Rahu transit: కొత్త సంవత్సరం వీరి తలరాతలు మార్చబోతున్న దుష్టగ్రహం- ఏడాదిన్నర వరకు అదృష్టమే
Rahu transit: రాహువు కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారి జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాడు. ఒక రాశిలో రాహువు ఏడాదిన్నర కాలం ఉంటాడు. 2025 లో రాహువు శనికి చెందిన కుంభ రాశిలో సంచరిస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది.
మరి కొద్ది రోజుల్లో పాత సంవత్సరానికి ముగింపు పలికి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించబోతున్నాం. 2025 సంవత్సరంలో అనేక గ్రహ మార్పులు ఉంటాయి. ఈ మార్పులు వివిధ రాశులను అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. వీటిలో ఒకటి అంతుచిక్కని గ్రహం రాహు మార్పు.
నవగ్రహాలలో రాహు, కేతువులు తిరోగమన దశలో సంచరిస్తారు. ఏడాదిన్నరకు ఒక సారి రాహువు తన రాశిని మారుస్తాడు. వచ్చే ఏడాది శని రాశిలోకి రాహువు రాబోతున్నాడు. రాహువు ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు. వచ్చే ఏడాది రాహువు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు మహాదశ కూడా 18 సంవత్సరాలు ఉంటుంది. రాహువు 18 నెలల పాటు అదే రాశిలో ఉంటాడు. గతంలో 2023 అక్టోబర్‌లో రాహువు మీన రాశిలోకి ప్రవేశించాడు. 2024లో రాహువు రాశిలో ఎలాంటి మార్పు లేదు.
ఇప్పుడు రాహువు మే 2025 సంవత్సరంలో శని రాశిలోని కుంభరాశిలోకి వెళ్లనున్నారు. రాహువు శని రాశిలోని కుంభ రాశికి వెళ్లడం వల్ల చాలా రాశుల వారికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ చాలా రాశుల వారికి మేలు చేస్తుంది. రాహువు కుంభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ రాశుల వారికి మేలు కలుగుతుందో చూద్దాం. ఏ రాశులకు రాహువు అదృష్టాన్ని పంచబోతున్నాడో చూసేయండి.
మేష రాశి
రాహువు సంచారం మేష రాశి వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. చిన్న ఒత్తిడులు ఉండవచ్చు, కానీ ఇది మీకు మంచి సమయం. ఆర్థిక లాభాల సంకేతాలు ఉన్నాయి. ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. అవసరం అయితే మీరు ఎవరి నుండైన సలహాలు కూడా తీసుకోవచ్చు. కెరీర్ బాగుంటుంది, ఉద్యోగంలో మార్పు లేదా బదిలీ కూడా ఉండవచ్చు. మొత్తంమీద మీకు మంచి సమయం ఉంటుంది. ఏదైనా పని చెడిపోతుందని మీరు ఆందోళన చెందుతుంటే అది కూడా ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి వస్తుంది.
కన్యా రాశి
కన్యా రాశికి రాహువు శుభ ఫలితాలను తెస్తున్నాడు. కన్యా రాశి వారు తమ ఉద్యోగంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. కొద్ది రోజులు ఇబ్బందిగా అనిపించినప్పటికీ తర్వాత పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. కుటుంబంతో సమయం గడిపే అవకాశం లభిస్తుంది. సమాజంలో మీ పట్ల గౌరవం, కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. వ్యాపారాలలో లాభానికి సంబంధించిన సంకేతాలు ఉన్నాయి. విదేశీ ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ధనుస్సు రాశి
రాహువు కుంభ రాశిలోకి వెళ్లడం ధనుస్సు రాశి వారికి మంచిది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఇది కాకుండా మీ కోసం కొత్త ఆదాయ వనరులను ఏర్పడతాయి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. పేదలకు భోజనం పెట్టండి, వారికి సహాయం చేయండి. ఇలా చేయడం వల్ల రాహువు వల్ల కలిగే ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి జీవితం సాఫీగా సాగుతుంది.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.