Rasi Phalalu: ఈరోజు ఈ రాశులకు ఆనందమే.. అదృష్ట రంగు ఆకుపచ్చ, కనకదుర్గాదేవి స్తోత్రం పఠిస్తే మంచిది.. మరి మీ రాశికి?-rasi phalalu today these rasis will gets luck money and many more see yours also and follow these remedies for success ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rasi Phalalu: ఈరోజు ఈ రాశులకు ఆనందమే.. అదృష్ట రంగు ఆకుపచ్చ, కనకదుర్గాదేవి స్తోత్రం పఠిస్తే మంచిది.. మరి మీ రాశికి?

Rasi Phalalu: ఈరోజు ఈ రాశులకు ఆనందమే.. అదృష్ట రంగు ఆకుపచ్చ, కనకదుర్గాదేవి స్తోత్రం పఠిస్తే మంచిది.. మరి మీ రాశికి?

HT Telugu Desk HT Telugu
Published Feb 09, 2025 04:00 AM IST

Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 09.02.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2025 Lucky Rasis: కొత్త సంవత్సరం ఈ రాశుల వారికి తిరుగే ఉండదు
2025 Lucky Rasis: కొత్త సంవత్సరం ఈ రాశుల వారికి తిరుగే ఉండదు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 09.02.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మాఘ, వారం : ఆదివారం, తిథి : శు. ద్వాదశి, నక్షత్రం :ఆరుద్ర

మేషం

ఆర్థిక పరిస్థితి గతం కంటే కాస్త మెరుగుపడుతుంది. కొన్ని వ్యవహారాలు నెమ్మెదిగా కొనసాగుతాయి. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. శుభకార్యాల నిర్వహణపై బంధువులతో చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళారంగం వారికి అవార్డులు రావచ్చు. నేరేడు, పసుపు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృషభం

వ్యవహారాలు కొంత పుంజుకుంటాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. భూములు, వాహనాలు కొంటారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. తీర్ధయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు, పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. నీలం, ఆకుపచ్చ రంగులు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మిధునం

ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. మీ కృషి కొన్ని విషయాలలో ఫలిస్తుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. వివాహ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. విదేశాలకు పయనమవుతారు. పసుపు, నేరేడు రంగులు, శివాష్టకం పఠించండి.

కర్కాటకం

వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. తెలుపు, నేరేడు రంగులు, గణేశాష్టకం పఠించండి.

సింహం

కొత్త పనులు సమయానికి పూర్తి కాగలవు, ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు, వాహనయోగం, బంధువుల నుంచి వచ్చే సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలలో చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. కళాకారులు, టెక్నికల్ రంగాల వారికి శ్రమ ఫలిస్తుంది. గులాబీ, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యస్తుతి మంచిది.

కన్య

అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలు ప్రగతిపథంలో సాగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. పసుపు, గులాబీ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల

కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా కొనసాగుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో ఎదుటవారిని విస్మయపరుస్తారు. స్థిరాస్తి వృద్ధి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. కొన్ని రుణాలు తీరుస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, నేరేడు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారి ఆశయాలు నెరవేరతాయి. గులాబీ, నేరేడు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు

ఆర్థికంగా మరింత మెరుగ్గా ఉంటుంది. పాత అనుభవాల రీత్యా నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారి ఆశయాలు నెరవేరతాయి. గులాబీ, తెలుపు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం

ఉత్సాహంతో అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. స్థిరాస్తిపై వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగాలలో గతం నుంచి నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. వైద్యులు, పారిశ్రామిక వేత్తలకు ఊహించని అవకాశాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు రావచ్చు. కుటుంబసభ్యులతో విభేదాలు, విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. తీర్ధయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు ముందుకు సాగవు. ఎరుపు. లేత గులాబీ రంగులు, కనకధారాస్తోత్రం పఠించండి.

మీనం

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. రుణబాధల నుంచి బయటపడతారు. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. విద్యార్థులు కోరుకున్న కోర్సులు దక్కించుకుంటారు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. పసుపు, ఆకుపచ్చరంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner