Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి శుభప్రదంగా ఉంది.. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి, ఆస్తులు కొనుగోలు చేస్తారు-rasi phalalu today these zodiac signs will be very happiness do there works on time may buy new property check yours ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి శుభప్రదంగా ఉంది.. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి, ఆస్తులు కొనుగోలు చేస్తారు

Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి శుభప్రదంగా ఉంది.. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి, ఆస్తులు కొనుగోలు చేస్తారు

HT Telugu Desk HT Telugu
Published Feb 11, 2025 04:00 AM IST

Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 11.02.2025 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today rasi phalalu: ఫిబ్రవరి 11వ తేదీ రాశి ఫలాలు
Today rasi phalalu: ఫిబ్రవరి 11వ తేదీ రాశి ఫలాలు (freepik)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 11.02.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మాఘ, వారం : మంగళవారం, తిథి : శు. చతుర్దశి, నక్షత్రం : పుష్యమి

మేషం

ఆలోచనలు స్థిమితంగా ఉండవు. చిన్నచిన్న విషయాలకే హైరానా పడుతుంటారు. బంధువులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. మంచి మార్పు కలుగుతుంది. వ్యాపారంలో కార్యసిద్ధి ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. మాతృవర్గం సహ కారం లభిస్తుంది. ఆర్ధికంగా ప్రయోజనం పొందుతారు. బహుమ తులు అందుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

వృషభం

శారీరక సమస్యలు తీరిపోతాయి. ధన ప్రాప్తి ఉంది. కుటుం బంతో సంతోషంగా కాలం గడుపుతారు. విలువైన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. మీరు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులతో కొన్ని ఇబ్బందులు తలె త్తవచ్చు. గిట్టనివారితో చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. వారి వల్ల వృథా ఖర్చులు ముందుకురావచ్చు. సమయోచితంగా నిర్ణ యాలు తీసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శివారాధన వల్ల మేలు కలుగుతుంది.

మిథునం

తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం ఉంది. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్ప డతాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దీర్ఘకా లిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించాలి. ఆగ్రహా వేశాల వల్ల కొన్ని అవకాశాలను కోల్పోవచ్చు. సంయమనంతో వ్యవహరించడం అవసరం. విదేశీయాన ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వైష్ణవాలయ దర్శనం మేలుచేస్తుంది.

కర్కాటకం

శుభప్రదంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపు తారు. శత్రువుల ద్వారా లాభం కలుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. సహోద్యో గులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కాలయాపనకు చోటివ్వ కుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.

సింహం

మిశ్రమంగా ఉంటుంది. నిబద్ధతతో వ్యవహరిస్తే విజయం వరిస్తుంది. వ్యాపారులకు పనివారితో చికాకులు తలెత్తవచ్చు. కుటుంబసభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. శుభకార్య ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉండటం అవసరం. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవ హరించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది.

కన్య

మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగంలో విజయం సాధి స్తారు. పదోన్నతి, అనుకూల స్థానచలనానికి అవకాశం. ధైర్యంతో పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. బంధు వులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవు తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రోజు వారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. దక్షిణామూర్తి ఆరాధన మేలుచేస్తుంది.

తుల

అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయ త్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూల స్థానచలన సూచన, రావల సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. భూ లావాదేవీల్లో మిశ్రమంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత అవసరం. వ్యాపారు లకు మంచి సమయం. ఆర్థికంగా పుంజుకుంటారు. అదృష్టం కలి సివస్తుంది. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి.

వృశ్చికం

ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అధికారులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ఆత్మీయులు సూచనలు అమలుచే యడం ద్వారా మేలు కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన వల్ల శుభ ఫలితాలు అధికమవు తాయి.

ధనుస్సు

తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు అను కూల సమయం. చేపట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగు తాయి. కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు. అన్నదమ్ములతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. ఆంజనేయస్వామి ఆరాధన మేలుచేస్తుంది.

మకరం

సత్ఫలితాలు పొందుతారు. మంచివారి సాహ చర్యం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. వాటిని అమలుపర్చడంలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారులకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడవచ్చు. పెద్దల సూచనలు పాటించడం అవసరం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. రాబడి పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగా ఖర్చులూ ఉంటాయి. సమయపా లన అవసరం. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.

కుంభం

ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నలుగురికీ సాయం చేస్తారు. ఉద్యోగంలో మంచిపేరు సంపాదిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. సహోద్యోగులతో ఉన్న సమస్యలు దూర మవుతాయి. పెద్దల అండదండలు లభిస్తాయి. చిన్ననాటి స్నేహి తులను కలుసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భూ లావాదేవీలు కలిసివస్తాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సూర్యుడి ఆరాధన మేలుచేస్తుంది.

మీనం

తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీ యాన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. విందులకు హాజరవుతారు. కోర్టు వ్యవహారాల్లో పూర్తిస్థాయి అనుకూలత ఉండకపోవచ్చు. కుటుంబసభ్యులతో వాగ్వివాదాలకు పోవద్దు. పెద్దల సూచనలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner