Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి కలిసి వస్తుంది.. ఏ రాశి వారు ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 16.01.2025 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 16.01.2025
సంబంధిత ఫోటోలు
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Feb 14, 2025, 08:05 AMGuru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 14, 2025, 06:15 AMఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Feb 13, 2025, 08:09 AMRahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
ఆయనము: ఉత్తరాయణం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: పుష్యం, వారం : గురువారం, తిథి : కృ. తదియ, నక్షత్రం : ఆశ్లేష
మేషం
ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టయోగం ఉంది. ఉద్యోగులకు కలిసొస్తుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. జీవితాశయాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సంపాదన మార్గాలు పెరుగుతాయి. వ్యాపార నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. లక్ష్మీదేవిని ధ్యానించండి.
వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. చిత్తశుద్ధితో వాటిని అమలు చేయండి. అదే సమయంలో అప్రమత్తత అవసరం. ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. ప్రణాళిక, సమయపాలన ముఖ్యం. ఉదాసీనత వద్దు. మిశ్రమకాలం నడుస్తోంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. సూర్యభగవానుడిని ఆరాధించండి.
మిథునం
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా లాభపడతారు. పెట్టుబడి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మరింత ఏకాగ్రత అవసరం. ఓర్పుతో వ్యవహరించండి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి. సున్నిత వ్యవహారాల్లో జాగ్రత్తగా స్పందించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగాలి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ప్రయత్నాలు సఫలం అవుతాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. శత్రుదోషం నుంచి విముక్తి పొందుతారు. మిత్రుల మద్దతు అందుతుంది. మీ నిర్ణయాల వల్ల భవిష్యత్తు సానుకూలంగా మారుతుంది. రుణ సమస్యలు తొలగిపోతాయి. పొదుపు అవసరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మహాలక్ష్మిని ధ్యానించండి.
సింహం
ఈ రాశి వారు ఈ రోజు మనోబలంతో వ్యవహరించండి. ముందస్తు ప్రణాళికతో ఆటంకాలను అధిగమిస్తారు. సామరస్య ధోరణి అవసరం. గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినా దైవ బలంతో విజయం సాధిస్తారు. అస్థిరమైన నిర్ణయాలు వద్దు. శ్రేయోభిలాషుల సలహాలు తీసుకోండి. ఉద్యోగులు తొందరపాటు చర్యలకు దూరంగా ఉండాలి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కన్య
ఈ రాశి వారికి ఈ రోజు ప్రతిభ కనబరుస్తారు. వ్యాపార ఫలితాలు లాభదాయకం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. అధికారులతో సౌమ్యంగా సంభాషించండి. సాహసోపేతంగా వ్యవహరించాల్సిన సమయం. అనూహ్యంగా లాభపడతారు. వేంకటేశ్వరుడిని ఉపాసించండి.
తుల
ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ధనయోగం సూచితం. కొత్త ఆస్తులు సమకూర్చు కుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు మంచి చేస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. నవగ్రహ శ్లోకాలు పఠించండి.
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారం లాభదాయకం. పట్టిందల్లా బంగారమే. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. గురుబలం ప్రభావంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో తోటి సిబ్బందిని కలుపుకుపోవాలి. పెద్దలు మీ ప్రతిభను గుర్తిస్తారు. శివాలయాన్ని సందర్శించండి.
ధనుస్సు
ఈ రాశి వారికి ఈ రోజు కాలం సహకరిస్తుంది. ఆత్మబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. అవసరానికి డబ్బు అందుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. అదే సమయంలో ఆర్ధిక ప్రణాళిక అవసరం. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. అధికారుల మెప్పు పొందుతారు. అనవసర విషయాల్లో జోక్యం వద్దు. అపార్థాలకు తావివ్వకండి. కుజగ్రహ స్తోత్రం పఠించండి.
మకరం
ఈ రాశి వారికి ఈ రోజు మనోబలం అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పంచమ గురుబలం వల్ల సంకల్పించిన పనులన్నీ విజయవంతం అవుతాయి. కొన్నిసార్లు మంచి తలపెట్టినా కీడు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి, ఎరుకతో వ్యవహరించాలి. ఆరంభశూరత్వం వద్దు. లక్ష్యాన్ని సాధించే వరకూ విశ్రమించకండి. ఇష్టదైవాన్ని స్మరించండి.
కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు అందుకుంటారు. కాలం కలిసొస్తుంది. శ్రేయోభిలాషుల సాయం లభిస్తుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాటికి స్పష్టమైన రూపం ఇచ్చే ప్రయత్నం చేయండి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అధికారుల ప్రశంసలు అందుతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. మహాలక్ష్మిని ధ్యానించండి.
మీనం
ఈ రాశి వారికి ఈ రోజు కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారంలో దూకుడు పనికిరాదు. సాధ్యా సాధ్యాలు గమనించుకుని అడుగు ముందుకేయాలి. బుద్ధి చతురత అవసరం. కాలం మిశ్రమమే అయినా, మీరు నమ్మిన విలువలు మిమ్మల్ని కాపాడతాయి. నవగ్రహ శాంతి చేయించండి.
టాపిక్