Amalaki ekadashi: అమలకి ఏకాదశి రోజు అద్భుతమైన యోగం.. ఈ రాశుల వారికి సంతోషం, సౌభాగ్యం పెరుగుతాయి
Amalaki ekadashi: నేడు అమలకి ఏకాదశి. 20 సంవత్సరాల తర్వాత అమలకి ఏకాదశి రోజు అరుదైన యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి సంతోషం, సౌభాగ్యం పెరుగుతాయి. జీవితంలోని బాధల నుంచి విముక్తి కలుగుతుంది.

Amalaki ekadashi: మామూలుగా ఏకాదశి నాడు విష్ణువుని పూజించడం ఆచారం. కానీ ఈ ఏకాదశి రోజు మాత్రం విష్ణువుతో పాటు శివపార్వతులను కూడా పూజిస్తారు. ఫాల్గుణ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి లేదా రంగ్ భరి ఏకాదశి అంటారు. దీన్నే ఉసిరి ఏకాదశి అని కూడా పిలుస్తారు. పద్మ పురాణం ప్రకారం ఉసిరి అంటే మహా విష్ణువు ఎంతో ప్రీతి ప్రాతమైనది. ఈరోజు ఉసిరి చెట్టును కూడా పూజిస్తారు.
అమలకి ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల వంద ఆవులను దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని మత విశ్వాసాలు పేర్కొంటున్నాయి. విష్ణు ఆరాధనతో పాటు ఉసిరి చెట్టును గౌరవించే సంప్రదాయం ఈరోజు ఉంటుంది. అటు శివపార్వతుల రాకకు గుర్తుగా కాశీలో రంగ్ భరి ఏకాదశి నిర్వహిస్తారు. పార్వతీ పరమేశ్వరులు స్వాగతం పలుకుతూ హోలీ వేడుకలు జరుపుకుంటారు. అయితే రంగులతో కాకుండా భస్మంతో హోలీ జరుపుకోవడం ఇక్కడ విశేషం.
రంగ్ భరి ఏకాదశి నాడు పుష్య నక్షత్రం, రవి యోగం కలిసి వచ్చాయి. ఈ సంయోగం 20 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో పుష్య నక్షత్రం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా లావాదేవీలకు పుష్య నక్షత్రం లాభదాయకంగా ఉంటుంది. ఈ నక్షత్రం ఉన్న సమయంలో ఏదైనా పని చేపడితే అందులో వంద రెట్లు ఫలితం పొందుతారు.
అమలకి ఏకాదశి రోజున ఏర్పడుతున్న రవి యోగం, పుష్య నక్షత్ర కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఈ నాలుగు రాశుల వారికి విష్ణు, శివుని ఆశీర్వాదాలు లభిస్తాయి.
మేష రాశి
మేష రాశి వారికి ఈ ఏకాదశి మరచిపోలేని రోజుగా నిలుస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. జీవితాన్ని సౌకర్యవంతంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు అనుభవిస్తారు. కార్యాలయంలో మీ కీర్తి పెరుగుతుంది. పురోగతికి అవకాశాలు ఉంటాయి.
మిథున రాశి
ఈ సమయంలో మిథున రాశి వారికి అనుకూలమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాలలో పనిచేయాలనుకున్న వారి కల నెరవేరుతుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీ మాటలతో అందరూ దృష్టిని ఆకర్షిస్తారు. ధన ప్రవాహం పెరుగుతుంది. శివ గౌరీ అనుగ్రహంతో జీవితంలో అన్ని బాధలనుంచి విముక్తి కలుగుతుంది.
తులా రాశి
వృత్తిగత జీవితంలో శుభవార్తలు అందుకుంటారు. అకడమిక్ పనిలో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాల కోసం కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మికంగా బలపడతారు.
ధనుస్సు రాశి
కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మునుపటి పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యక్తిగత సంబంధాల్లో సంతోషం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇది ధనుస్సు రాశి వారికి శుభ సమయం.