెరవేరుస్తారు. భూమికి సంబంధించిన అంశములలో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉంటాయి.. గౌరవం పెరుగుతుంది. ఇతరులకు సహకరిస్తారు. తోబుట్టువులతో నిదానమవసరం, నూతన బాధ్యతలు అధికముగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడతారు.
తులా రాశి
ఈ రోజు ఈ రాశి వారికి పెద్దలు గురువుల ఆశీస్సులతో ముందుకు. సాగుతారు. ఆత్మీయ వ్యక్తుల సహకారం మీకు మనోధీర్యాన్ని, ఇస్తుందివిద్యా పరంగా అభివృద్ధి పరంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నం చేయువారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానానికి అభివృద్ధి కరంగా, విదేశీ పరమైన. విద్యకి అవకాశంగా సూచనలు ఉన్నాయి. అధిక ఖర్చులు ఉ న్నప్పటికీ, అవి సంతోషాన్ని, ఉపయోగపడ్డాన్ని సూచిస్తున్నా యి. వృత్తిపరమైన వైరాగ్యంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వృత్తిపరముగా సంబంధం లేని వ్యక్తుల విమర్శలు చికాకును కలిగిస్తాయి. వాహనములను నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ప్రయాణాలలో చికాకులు, నూతన వ్యక్తుల పరిచయాలు ఇబ్బంది కలిగించినప్పటికీ ఆత్మ బలముతో వాటిని జయిస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరము. తోబుట్టువులతో ఆత్మీయులతో విభేదాలు రాకుండా వీలైనంతవరకూ మౌనం పాటించటమేలు, ముఖ్యమైన విష యాలలో ప్రయాణాలలో వాయిదాలకి అవకాశం ఉంది. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన ఆనం దాన్నిస్తుంది. జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి. కళా రంగంలో ఉండే వారికి అనుకూలంగా ఉ టుంది.
ధనస్సు రాశి
ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబము అహ్లాదకరంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తిగత శ్రద్ధ, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. జీవిత భాగస్వామితో అనుకూలమైన దర్శలు చేస్తారు పనులలో అలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విభేదాలు రాకుండా సంయమనం పాటించాలి. ఆత్మీయ సోదర వర్గం సహకారం అనుకూలంగా ఉంటుంది.మాటల విషయంలో కంటి విషయంలో జాగ్రత్తలు అవసరం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వల్ల ఇతరులు అపార్ధం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
మకర రాశి
ఈ రోజు ఈ రాశి వారికి అనుకున్న విషయాలు సత్ఫలితాలు నిస్తాయి. సంతానము తో, ఆత్మీయ వ్యక్తులతో అహ్లాదకరంగా గడుపుతారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఉన్నత వ్యక్తులని కలుస్తారు. వారి ఆశీస్సులు తీసుకుంటారు. మీ ఆలోచనలు బాగుంటాయి సృజనాత్మకత బాగుంటుంది. ఇంతకుముందు రుణములు తీసుకున్న వారి చెల్లిస్తారు. వృత్తిపరమైన అంశములలో, సామాజిక సం బంధాలలో వైరాగ్య భావనల అధికంగా ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. భాగస్వామి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలి.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి సంతాన విద్య అభివృద్ధికి సంబంధించిన విషయా లు వింటారు. ఆలోచనలు ఉద్వేగ పూరితంగా ఉన్నప్పటికీ ఫలవంతంగా ఉంటాయి. ఆకస్మిక బహుమానాలు అందు కుంటారు. భాగస్వామి కి సంబంధించి కొత్త నిర్ణయాలు ఆశాజనకంగా ఉంటాయి. గృహ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. విందు వినోదాలతో, ఆహ్లాదకరంగా సంతోషంగా స్నేహితులతో బంధుమిత్రులతో ప్రారంభమవుతుంది. రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.
మీన రాశి
ఈ రోజు ఈ రాశి వారికి తల్లి ఆరోగ్య ఆదాయం అభివృద్ధి కరంగా ఉంటుంది. వాహనము కొరకు, గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్యాపరమైన అంశములు మీద శ్రద్దను పెంచుకోవాలి. వ్యవసాయ అంశములు అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా దూర ప్రదేశాలలో తోబు ట్టువులకు నూతన అవకాశములు, మీ సహకారం ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేస్తారు. అధిక శ్రమ బాధ్యతలు ఉన్నప్పటికీ గుర్తింపు గౌరవాన్ని పెంచుకుంటారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు.
సంబంధిత కథనం
టాపిక్