రాహువు ఆట మొదలు పెట్టబోతున్నాడు, త్వరలో ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.. వీరిలో మీరూ ఒకరవ్వచ్చు చూసుకోండి!-rahu transit will bring lots of luck to these 5 rasis soon and check your rasi is there in this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  రాహువు ఆట మొదలు పెట్టబోతున్నాడు, త్వరలో ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.. వీరిలో మీరూ ఒకరవ్వచ్చు చూసుకోండి!

రాహువు ఆట మొదలు పెట్టబోతున్నాడు, త్వరలో ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.. వీరిలో మీరూ ఒకరవ్వచ్చు చూసుకోండి!

Peddinti Sravya HT Telugu

గ్రహాల గమనం మనిషి జీవితంలో మార్పు తెస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. నీడ గ్రహం రాహువు 2025 మేలో కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది. రాహువు సంచారం ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తుందో తెలుసుకుందాం.

రాహువు ఆట మొదలు పెట్టబోతున్నాడు, త్వరలో ఈ 5 రాశుల వారికి అదృష్టం

వైదిక జ్యోతిషశాస్త్రంలో శని తరువాత నెమ్మదిగా కదిలే గ్రహం రాహువు. రాహువు 18 నెలలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. 2025 మే 18న రాహువు శని యొక్క కుంభ రాశిలోకి వెళ్తాడు.

రాహువు కుంభ రాశిలో ప్రవేశించగానే అన్ని రాశులలో ప్రభావం కనిపిస్తుంది. అయితే ఇది కొన్ని రాశుల వారి జీవితంలో అదృష్టాన్ని తెస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ కాలంలో వృత్తి, ఆర్థిక, వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి. ఈ సంచారం వల్ల ఏ రాశుల వారికి మంచి ఫలితాలు వస్తాయో చూద్దాం.

1.మేష రాశి

మేష రాశి వారికీ ఈ మాసంలో రాహువు సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీ జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సంబంధాలు బలపడతాయి. మీ పనికి సంబంధించి ఆశించిన మద్దతు లభిస్తుంది.

2.మిథున రాశి

మిథున రాశి వారికి రాహువు సంచారం వల్ల శుభాలు కలుగుతాయి. ఈ సంచారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు వృత్తిపరంగా మంచి విజయాన్ని అందుకుంటారు. రాజకీయ, మీడియా రంగాల వారికి ఎక్కువ లాభాలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

3.తులా రాశి

తులా రాశి వారికి ఈ సంచారం ప్రేమ, జీవితంలో పెద్ద మార్పులను తెస్తుంది. తులా రాశి జాతకుల 5వ ఇంట్లో ఈ సంచారం జరుగుతుంది. విద్య, ప్రేమ, సంబంధాలు, పిల్లలకు సంబంధించిన విషయాలలో సానుకూల ప్రభావాలను చూపుతుంది. కళ, సినిమా, రచన, మీడియా మొదలైన రంగాల వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో కొత్త విజయాన్ని అందుకుంటారు. ఇది కాకుండా, మీరు పెట్టుబడికి సంబంధించి ఏదైనా ప్రధాన నిర్ణయం తీసుకోవచ్చు. భవిష్యత్తులో తులా రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది.

4.మకర రాశి

మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సంచారం చాలా ముఖ్యం. రాహువు సంచారం వల్ల కొత్త ఆదాయ వనరు ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు పెద్ద లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు ఉన్నాయి. మీ వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఈ కాలంలో కొన్ని పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు.

5.మీన రాశి

మీన రాశి వారికి రాహువు సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, మీడియా రంగాల వారికి చాలా లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు. కొత్త అవకాశాలను వెతుక్కునే వారు వృత్తి లేదా వ్యాపారంలో పెద్ద మార్పులు చేసుకోవాలనుకునే వారికి గొప్ప ప్రభావం ఉంటుంది. రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటారు. సకాలంలో ఆలోచించాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.