Lord Rahu: రాహు గ్రహం వల్ల చెడే కాదు మంచి కూడా జరుగుతుంది, ఆ గ్రహం స్వభావం ఇదే-rahu likes these two signs and the people of those signs get the blessings of rahu planet ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Rahu: రాహు గ్రహం వల్ల చెడే కాదు మంచి కూడా జరుగుతుంది, ఆ గ్రహం స్వభావం ఇదే

Lord Rahu: రాహు గ్రహం వల్ల చెడే కాదు మంచి కూడా జరుగుతుంది, ఆ గ్రహం స్వభావం ఇదే

Haritha Chappa HT Telugu

Lord Rahu: జ్యోతిషశాస్త్రం ప్రకారం, రాహువు మేషం నుండి మీన రాశి వరకు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాడు. కానీ 12 రాశుల్లో కొన్ని రాశులు రాహువుకు అత్యంత ప్రియమైనవి. రాహువు ఇష్టమైన రాశులు ఏవో తెలుసుకోండి.

రాహు గ్రహం

జ్యోతిషశాస్త్రంలో రాహువు, కేతువులను దుష్ట గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండింటినీ నీడ గ్రహాలుగా పిలుస్తారు. రాహు,కేతు, శని గ్రహాలను అశుభంగా భావిస్తారు. రాహువు, కేతువులు ఇద్దరూ తిరోగమన స్థితిలో అంటే రివర్స్‌లో ప్రయాణిస్తూ ఉంటే రాశులపై ఎంతో ప్రభావం పడుతుంది. అశుభ గ్రహంగా పేరు తెచ్చుకున్న రాహువు ఎల్లప్పుడూ ప్రతికూల ఫలితాలను ఇస్తాడని అనుకుంటారు. నిజానికి రాహువు కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలను ఇస్తారు. కొన్నిసార్లు రాహువు ఎవరూ ఊహించని విధంగా శుభ ఫలితాలను అందిస్తాడు. రాహువు ఏ పరిస్థితుల్లో ఏ రాశులకు మంచి ఫలితాలను ఇస్తాడో తెలుసుకోండి.

రాహువు స్వభావం

జ్యోతిషశాస్త్రంలో రాహువును అనుకోని సంఘటనలు జరగడానికి కారకంగా భావిస్తారు. జ్యోతిష్యుల ప్రకారం, రాహువు కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలను ఇస్తుంది. చెడు స్థానంలో ఉంటే జాతకుడు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక వ్యక్తి జాతకంలో రాహువును మూడో లేదా ఆరో స్థానంలో ఉంటే అతనికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. రాహువు ప్రభావంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పనిలో విజయం సాధించి, ధైర్యం పెరిగి ఆర్థికంగా బలపడతారు.

జాతకంలో రాహువు పదో స్థానంలో ఉంటే సకల సౌఖ్యాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. పదకొండో ఇంట్లో రాహువు ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రాహువు శుభ స్థానంలో ఉంటే సంపద, కీర్తి, సౌభాగ్యం, బలం ప్రసాదిస్తుంది.

సింహ రాశి

జ్యోతిషశాస్త్రం ప్రకారం అంతుచిక్కని గ్రహంగా పేరుతెచ్చుకున్న రాహువుకు సింహ రాశి అంటే ఇష్టం. సింహరాశిలో రాహువు సంచారం చాలా శుభ ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. సింహరాశిలో రాహువు ఆకస్మిక ధనలాభం అందిస్తాడు. అంతే కాదు, ఇది జీవితంలో అనేక సానుకూల మార్పులను తెస్తుంది. రాహువు శుభ దర్శనం ద్వారా ఆనందం లభిస్తుంది. ప్రతి రంగంలోనూ మంచి ఫలితాలు సాధిస్తారు. మానసిక ఒత్తిడి తొలగిపోతుంది.

వృశ్చిక రాశి

రాహువుకు ఇష్టమైన రాశులలో వృశ్చిక రాశి కూడా ఒకటి. రాహువు ప్రభావం వల్ల ఈ రాశి వారు వృత్తిలో విజయం సాధిస్తారని చెబుతారు. ఈ రాశి వారు ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పనితీరును కనబరుస్తారు. రాహువు అనుగ్రహం వల్ల ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది.

(ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనదని మేము చెప్పడం లేదు. మరింత సమాచారం కోసం సంబంధిత రంగ నిపుణుల సలహా తీసుకోవాలి..).