Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారి సమస్యలు తీరుతాయి.. సంతోషంగా ఉండొచ్చు.. ఏ రాశుల వారు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోండి
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 23.01.2025 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 23.01.2025
సంబంధిత ఫోటోలు
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Feb 14, 2025, 08:05 AMGuru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 14, 2025, 06:15 AMఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Feb 13, 2025, 08:09 AMRahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 12, 2025, 08:57 PMఈ మూడు రాశులకు గుడ్టైమ్ షురూ.. అన్నింటా అదృష్టం!
Feb 12, 2025, 08:23 AMSun Transit: కుంభ రాశిలో సూర్యుడి సంచారం, 4 రాశుల వారి జీవితంలో మార్పులు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధితో పాటు ఎన్నో
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: పుష్యం, వారం : గురువారం, తిథి : కృ. నవమి, నక్షత్రం : విశాఖ
మేషం
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిడులు, సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఆత్మస్థైర్యంతో అడుగు వేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు, ఉద్యోగాలలో మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. అంగారక స్తోత్రాలు పఠించండి.
వృషభం
ఈ రోజు ఈ రాశి వారికి అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహన యోగం. ముఖ్య విషయాలపై బంధువులతో చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. గణపతి స్తోత్రాలు పఠించండి.
మిధునం
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి; పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు, కళాకారులకు నూతనోత్సాహం, అవార్డులు. వ్యాపారాలు విస్తరణలో విజయం సాధిస్తారు.విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కర్కాటకం
ఈ రోజు ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి ఉంటుంది. వాహనయోగం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరించడంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. నృసింహస్తోత్రాలు పఠించండి.
సింహం
ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి సహాయం కోరతారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సాధిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. ఆంజనేయ దండకం పఠించండి.
కన్య
ఈ రోజు ఈ రాశి వారికి వీరికి అన్నింటా విజయాలే. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు, స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారికి కృషి ఫలిస్తుంది. గణేశాష్టకం పఠించండి.
తుల
ఈ రోజు ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో లాభాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలం. హనుమాన్ చాలీసా పఠించండి.
వృశ్చికం
ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. సంఘంలో పేరు గడిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు
ఈ రోజు ఈ రాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు చాలావరకూ తీరతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం
ఈ రోజు ఈ రాశి వారికి మీమాటే శిరోధార్యంగా భావిస్తారు. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు గణేశ్ను పూజించండి.
కుంభం
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూలస్థితి ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరం. సోదరుల నుంచి పిలుపు అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మీనం
ఈ రోజు ఈ రాశి వారికి పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం, ఉద్యోగాలు. ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. రాజకీయ వర్గాలకు పదవీయోగం. లక్ష్మీస్తుతి మంచిది.
టాపిక్