రాహు-చంద్రులు గ్రహణ యోగం.. ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉంటే మంచిది!-rahu and moon forms eclipse yoga and 3 zodiac signs must be careful during this time ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  రాహు-చంద్రులు గ్రహణ యోగం.. ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉంటే మంచిది!

రాహు-చంద్రులు గ్రహణ యోగం.. ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉంటే మంచిది!

Peddinti Sravya HT Telugu

కుంభరాశిలో రాహువు–చంద్రుడు సంయోగం చెందడంతో గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి ఈ సంయోగం వలన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

రాహు-చంద్రులు గ్రహణ యోగం

గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిని మారుస్తూ ఉంటాయి. రాహువు నీడ గ్రహం, కఠినమైన మాటలకు కారకుడు. రాహువు దాదాపు 18 నెలల పాటు ఒకే రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. మే నెలలో రాహువు సంచారం యాదృచ్ఛికంగా జరిగింది. రాహువు మే 18న కుంభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో ఉంటూనే ఇతర గ్రహాలతో సంయోగం చెందుతున్నాడు.

రాహువు, చంద్రుల కలయిక త్వరలో జరగనుంది. జ్యోతిష్యుల నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చంద్రుడు జూన్ 16న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు ఇప్పటికే కుంభ రాశిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో రాహువు–చంద్రుల సంయోగం జరుగుతుంది. దీంతో ఒక యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది.

రాహువు–చంద్రుల సంయోగంతో గ్రహణ యోగం

కుంభరాశిలో రాహువు–చంద్రుడు సంయోగం చెందడంతో గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి ఈ సంయోగం వలన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

1.కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ సంయోగం కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పాత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దీంతో భార్యాభర్తల మధ్య చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రహణ యోగం కారణంగా కుంభ రాశి వ్యాపారస్తులకు ఇబ్బందులు రావచ్చు. సహనంతో వ్యవహరించడం మంచిది. సోదరుల విషయంలో కూడా ఈ సమయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

2.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ యోగం వలన నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో గొడవలు పడే అవకాశం ఉంది, కాబట్టి కాస్త మధురంగా మాట్లాడితే మంచిది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ సమయంలో ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కాస్త ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగానే ఉంటారు, కానీ కొంతమంది మాటలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు.

3.మీన రాశి

మీన రాశి వారికి ఈ సంయోగం వలన చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీన రాశి వారి ప్రవర్తనలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం మంచిది. అలాగే మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. మీన రాశి విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాల కోసం కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

ఈ రాశి వారికి కోర్టు కేసుల నుంచి కూడా ఉపశమనాన్ని పొందుతారు. సంబంధాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం మానుకోండి. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఇతరుల విషయాల్లో అనవసరంగా మాట్లాడకుండా ఉంటే మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.