Rahu Transit: ఈ 4 రాశుల్లో మీరు ఉన్నారంటే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే!-rahu transit 2024 will brought good luck to these 4 zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rahu Transit: ఈ 4 రాశుల్లో మీరు ఉన్నారంటే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే!

Rahu Transit: ఈ 4 రాశుల్లో మీరు ఉన్నారంటే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే!

Ramya Sri Marka HT Telugu

రాహు సంచారం 2024లో ఈ రాశులకు లక్కీ ఛాన్స్ తెచ్చిపెట్టనుంది. సాధారణంగా చెడు గ్రహంగా భావించే రాహువు తిరోగమనం చెందడం వల్ల కొన్నిరాశాల వారికి శుభ ఫలితాలు కలుగనున్నాయి. ప్రత్యేకించి ఈ 3 రాశులకు ఇది బాగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి.

రాహు సంచారంతో ఈ రాశుల వారికి లక్కీ ఛాన్స్
  • రోదసిలో ఎల్లప్పుడూ ఉంటూ కొంత కాలం పాటు సూర్యుడు కూడా కనిపించకుండా చేసి గ్రహణం సృష్టించగలడు రాహువు. కనుక కల్పనా జగత్తుకు ప్రతీకగా రాహువును అభివర్ణిస్తుంటారు జ్యోతిష పండితులు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. నీడగా పరిగణించే రాహు-కేతువులు వారి సంచారం వల్ల ప్రపంచంతో పాటు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తారు. కొన్ని రాశుల వారిని ఈ సంచారం అమాంతం పడదోస్తుంది. అలాగే మరికొందరికి విపరీతంగా కలిసొచ్చి కాసుల వర్షం కురిపిస్తారు. కేవలం ధనమే కాదు ఆరోగ్యం, ప్రేమ పెళ్లి, ఉద్యోగంలో ప్రమోషన్, కుటుంబంలో సమస్యలు, విదేశాలకు వెళ్లే అవకాశం, ఆకస్మిక ధన లాభం, చక్కటి వైవాహిక జీవితం లాంటివి ఎన్నో అంశాల్లో దేదీప్యమానంగా కలిసి రావొచ్చు.

రాహు సంచార సమయం: రాహు నక్షత్రం 10 నవంబర్ 2024 రాత్రి 11:31 గంటలకు దిశ మార్చుకుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉత్తర భాద్రపద నక్షత్రంలోని మూడవ పాదం నుండి రెండవ పాదానికి రాహువు ప్రవేశించాడు. 2025 జనవరి 10 వరకు రాహువు ఈ నక్షత్రంలో ఉంటాడు, ఆ తరువాత ఉత్తర భాద్రపద నక్షత్రం నుండి రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా రాహువు దిశ మార్చుకోవడం కొన్ని రాశుల వారికి చాలా శుభదాయకంగా ఉంటుంది. రాహువు సంచారం ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోండి. కలిసొచ్చే కాలం ముందుకొచ్చినప్పుడు, అనువైన అవకాశం చేతికొచ్చినప్పుడు వృథా కానివ్వక తక్షణమే పనులు మొదలుపెట్టండి.

1. వృషభ రాశి - రాహువు సంచారం వృషభ రాశి వారికి అత్యంత శుభదాయకం. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ధనం కూడా పాత పద్దతి నుంచే వస్తుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం లభిస్తుంది.

2. కన్యారాశి - రాహు ప్రభావం వల్ల కన్య రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. వ్యాపారులకు లాభదాయకమైన సమయం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో ప్రయోజనం ఉంటుంది. ఎదుగుదలకు అవకాశాలు ఉంటాయి.

3. తుల రాశి - తులారాశి వారికి రాహువు మార్పు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు మంచి పరిస్థితి ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. కొంతమంది స్థానికులకు విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది.

4. ధనుస్సు రాశి - ధనుస్సు రాశి వారికి రాహువు స్థానం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలున్నాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా మతపరమైన పనులు ఉండవచ్చు. ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. అనుకోకుండా ధనలాభం పొందే ఆస్కారం ఉంది. నిలిచిపోయిన ధనాన్ని అందుకుంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.