చిలకమర్తి పంచాంగరీత్యా, దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 18 మే 2025 రాహువు మీన రాశి నుంచి కుంభ రాశికి, కేతువు కన్యా రాశి నుంచి సింహ రాశికి మార్పు చెందడం చేత కొన్ని రాశులకు శుభ ఫలితాలు, కొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు ఏర్పడుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ రాహు కేతువుల మార్పు వలన కర్కాటక రాశికి, సింహ రాశికి, మకర రాశికి, కుంభ రాశికి ప్రతికూల ఫలితాలు ఏర్పడుతున్నాయి. వృషభ, కన్య, తుల, ధనస్సు రాశులకు అనుకూల ఫలితాలు కలగనున్నాయి. మేష, మిథున, వృశ్చిక, మీన రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ రాహు కేతువుల మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ క్రింది విధంగా ఉన్నాయి.
మేష రాశి: మేష రాశి వారికి మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. సంతాన సౌఖ్యం కలుగును.
వృషభ రాశి: అన్ని విధాలుగా కలిసివచ్చును. మాతృవర్గీయులతో వాదనలు పెరుగును.
మిథున రాశి: మిథున రాశి వారు భ్రాతృవర్గీయులు (సోదర, సోదరీలతో) ఆనందంగా గడిపెదరు. మధ్యస్థ ఫలితాలు కలుగును.
కర్కాటక రాశి: వాదనలు, ఆరోగ్య సమస్యలు, ప్రయాణాలు ఇబ్బంది పెట్టును. సుబ్రహ్మణ్యస్వామిని, దుర్గాదేవిని పూజించండి.
సింహ రాశి: సింహ రాశి వారికి ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించును. చికాకులు పెరుగును. మానసిక ఒత్తిడులు ఏర్పడును. విఘ్నేశ్వరుని, దుర్గాదేవిని పూజించండి.
కన్యా రాశి: కన్యా రాశి వారు సమస్యలను అధిగమించెదరు. ఖర్చులు నియంత్రించెదరు. విజయాలను పొందెదరు.
తుల రాశి: తుల రాశి వారికి లాభములు కలుగును. శుభఫలితాలను పొందెదరు. అనుకున్న పనులు పూర్తి చేసెదరు.
వృశ్చిక రాశి: ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. ఉద్యోగులకు కలిసి వచ్చును. పని ఒత్తిళ్ళు ఏర్పడును.
ధనస్సు రాశి: కుటుంబసౌఖ్యం, ఆనందం పొందెదరు. మార్పు కలుగును. ప్రయత్నములు ఫలించును.
మకర రాశి: మకర రాశి వారికి సమస్యలు పీడించును. గొడవలు అధికమగును. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్త వహించాలి. విఘ్నేశ్వరుని, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
కుంభ రాశి: చికాకులు, ఒత్తిడులు పెరుగును. పనులయందు ఆలస్యము ఏర్పడును. ప్రమాదములు జరుగు సూచన. సుబ్రహ్మణ్యస్వామిని, అమ్మవారిని పూజించండి.
మీన రాశి: మీన రాశి వారి పరిస్థితుల్లో మార్పు కలుగును. ఆందోళనలు తొలగును. కుటుంబసౌఖ్యము, ఆనందం పొందెదరు.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000