Raksha Bandhan 2024: రక్షా బంధన్ రోజున 7 శుభ యోగాలు, రాఖీ కట్టే ముందు సోదరి ఈ శ్లోకం చెబితే మంచిది
Raksha Bandhan: రక్షా బంధన్ రోజున 7 శుభ యోగాల ఏర్పడనుండటంతో సోమవారం ప్రాముఖ్యత గణనీయంగా పెరిగింది. భద్ర కారణంగా రాఖీ కట్టే సమయంపై అందరిలో కాస్త గందరగోళం నెలకొంది.
Raksha Bandhan: దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 19న (సోమవారం) రక్షా బంధన్‌ను జరుపుకోబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ రక్షాబంధన్ రోజున 7 శుభ యోగాలు పుట్టుకొస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఆగస్టు 19న రవియోగం, శశ్ రాజయోగం, శోభన్ యోగం, బుద్ధాదిత్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం, శుక్రాదిత్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనున్నాయి. వీటితో పాటు శ్రావణ చివరి సోమవారం, శ్రావణ పౌర్ణమి కూడా కలిసి రానున్నాయి.
శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలో, సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశిలో ఉంటారు. కాబట్టి ఈ రక్షాబంధన్ చాలా పవిత్రమైనది, ప్రత్యేకమైనది. అయితే భద్ర కాలంలో రేపు రాఖీ కట్టడం నిషిద్ధం. పంచాంగం ప్రకారం భద్రకాళం ఆగస్టు 19న మధ్యాహ్నం 1.32 గంటల వరకు ఉంటుంది. అందువల్ల సోమవారం మధ్యాహ్నం 1.32 గంటల తర్వాతే సోదరీమణులు తమ సోదరులకి రాఖీ కట్టడం ఉత్తమం.
భద్రలో రాఖీ ఎందుకు కట్టకూడదు?
శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమ తిథి నాడు రక్షా బంధన్ జరుపుకుంటారని పండిట్ రమేష్ చంద్ర త్రిపాఠి వివరించారు. పంచాంగం ప్రకారం, సోమవారం భద్రను కళ్యాణిగా వర్ణించినప్పటికీ భద్ర రోజులో అశుభమైనది.
సూర్యదేవుని కుమార్తె, శనిదేవుని సోదరి అయిన భద్ర స్వభావం కూడా శనిదేవుని తరహాలోనే ఉండటంతో భద్రకాళంలో శుభ, పుణ్యకార్యాలు చేయరు. భద్ర ముగిసిన తర్వాతే సంపూర్ణ శ్రేయస్సు కాంక్షతో తమ అతిథులకు రక్షణ దారాన్ని కట్టుకుంటారు. ఈ రక్షా బంధన్ రోజున, శ్రావణ నక్షత్రం, శోభన్ యోగం రూపంలో పవిత్రమైన కలయిక ఏర్పడుతోంది.
సోదరీమణులు తమ సోదరుడికి రక్షణ కల్పిస్తూ వినాయకుడిని ధ్యానించి, సోదరుడు క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ రాఖీ కట్టాలి. రాఖీ కట్టే ముందు సోదరి తన సోదరుడికి ఎలాంటి ఆపద రాకూడదని శ్లోకం చదివి రాఖీ కడితే మంచిది. పురాతన కాలంలో శ్రీకృష్ణుడిని ద్రౌపది ఈ శ్లోకంతోనే రక్షించింది. అది ఏంటంటే
యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబల
తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల