Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. ఈ రాశుల వారు సూర్యష్టకం చదవాలి-rasi phalalu check horoscope today in telugu predictions for 12 moon signs for sun day june 4 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Rasi Phalalu Check Horoscope Today In Telugu Predictions For 12 Moon Signs For Sun Day June 4 2023

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. ఈ రాశుల వారు సూర్యష్టకం చదవాలి

HT Telugu Desk HT Telugu
Jun 04, 2023 02:07 AM IST

Horoscope today: ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలితము) 04.06.2023వ తేదీ ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

నేటి రాశిఫలితాలు
నేటి రాశిఫలితాలు

Horoscope today: ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలితము) 04.06.2023వ తేదీ ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

ట్రెండింగ్ వార్తలు

ఈరోజు రాశిఫలాలు తేదీ 04.06.2023

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం : జ్యేష్టము

వారం: ఆదివారం, తిథి: పూర్ణిమ నక్షత్రం : జ్యేష్ట

మేష రాశి ఈరోజు రాశి ఫలాలు

మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. చికాకులు అధికముగా ఉండును. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మేషరాశికి జన్మస్థానము నందు బుధ, గురు, రాహువులు, వాక్‌ స్థానం నందు రవి ప్రభావం చేత గొదవలకు దూరంగా ఉండాలని సూచన. చతుర్ధ స్థానము నందు కుజ, శుక్రుల ప్రభావంచేత కుటుంబ విషయాలయందు చికాకులు ఏర్పడు సూచన. పనులు యందు ఆటంకములు, చికాకులు కలుగును. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు అధికముగా ఉన్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశి వారికి శని యొక్క అనుకూల స్థితివలన ధనపరమైనటు వంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందెదరు.

మేషరాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సుబ్రహ్మణ్యుని పూజించడం, సూర్యభగవానుని ఆరాధించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. సూర్యాష్టకం చదువుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు

వృషభరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యయ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ప్రయాణములు, ఖర్చులు అధికముగా ఉండును. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. శారీరక శ్రమ, ఒత్తిడి అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములుండును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికముగా ఉందును. వృషభరాశి వారికి దశమమునందు శని ప్రభావంచేత ఆర్థికపరంగా లాభము చేకూరును.

వృషభరాశివారు ఆదివారం రోజు నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యుణ్ణి ఆరాధించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభ రాశివారు ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ఈరోజు మిథునరాశి ఫలాలు

మిథునరాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఖర్చులు అధికమగును. మిథున రాశి వారికి వాక్‌ స్థానమునందు కుజుడు, వ్యయస్థానము నందు రవి ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన ఆవేశపూరిత నిర్ణయాల వల్ల చికాకులు ఇబ్బందులు కలుగును. వివాదాలు ఏర్చడు సూచన. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుటచేత మిథునరాశి వారికి కొన్ని పనులు అనుకూలించును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము.

మిథునరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకరాశి ఫలాలు

కర్కాటక రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. జన్మరాశియందు కుజుని, అష్టమ శని ప్రభావంచేత శారీరక (శ్రమ, మానసిక ఒత్తిళ్ళు ఏర్పడును. లాభస్థానమునందు రవి, దశమ స్థానమునందు బుధ గురు, రాహువుల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరోగ్య విషయములయందు కుటుంబ వ్యవహారములయందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉందును. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

కర్మాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.

సింహరాశి ఈరోజు ఫలితాలు

సింహరాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యయ స్థానములో కుజ, శుక్రుల సంచారంచేత ఖర్చులు అధికమగును. ఇష్టమైన వస్తువులు కొనే ప్రయత్నం చేసెదరు. లాభ స్థానములో శుక్రుడు దశమస్థానములో రవిప్రభావంచేత, భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశి వారికి చేసే ప్రతి పని అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు అధికముగా ఉండు సూచన. నూతన వస్తువుల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేస్తారు. ఆర్థికపరమైన నిర్ణయాలు అనుకూలించును. విద్యార్థులకు అనుకూలమైన సమయము. స్త్రీలు కుటుంబ విషయాలయందు, ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి.

సింహరాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

కన్యారాశి ఈరోజు ఫలాలు

కన్యారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార విషయాలు లాభించును. కన్యారాశి వారికి లాభస్థానములో కుజ, శుక్రుల ప్రభావం చేత ధనలాభము కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. అష్టమస్థానము నందు బుధ, గురు, రాహువుల సంచారం వలన ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. స్త్రీ సౌఖ్యం కలుగును. కన్యారాశి వారికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును.

కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఈరోజు సూర్యాష్టకాన్ని పఠించలి. విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేయడం మంచిది.

ఈరోజు తులా రాశి ఫలాలు

తులారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. దశమ స్థానమునందు కుజ, శుక్రుల ప్రభావంచేత తులారాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్చడును. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత కుటుంబము నందు చికాకులు ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు అనుకూలము. కుటుంబ విషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

తులారాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి నేటి రాశి ఫలాలు

వృశ్చిక రాశికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కళత్ర స్థానమునందు రవి ప్రభావం చేత కుటుంబము నందు సమస్యలు ఏర్పడు సూచన. అర్జాష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. కుటుంబ విషయాల యందు శ్రమ అధికముగా ఉండును. స్త్రీలకు మధ్యస్థ సమయము. విద్యార్థులకు అనుకూల సమయము. 

వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహ ఆలయాల్లో పూజలు చేయాలి.

ధనుస్సు రాశి జాతకం

ధనూ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. అష్టమ కుజ, శుక్రుల ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యులతో సమస్యలు ఏర్పడు సూచన. ఐదో స్థానమందు నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. ధన లాభము కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము.

ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్ట్రకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.

మకర రాశి దిన ఫలాలు

మకర రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. ప్రయాణములు అనుకూలించును. ఆరోగ్యము అనుకూలించును. ఖర్చులు పెరుగు సూచన. చతుర్ధ స్థానమునందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన, పంచమ స్థానమునందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. వ్యాపారస్తులకు కష్టకాలము. విద్యార్థులకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మకరరాశి వారికి ఏలినాటి శని ప్రభావంచేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించాలి.

మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్ట్రకాన్ని పఠించండి.

ఈ రోజు రాశి ఫలాలు కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఏలినాటి శని ప్రభావంచేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరో స్థానము నందు కుజ, శుక్రులు ప్రభావంచేత శత్రు పీడ అధికమగును. పనుల యందు ఆలస్యములు ఏర్పడినప్పటికి అనుకున్న పనులు ఏదోవిధంగా పూర్తి చేసెదరు. ధనపరమైనటువంటి విషయాలయందు శ్రమ అధికమగును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును.

కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

మీన రాశి ఫలితాలు

మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నవి. ప్రయాణాలు అనుకూలించును. ఆరోగ్య విషయాలకై ధనమును ఖర్చు చేసెదరు. ఏలినాటి శని ప్రభావం, వాక్‌ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాలయందు చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు చేయడానికి అనుకూలంగా లేనటువంటి సమయము. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు మథ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

మీనరాశి జాతకులు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ 9494981000

WhatsApp channel

టాపిక్