కుంభ రాశిలో రాహువు, చంద్రుల కలయిక.. ఈ రాశుల వారు 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి!-rahu moon conjunction in kumbha rasi these three rasis have to be careful for 2 days may suffer with few problems ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కుంభ రాశిలో రాహువు, చంద్రుల కలయిక.. ఈ రాశుల వారు 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి!

కుంభ రాశిలో రాహువు, చంద్రుల కలయిక.. ఈ రాశుల వారు 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి!

Peddinti Sravya HT Telugu

ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో, అనేక ప్రధాన గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చబోతున్నాయి. మరి కొద్ది రోజుల్లో చంద్రుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువు ఇప్పటికే శని కుంభ రాశిలో ఉన్నాడు. చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించిన వెంటనే రాహువుతో కలయిక ఏర్పడుతుంది.

కుంభ రాశిలో రాహువు, చంద్రుల కలయిక

రాహువు, చంద్రుల కలయిక కుంభ రాశిలో ఏర్పడుతుంది: ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో, అనేక ప్రధాన గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చబోతున్నాయి. మరి కొద్ది రోజుల్లో చంద్రుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువు ఇప్పటికే శని కుంభ రాశిలో ఉన్నాడు. చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించిన వెంటనే రాహువుతో కలయిక ఏర్పడుతుంది.

రాహువు, చంద్రుల కలయిక గ్రహణ యోగాన్ని సృష్టిస్తుంది, ఇది శుభప్రదంగా పరిగణించబడదు. కుంభరాశిలో రాహువు, చంద్రుడు ఉండటంతో కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు లభిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఏదీ సక్రమంగా జరగడం లేదని భావిస్తారు. ఇంటి వాతావరణం కూడా అల్లకల్లోలంగా కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం.

పంచాంగం ప్రకారం చంద్రుడు సెప్టెంబర్ 6న ఉదయం 11:21 గంటలకు కుంభ రాశిలోకి ప్రవేశించి సెప్టెంబర్ 8 మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటాడు. కుంభ రాశిలో రాహు-చంద్రుడు కలయిక ఏ రాశుల వారికి సమస్యలను తీసుకు వస్తుందో తెలుసుకుందాం.

రాహువు, చంద్రుల కలయిక.. ఈ రాశుల వారు 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి

1.తులా రాశి

తులా రాశి వారికి కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక సమస్యలను కలిగిస్తుంది. మీ గౌరవానికి భంగం కలగవచ్చు. వ్యాపార రంగంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదీ సక్రమంగా జరగడం లేదని భావిస్తారు. ఈ సమయంలో ధైర్యాన్ని కోల్పోకుండా ఆరాధనపై దృష్టి పెట్టాలి.

2.సింహ రాశి

కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక సింహ రాశి వారికి అశుభ ఫలితాలను తీసుకు వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు పెట్టుబడికి దూరంగా ఉండాలి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో ఆనందం, గౌరవం ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం.

3.మీన రాశి

కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక మీన రాశి వారికి లాభదాయకంగా ఉండదు. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. వైవాహిక జీవితంలో చీలిక రావచ్చు. ఓపిక పట్టండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఒత్తిడితో ఇబ్బంది పడచ్చు. అదే సమయంలో ఇంటి వాతావరణం కూడా అల్లకల్లోలంగా కనిపిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.