Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.. ఉల్లాసంగా ఉంటారు.. మరి మీ రాశి ఎలా ఉందో చూసారా?-rasi phalalu today these zodiac sign people will get job and be happy check your rasi also these may have small problems ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.. ఉల్లాసంగా ఉంటారు.. మరి మీ రాశి ఎలా ఉందో చూసారా?

Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.. ఉల్లాసంగా ఉంటారు.. మరి మీ రాశి ఎలా ఉందో చూసారా?

HT Telugu Desk HT Telugu
Published Feb 08, 2025 04:00 AM IST

Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 08.02.2025 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆగస్ట్ 8 నేటి రాశి ఫలాలు
ఆగస్ట్ 8 నేటి రాశి ఫలాలు (freepik )

రాశిఫలాలు (దిన ఫలాలు) : 08.02.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మాఘ, వారం : శనివారం, తిథి : శు. ఏకాదశి, నక్షత్రం : మృగశిర

మేషం

రాశి వారికి ఈ రోజు గ్రహసంచారాలు అనుకూలమైనా ప్రయత్నాలకు పట్టుదలలు జోడించుకోవాలి. కొత్త పరిచయాల్ని చేసుకోవలసివస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహముగా వ్యవహరించుకోగలరు. కుటుంబంలో సమిష్టి నిర్ణయాలు తీసుకోగలరు. పెద్ద మొత్తాలతో కూడిన నగదు చెల్లింపులు ఉండగలవు. అదనపు సౌకర్యాల్ని ఏర్పరచుకోగలరు. విద్యార్థులకు వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి.

వృషభం

ఈ రాశి వారికి ఈ రోజు మానసిక పట్టుదలను సాధించుకొనేందుకు రకరకాల మార్గాలను అన్వేషించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణ స్థాయిలో సాగగలవు. అదనపు బాధ్యతలను కొన్నిటిని స్వీకరించవలసిరావచ్చును. నూతన ఉద్యోగ ప్రవేశాలు కొందరికి ఏర్పడగలవు. సంతానపు అత్యుత్సాహాలను అదుపు చేయవలసివుంటుంది. వ్యాపారాల్లో చెల్లింపులు భారమని పించగలవు.

మిధునం

ఈ రాశి వారికి ఈ రోజు వేచివుండు విధానాలను పాటించుట మంచిది. పట్టుదలలతో ముందుకు సాగాలి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండుటయే మంచిది. వ్యాపార వృత్తులలో రొటేషన్లకే ప్రాధాన్యతనిచ్చుకోవాలి. విద్యార్థులకు వ్యాసంగాలు, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అసంతృప్తినిచ్చునవిగా సాగుతాయి. ప్రయాణాల్లో, ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబంలో ఏకవాక్యతలు ఉండేటట్లు జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతగా వ్యవహరించుకోగలరు. ఆదాయ వ్యవహారములు అను కూలంగా సాగుతాయి. చేపట్టుకొన్న పనులను సజావుగా పూర్తిచేసుకో గలరు. ఆరోగ్యపరంగా మంచి మార్పులు చూడగలరు. ఋణభారాలు పెంచకుండా ఖర్చులను తగ్గించుకోగలరు. విద్యార్థులు టార్గెట్ విధానాలను చేపట్టుకోవాలి.

సింహం

రాశి వారికి ఈ రోజు పనుల ఒత్తిడి ఎక్కువగా ఉండడం, మానసిక అధైర్యములకు గురికావుట ఉంటాయి. ఆర్థికంగా బాగున్నా ఋణదాతలనుండి ఒత్తిడిని ఎదుర్కోవలసి వుంటుంది. కుటుంబంలో ఎవరి తీరు వారిదిగా సాగుతున్నా ఖర్చులు సమర్థించుకోవలసి రావచ్చు. ఆరోగ్యం అనుకూలం. విద్యార్థులు, నిరుద్యోగులు టార్గెట్ విధానాలతో సాగుట మంచిది. వివాదాల్ని ఏర్పరచు అంశాల్లో లౌక్యంగా సాగాలి.

కన్య

ఈ రాశి వారికి ఈ రోజు మీ వ్యవహారాలు, పనులు అదనపు సంతృప్తిని ఇస్తాయి. వృత్తి, ఉద్యోగా లలో గుర్తింపులు పొందుతారు. అవకాశాలు కలసివస్తాయి. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగగలవు. బంధుమిత్రులవంటివారి రాక పోకలు వుంటాయి. చిన్నతరహా విందులకు ఏర్పాట్లు చేసుకొంటారు. కొన్ని ఊహించని ప్రయాణాలు చేయవలసిరావచ్చును. వ్యాపార విస్తరణలకు ప్రణాళికలను రచించుకొంటారు. గతంలోని ఇబ్బందులను దూరం చేసుకోగలరు.

తుల

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఉత్సాహాలు సిద్ధించగలవు. ఊహించనివిధంగా మంచి మార్పులను చూడగలరు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలకు పరిష్కారం ఏర్పరచుకొంటారు. నూతన వ్యక్తుల పరిచయాల్లో సందేహ బుద్ధితో సాగుట మంచిది. ఉత్తర ప్రత్యుత్తరాలను పూర్తిచేసుకోగలుగు తారు. శుభకార్య నిర్వహణలు, పుట్టినరోజు పండుగలు వంటివి ఉత్సాహంగా నిర్వహించుకోగలరు. ఆప్తులతో గడిపిన పూర్వపు రోజులను గుర్తు చేసుకొంటారు.

వృశ్చికం

రాశి వారికి ఈ రోజు అష్టమ కుజ స్థితిచే 24 కొన్నిట జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి. ముఖ్యంగా వాహన, యంత్రాదుల విషయంలో, ఇచ్చిపుచ్చుకొను విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తిని ఇచ్చు సంఘటనలు ఉంటాయి. ఇతరుల వ్యవహారములకు దూరంగా ఉంటూ మీ పనులకు పట్టుదలలు చూపుకోండి. వివాహ, ఉద్యోగ యత్నాలందు మంచి కదలి కలు వుంటాయి.

ధనుస్సు

ఈ రాశి వారికి ఈ రోజు గ్రహసంచారాలు మిశ్రమ ఫలములిస్తాయి. ఊహించనివిధముగా మీ పనులందు ప్రణాళికల్లో మార్పుచేర్పులు ఏర్పరచుకోవలసిరావచ్చును. ఖర్చులు సంతృప్తిని ఇస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో సంయమనాలకు ప్రాధాన్యతను ఇచ్చుకొంటూ సాగాల్సివుంటుంది. కుటుంబంలో ఏకవాక్యతలకై లౌక్యంతో సాగాల్సివుంటుంది. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు చురుకుగా సాగుతాయి.

మకరం

రాశి వారికి ఈ రోజు వృద్ధిని ఏర్పరచుకొనువిధంగా ఆలోచనలు సాగుతాయి. ఊహించుకొన్న వ్యక్తులచే సహకారాలు పొందలేకపోతారు. వాగ్విషయాలలో ఇతరులను కించపరచకుండా వ్యవహరించుకోవాలి. స్థిరాస్తులను ఏర్పరచుకోగలరు. అధికారులచే గుర్తింపులు పొందుతారు. పొదుపు మొత్తం చేతికి అందుతుంది. ఊహించుకొన్న మార్గాలలో పెట్టుబడులు ఉంచు తారు.

కుంభం

ఈ రాశి వారికి ఈ రోజు మనోధైర్యంతో సాగాల్సివుంటుంది. ప్రయోజనాలు అంతంతమాత్రమైనా సంతృప్తిని పొందుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. అనవసర ఖర్చులను తగ్గించుకొంటారు. ముఖ్యమనుకొన్న పనులను ఇతరులకు అప్పగించకుండా సొంతగానే చేపట్టుకోండి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యతనీయండి. నష్టాలను ఏర్పరచువాటిని గుర్తించగల్గుతారు.

మీనం

ఈ రాశి వారికి ఈ రోజు గ్రహసంచారాలు సంతృప్తినిచ్చువిధంగా ఉన్నాయి. చిన్న చిన్న అవకాశాలను చేపట్టుకొని ముఖ్యమనుకొన్న పనులను పూర్తిచేసుకొంటారు. ఖర్చు లలో నియంత్రణలు పాటించుకొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉంటాయి. కుటుంబంలో సమిష్టి యత్నాలు ఉంటాయి. ఆంతరంగిక వ్యవహారాలలో గోప్యంగా సాగండి. స్థిరాస్తుల వ్యవహారాలకు దూరంగా ఉండండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner