Rasi Phalalu: ఈరోజు ఈ రాశి వారు నక్కతోక తొక్కినట్టే.. ఆస్తి, పేరు, కీర్తి, మంచి ఆదాయంతో పాటు ఊహించని లాభాలు
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 20.01.2025 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (దిన ఫలాలు) : 20.01.2025

ఆయనము: ఉత్తరాయణం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: పుష్యం, వారం : సోమవారం, తిథి : కృ. షష్టి, నక్షత్రం : హస్త
మేషం
ఈ రోజు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకూలత కల్గుతుంది. మీ సామాజికపరిధి గౌరవ ప్రదంగా విస్తరింపబడుతుంది. దూరప్రయాణాలు, ఖర్చులు తప్పవు. ఉదరరక్తసంబంధ అనారోగ్యమునకు చికిత్స అవసరమవుతుంది.
వృషభం
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికపరంగా ఇబ్బందులు ఉండవు. విదేశీవీసాలు, ఇతర దేశప్రయాణాలు కలసి వస్తాయి. ధైర్యంతో కార్యసిద్ధి కల్గుతుంది. విద్యా వికాసం కల్గుతుంది. రక్తపోటు నియంత్రణవిషయంలో శ్రద్ధ అవసరం. ధనం నిల్వచేస్తారు.
మిథునం
ఈ రోజు ఈ రాశి వారికి మీ ఆశయాలను, లక్ష్యాలను మననం చేసుకుని, అవరోధాలను అధిగమించి, సహనం మరియు శాంతస్వభావంతో అన్నింటిలోనూ విజయం సాధిస్తారు. వాహనచోదకులు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికవిషయాల్లో శ్రద్ధ అవసరం. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మీ ఉద్యోగ జీవితంలో సమస్యలు, కొంత మానసికఒత్తిడి, వాదనలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుండె మరియు పొట్టకు సంబంధించిన ఆరోగ్యసమస్యలు పెరుగుతాయి.
సింహం
ఈ రోజు ఈ రాశి వారికి విలాసాలను అనుభవిస్తారు. సమస్త కోరికలు నెరవేరుతాయి. సంపద, ఆస్తి కూడబెట్టు కునే అవకాశం ఉంది. ఆస్తి, పేరు, కీర్తి, మంచి ఆదాయం, కుటుంబంలో ఆనందం, మంచి ఆరోగ్యం కల్గుతాయి.
కన్య
ఈ రోజు ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల నిరంతరభయం. మార్గావరోధాలను నిరోధించుటకు దూరప్రయాణాలు మానండి. అధికారులవలనగానీ లేదా ప్రభుత్వం నుండి గుర్తింపు లేదా ప్రతిఫలం వస్తుంది.
తుల
ఈ రోజు ఈ రాశి వారికి రావలసిన బాకీలు వసూలు అవుతాయి. సోదరవర్గం వారి అండదండలుంటాయి. ప్రణాళికలతో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం చేస్తారు. పుత్ర సంతానప్రాప్తి. కోర్టువిషయాలు అనుకూలం.
వృశ్చికం
ఈ రోజు ఈ రాశి వారికి న్యాయస్థానాలచుట్టూ తిరగడం, ధన వ్యయం, బంధనయోగం పొంచి ఉంది. తల నొప్పి, కంఠం సంబంధిత అనారోగ్య సూచనలు. నెలాఖరునుంచి సుబ్రహ్మణ్యఆరాధన, అభిషేకం ఉపశమనాన్ని స్తుంది.
ధనుస్సు
ఈ రోజు ఈ రాశి వారికి అధికారహోదా పెరగడం, ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యం సామాన్యం. గృహమున శుభకార్యాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా అనుకూలం.
మకరం
ఈ రోజు ఈ రాశి వారికి గతంనుంచి పేచీలతో సాగుతున్న వైవాహికబంధాలు ఒక కొలిక్కి వచ్చి విముక్తులవుతారు. సహనాన్ని అలవరచుకోవడం మంచిది.
కుంభం
ఈ రోజు ఈ రాశి వారికి పై అధికారులు మిమ్ములను ప్రశంసిస్తారు. పలుకుబడి, గుర్తింపు పొందుతారు. కుటుంబం మరియు స్నేహితులు మిమ్మల్ని గౌరవిస్తారు. సామాజికపరంగా కూడా ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం అనుకూలం.
మీనం
ఈ రోజు ఈ రాశి వారికి జీవితం ఉల్లాసంగా ఉంటుంది. సంతృప్తి కరమైన ఆదాయాన్ని మరియు వృద్ధిని పొందు తారు. జీవితభాగస్వామితో మీ సంబంధంకూడా మధురంగా మరియు మృదువైనదిగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ సంకల్పశక్తిని పెంచుతుంది.
సంబంధిత కథనం
టాపిక్