రక్షా బంధన్ 2025: ఈ ఏడాది రక్షా బంధన్ ఎప్పుడు వచ్చింది? రాఖీ కట్టడానికి శుభ సమయాన్ని నోట్ చేసుకోండి!-raksha bandhan 2025 check auspicious time to tie rakhi this year ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  రక్షా బంధన్ 2025: ఈ ఏడాది రక్షా బంధన్ ఎప్పుడు వచ్చింది? రాఖీ కట్టడానికి శుభ సమయాన్ని నోట్ చేసుకోండి!

రక్షా బంధన్ 2025: ఈ ఏడాది రక్షా బంధన్ ఎప్పుడు వచ్చింది? రాఖీ కట్టడానికి శుభ సమయాన్ని నోట్ చేసుకోండి!

Peddinti Sravya HT Telugu

హిందూమతంలో సోదర ప్రేమకు పవిత్రమైన పండుగ రక్షా బంధన్. ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. సోదర సోదరీమణుల మధ్య ఉన్న పవిత్ర అనురాగం అన్ని సంప్రదాయాలు, నమ్మకాలకు అతీతమైనది. రక్షా బంధన్ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు.

రక్షా బంధన్ 2025 (pixabay)

హిందూ మతంలో సోదర ప్రేమ పవిత్ర పండుగ రక్షా బంధన్ చాలా ముఖ్యమైనది. ఈ రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరు జరుపుకుంటారు. సోదర సోదరీమణుల మధ్య ఉన్న పవిత్ర అనురాగం అన్ని సంప్రదాయాలు, నమ్మకాలకు అతీతమైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం, రక్షా బంధన్ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు.

రక్షా బంధన్

రక్షా బంధన్ పండుగ సోదర ప్రేమకు చిహ్నం. ఏడాది పొడవునా ఈ పండుగ కోసం అక్కాచెల్లెళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ రోజున సోదరీమణులు సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. సోదరసోదరీమణులు జీవితాంతం తమ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు.

రక్షా బంధన్ తేదీ 2025: ఆగస్టు 9

రక్షా బంధన్ 2025 శుభ ముహూర్తం - ఉదయం 5:47 నుండి మధ్యాహ్నం 1:24 వరకు (రాఖీ కట్టడానికి చాలా మంచి సమయం) ఒకవేళ అలా ఈ సమయంలో కుదరకపోతే ఎలాంటి ముహూర్తం చూడకుండా సాయంత్రం వరకు రాఖీ కట్టుకోవచ్చు.

2025 రక్షా బంధన్ రోజున భద్ర నీడ ఉండదు

  • ఈ ఏడాది రక్షాబంధన్ నాడు భద్ర నీడ ఉండదు. ఈ ఏడాది ఆగస్టు 9న సూర్యోదయానికి ముందే భద్ర కాలం ముగుస్తుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోండి

  1. రక్షాబంధన్ నాడు ముందు దేవుడికి హారతి ఇచ్చి, ఆ తరవాత సోదరుడికి ఇచ్చి ఆ తరవాత వారికి కుంకుమతో బొట్టు పెట్టాలి.
  2. అక్షింతలు ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకోండి.
  3. దీని తరువాత, స్వీటు పెట్టి సోదరుడికి రాఖీ కట్టడం ప్రారంభించండి.
  4. 21 రోజులు లేదా జన్మాష్టమి వరకు మీ మణికట్టు నుండి రాఖీని తొలగించవద్దు.
  5. చాలా సార్లు కొంతమంది సోదరులు రాఖీ కట్టిన వెంటనే కానీ కొన్ని గంటల తరువాత వారి మణికట్టు నుండి రాఖీని తొలగించడం మంచిది.
  6. పండితులు, శాస్త్రాలు, నమ్మకాల ప్రకారం సోదరుడు కనీసం 21 రోజులు లేదా జన్మాష్టమి వరకు తన మణికట్టు నుండి రాఖీని తొలగించకూడదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.