Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి మంచి ఫలితాలు.. అవివాహితులకు శుభవార్తలతో పాటు ఎన్నో-rasi phalalu today these zodiac signs will get good results including welath happiness good news and many more check now ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి మంచి ఫలితాలు.. అవివాహితులకు శుభవార్తలతో పాటు ఎన్నో

Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి మంచి ఫలితాలు.. అవివాహితులకు శుభవార్తలతో పాటు ఎన్నో

HT Telugu Desk HT Telugu
Jan 25, 2025 04:00 AM IST

Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.01.2025 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి మంచి ఫలితాలు
Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి మంచి ఫలితాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 25.01.2025

yearly horoscope entry point

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: పుష్యం, వారం : శనివారం, తిథి : కృ. ఏకదాశి, నక్షత్రం : అనురాధ

మేషం:

ఈ రోజు ఈ రాశి వారికి ప్రయోజనము నిచ్చు సనులను చేపట్టుకోలేకపోతారు. సాధారణతలు అన్నిటా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో నుంచి మార్పులు చూస్తారు. సోదరులతో గతంలోని అభిప్రాయభేదాలు దూరం కాగలవు. ఇంటా-బయటా సహాయసహకారాలు ఉంటాయి. గౌరవమును ఏర్పరచుకోగల్గుతారు. నిర్మాణపు పనులు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు ప్లేస్మెంట్లు నిరాశలకు గురి చేస్తాయి. పట్టుదలలు చూపుకోవాలి.

వృషభం:

ఈ రోజు ఈ రాశి వారికి గ్రహసంచారాలు మిశ్రమముగా ఉపకరిస్తాయి. పను లను అనుకొన్నవిధంగా పూర్తిచేసుకోగలుగుతారు. అధికారులతో, పెద్దలతో సంయమనాలు తప్పనిసరిగా పాటించండి. కొన్ని షార్ట్ జర్నీస్ చేయవలసిరావచ్చును. ఆధ్యాత్మికతలకు ప్రాధాన్యతనీయగలుగుతారు. విద్యార్థులకు ఉత్సాహమునిచ్చు వార్తలు ఉంటాయి. వ్యాపారులు చెల్లింపులకు ప్రాధాన్యతనిచ్చి నూతన పెట్టుబడులుంచుకోవాలి.

మిథునం:

ఈ రోజు ఈ రాశి వారికి పెట్టలేని ఆలోచనలు చేసుకొంటారు. కుటుంబ వ్యక్తుల సలహా లకు ప్రాధాన్యతనీయండి. ఖర్చులు ఎక్కువగా ఉన్నా ప్రయోజనాలు పొందు తారు. పరోపకారములు చేస్తారు. విమర్శలకు దూరముగా ఉండటం మంచిది. ఉపాధి అవకాశాలకై చేయు యత్నములు ఉపకరిస్తాయి. ప్రభుత్వతరహా పనులు ఉపకరిస్తాయి.

కర్కాటకం:

ఈ రోజు ఈ రాశి వారికి ప్రతికూలములను అనుకూలముగా మార్చుకొనేందుకు ప్రయ త్నించుకొంటారు. ఆధ్యాత్మికముగా వ్యవహరించుకుంటారు. కుటుంబంలో చిన్నతరహా మానసిక ఘర్షణలు ఉంటాయి. నూతన వ్యాపార, వ్యవహారాలపట్ల ఆసక్తి ఏర్పడుతుంది. రెన్యువల్స్, అగ్రిమెంట్లు పూర్తిచేసు కుంటారు. విద్యార్థులు వ్యాసంగాలకు అంకితమవుతారు. వాహన, యంత్రాదుల వాడకంలో జాగ్రత్తలు అవసరం.

సింహం:

ఈ రోజు ఈ రాశి వారికి గ్రహసంచారాలు మిశ్రమంగా ఉన్నాయి. శ్రమ, పట్టుదల, ప్లానింగ్లో కాని, పనులు పూర్తికావు. ఇతరుల సహకారాలకై ఆశపడకండి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా సామాన్యతలు కొనసాగుతాయి. అధికారుల్ని మెప్పించలేకపోతారుకాని, సంతృప్తిని పొందుతారు. పెట్టుబడులప్పుడు అనుభవజ్ఞులతో సమాలోచనలు చేయండి. విద్యార్థులు అనుకొన్న అవకాశాలనందుకుంటారు.

కన్య:

ఈ రోజు ఈ రాశి వారికి పలుకుబడిగలవారితో పరిచయాలుంటాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కాలాతీత ఆహార విరామాలు ఏర్పడ కుండా జాగ్రత్తలు అవసరం. ఒంటరితనపు భావనలుండు సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో బదిలీలు, ప్రదేశ మార్పులు ఉంటాయి. సంతానముతో అంతర్గత వైషమ్యాలు ఉండు సూచనలు ఉన్నాయి. ఉపాధి, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

తుల:

ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబసభ్యులతోను, పని చేసేచోట చిన్నపాటి వివాదాలుంటాయి. విశ్రాంతి లోపం ఉండ కుండా జాగ్రత్తలు అవసరం. ఇతరులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి. విద్యార్థులు శ్రమ, కాలనియమాలు తప్పనిసరి చేసుకోవాలి. ప్రయాణాలు సొంత వాహనాలపై తగ్గించండి.

వృశ్చికం:

ఈ రోజు ఈ రాశి వారికి ఉత్సాహకరంగా సాగుతుంది. అవకాశాలు కలసివస్తాయి. కొన్ని బకాయిలను వసూలుచేసుకుంటారు. అధికారులతో సంయమన ములు తప్పనిసరి చేయండి. వ్యాపారంలో పెట్టుబడులు ఉంచగలరు. నూతన ఒప్పందాలు, రెన్యువల్స్ పూర్తిచేసుకొనుటవంటిని ఉంటాయి. స్థిరాస్తుల తాకట్లు విడి పించగలరు. కోరుకొన్న చోటికి బదిలీలు ఉంటాయి. ఉద్యోగ, ఉపాధి అవ కాశాలు సిద్ధించగలవు.

ధనుస్సు:

ఈ రోజు ఈ రాశి వారికి సగటు ఉత్సాహంగా సాగుతుంది. సహకరించువ్యక్తులు పెరుగుతారు. పనులందు పురోభివృద్ధిని చూడగలరు. అవకాశా లను జారవిడవకుండా జాగరూకులై వ్యవహరించుకోవాలి. ఇతరులను ఆశించి భంగపడకండి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు పరవాలేనివిగా ఉంటాయి. సంతానపు, వివాహపు విషయాల్లో, వారి లైఫ్ ప్లానింగ్ విషయంలో తొందరపడకండి. కొన్ని రుణములను తీర్చగలుగుతారు.

మకరం:

ఈ రోజు ఈ రాశి వారికి వృద్ధి కొనసాగుతుంది. ఆధ్యాత్మికంగా వ్యవహరించుకొంటారు. విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తారు. ఏకాగ్రతలుచూపి పోటీపరీక్షలకు యత్నించుకోగలుగుతారు. గత ఒత్తిడులను దరి చేరనీయకుండా జాగ్రత్తలు వహిస్తారు. కొత్త ఉత్సాహాలు, బాధ్యతలు చేపట్ట గలరు. స్థల మార్పు. గృహ మార్పుకై యోచనలు చేస్తారు. కుటుంబ వ్యక్తుల సహకారాలు పెరుగుతాయి.

కుంభం:

ఈ రోజు ఈ రాశి వారికి అనారోగ్య కారణంగా చిన్నతరహా ఇబ్బందులు ఎదుర్కోవలసిరావచ్చు. అసౌకర్యాలచే గమ్యనిర్దేశాలను మార్పు చేసుకొంటారు. అవివాహితులకు శుభవార్తలు ఉంటాయి. గృహ మార్పులు, వాస్తు మార్పులు చేసుకొంటారు. ఆర్థికంగా చిన్నతరహా ప్రయోజనాలు ఏర్పరచుకొం టారు. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. అధికారులతో వాగ్వాదాలలో తగ్గి వుండండి.

మీనం:

ఈ రోజు ఈ రాశి వారికి శారీరకంగా, మానసికంగా చికాకు ఉంటుంది. మనోధైర్యంతో వ్యవహరించుకోవాలి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఖర్చులందు నియంత్రణలు అవసరం. నిత్యకృత్యములను సకాలంలో జరిగే టట్లు చూడండి. ఉద్యోగాల్లో బదిలీలు ఉంటాయి. కుటుంబ వ్యక్తుల సహకారాలు పొందగలుగుతారు. సంతాన అవసరాలను తీర్చగలుగుతారు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner