Rahu Transit: రాజయోగం తీసుకొస్తున్న రాహు గ్రహం.. 2025లో ఈ మూడు రాశుల వారికి లక్కీ ఛాన్స్!
Rahu Transit: నీడ గ్రహంగా పిలిచే రాహువు కుంభ ప్రయాణం ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రాశులు దీని ద్వారా రాజయోగాన్ని అనుభవించబోతున్నాయి. అవి ఏ రాశులో తెలుసుకుందాం.
తొమ్మిది గ్రహాలలో రాహువు అత్యంత అశుభ గ్రహం. అతను ఎల్లప్పుడూ వెనుకకు ప్రయాణిస్తాడు. రాహు, కేతువులు విడదీయరాని జంట గ్రహాలు. అవి వేర్వేరు రాశులలో ప్రయాణించినప్పటికీ, వాటి కార్యకలాపాలు ఒకేలా ఉంటాయి. శని తరువాత నెమ్మదిగా కదిలే గ్రహం రాహు గ్రహమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. రాహువు ఒక రాశి నుండి మరో రాశికి మారడానికి 18 నెలల సమయం పడుతుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం.. రాహు గ్రహం గత ఏడాది అంటే 2023 అక్టోబర్ రాశి చక్రంలోని చివరిలో రాశి అయిన మీన రాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఏడాది పొడవునా అదే రాశిచక్రంలో ప్రయాణిస్తున్న రాహు 2025 లో తన స్థానాన్ని మార్చుకుంటాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు మే 18, 2025న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి డిసెంబర్ 5, 2026 వరకు అదే రాశి చక్రంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కుంభరాశి శనికి చెందిన రాశి. కనుక కుంభ రాశిలో రాహువు సంచారం రాశి చక్రంలోని అన్ని రాశుల వారిపై పడుతుంది. అయితే కొన్ని రాశులు దీని ద్వారా రాజయోగాన్ని అనుభవించబోతున్నాయి. అందులో మీ రాశి ఉందా లేదా తెలుసుకుందాం.
మేష రాశి:
రాహు కుంభ రాశిలో సంచరిస్తున్నప్పుడు మేష రాశి వారికి పదకొండవ స్థానంలో ఉంటాడు. కనుక ఇది మీకు చాలా అనుకూలమైన సమయంగా మారనుంది. 2025 సంవత్సరంలో మీకు అన్నింటా శుభమే గోచరిస్తుంది. కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఇతరులలో గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు విలువ, పలుకుబడి పెరుగుతాయి. మీరు వివిధ ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో మంచి పురోగతిని పొందుతారు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులకు త్వరగా వివాహం జరుగుతుంది.
ధనుస్సు రాశి
కుంభ రాశిలో రాహువు సంచరిస్తున్నప్పుడు ధనస్సు రాశి వారికి మూడవ స్థానంలో ఉంటాడు. కనుక 2025లో మీకు రాజయోగం ఏర్పడుతుంది. అనుకోని విధంగా అనేక మంచి మార్పులు సంభవిస్తాయి. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. రుణ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో తరచూ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. భవిష్యత్తుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు మీకు పురోగతిని తెస్తాయి. ధనానికి కొదవ ఉండదు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది. విద్య, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి.
కుంభ రాశి:
రాహు మీ రాశిలో సంచరిస్తున్నప్పుడు మీకు మొదటి స్థానంలో ఉంటాయి. కనుక 2025 ఏడాదంతా మీకు చాలా బాగుంటుంది.మీరు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. జీవితంలో సానుకూల మార్పులు ఉండవచ్చు. వృత్తిపరంగా మంచి పురోగతి సాధిస్తారు. మీరు వివిధ రకాల ప్రయోజనాలను పొందవచ్చు. మీరు పనిచేసే చోట పదోన్నతి, వేతన పెంపును పొందవచ్చు. ఆదాయంలో మంచి పెరుగుదల లభిస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. లవ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీకు ఒత్తిడి బాగా తగ్గుతుంది.