Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి ధనం, ఉద్యోగంతో పాటు బోలెడు లాభాలు.. ఏ రాశి వారు ఏం చేస్తే బాగుంటుందో కూడా తెలుసుకోండి
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 19.01.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 19.01.2025
సంబంధిత ఫోటోలు
Feb 14, 2025, 08:05 AMGuru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 14, 2025, 06:15 AMఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Feb 13, 2025, 08:09 AMRahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 12, 2025, 08:57 PMఈ మూడు రాశులకు గుడ్టైమ్ షురూ.. అన్నింటా అదృష్టం!
Feb 12, 2025, 08:23 AMSun Transit: కుంభ రాశిలో సూర్యుడి సంచారం, 4 రాశుల వారి జీవితంలో మార్పులు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధితో పాటు ఎన్నో
Feb 11, 2025, 02:22 PMShani Transit: పూర్వభాద్రపద నక్షత్రంలో శని సంచారం.. 3 రాశులకు ఆస్తి, వాహన, గృహ యోగం
ఆయనము: ఉత్తరాయణం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: పుష్యం, వారం : ఆదివారం, తిథి : కృ. పంచమి, నక్షత్రం : ఉత్తర ఫాల్గుణి
మేషం
ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. వేగవంతమైన ఫలితాలు ఉంటాయి. సంపాదన పెరుగుతుంది. మీదైన రంగంలో గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో శుభవార్త వింటారు. కీలకమైన నిర్ణయాలకు సరైన సమయం. సమాజ సేవకు సమయం కేటాయించండి. సున్నితంగా సంభాషించండి. లక్ష్మీదేవిని ధ్యానించండి.
వృషభం
ఈ రోజు ఈ రాశి వారికి సకాలంలో పనులు ఆరంభించండి. లోతైన అధ్యయనం తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. కాలానికి తగినట్టు ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకండి. మీ చుట్టూ సమస్యలు సృష్టించే వారున్నారు. జాగ్రత్తగా స్పందించండి. వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మిథునం
ఈ రోజు ఈ రాశి వారికి మనోబలం పెంచుకోండి. ధనయోగం ఉంది. వృథా ఖర్చులు పరిహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాధ్యతతో మెలగండి. విలువలకు కట్టుబడి పనిచేయండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. మీ సహనానికి కాలం పరీక్ష పెడుతుంది. అయినా, అంతిమ విజయం మీదే. వక్రభాష్యాలు ఇచ్చేవారితో జాగ్రత్త. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి.
కర్కాటకం
ఈ రోజు ఈ రాశి వారికి లాభదాయక ఫలితాలు ఉన్నాయి. జీవిత ఆశయాలు కార్యరూపం ధరిస్తాయి. అధికార యోగం ఉంది. బుద్ధిబలంతో విజయాలు సాధిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంపైన పట్టు సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పొదుపు-మదుపు అవసరాన్నీ గుర్తించాలి. ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంది. లక్ష్మీదేవిని ఉపాసించండి.
సింహం
ఈ రోజు ఈ రాశి వారికి మనోబలంతో పనులు ఆరంభించండి. ఏకాగ్రత అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధైర్యం వద్దు. ఆలోచనల్లో స్పష్టత అవసరం. ఒత్తిడి వల్ల పొరపాట్లకు ఆస్కారం ఉంది. ఉద్యోగులకు పరీక్షా సమయం. మిత్రుల సలహాలు తీసుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కన్య
ఈ రోజు ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు. సృజనాత్మకత పెంచుకుంటారు. పెట్టుబడుల కలిసొస్తాయి. భూలాభం సూచితం. 'కీర్తి పెరుగుతుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి.
తుల
ఈ రోజు ఈ రాశి వారికి అధికార లాభం సూచితం. ప్రముఖుల ప్రోత్సాహం లభిస్తుంది. మీ నైపుణ్యాన్ని నలుగురూ గుర్తిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. మీదైన నైపుణ్యంతో వ్యాపార నష్టాలను అధిగమిస్తారు. మిత్రుల సాయం అందుతుంది. ఆర్ధిక పురోభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. నవగ్రహాలను ధ్యానించండి.
వృశ్చికం
ఈ రోజు ఈ రాశి వారికి వ్యాపారం విస్తరిస్తుంది. ప్రయత్నాలు సఫలం అవుతాయి. భూ, గృహ, వాహనాది యోగాలున్నాయి. సజ్జన సాంగత్యం లభిస్తుంది. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. చిన్నపాటి అవరోధాలను మనసులోకి తీసుకోకూడదు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. పనుల వాయిదా ఒత్తిడిని పెంచుతుంది. ఓ శుభవార్త వింటారు. పరమేశ్వరుడిని ఆరాధించండి.
ధనుస్సు
ఈ రోజు ఈ రాశి వారికి మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఆశించిన ఫలితాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంది. ధన, ధాన్య వృద్ధి సూచితం. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. లక్ష్య సాధనలో ఓర్పు అవసరం. కోర్టు వ్యాజ్యాలలో అనుకూలమైన తీర్పులు వస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మహాగణపతిని ధ్యానించండి.
మకరం
ఈ రోజు ఈ రాశి వారికి లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. దైవబలం వెన్నంటి నిలుస్తుంది. ఉద్యోగులు నమ్మకంగా పనిచేయాలి. వ్యాపారంలో మరింత కృషి అవసరం. మొహమాటం పనికిరాదు. ఓ ఆపద నుంచి బయట పడతారు. శ్రీవేంకటేశ్వరుడిని పూజించండి.
కుంభం
ఈ రోజు ఈ రాశి వారికి శుభాలు జరుగుతాయి. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అధికారుల అండ ఉంది. దీర్ఘకాలం నుంచీ వాయిదాపడుతున్న పనులు కొలిక్కి వస్తాయి. నిర్ణయాల్లో కొంత దూకుడు అవసరం. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం బావుంటుంది. రుద్రాభిషేకం చేయించండి.
మీనం
ఈ రోజు ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అవరోదాలు ఎదురైనా తెలివిగా తప్పించుకుంటారు. కాలాన్ని వృథా చేయకండి. ఆర్థికంగా బావుంటుంది. అనుకోని ఖర్చులూ ఉంటాయి. అపరిచితులను విశ్వసించకండి. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటారు. వ్యాపారంలో సమయానుకూలంగా స్పందించండి. ఇష్టదైవాన్ని పూజించండి.
సంబంధిత కథనం
టాపిక్