గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారేటప్పుడు ఇతర గ్రహాలతో సంయోగం జరగడంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రంలో రాహువు-చంద్రుడి కలయిక మానసిక అస్తిరతను, ఇబ్బందులను కలిగిస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి రాహువు–చంద్రుల కలయికతో ఏర్పడిన గ్రహణ యోగం శుభ ఫలితాలను ఇస్తుంది.
జూన్ 16న చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 18 సాయంత్రం 6:35 వరకు ఇదే రాశిలో ఉంటుంది. రాహువు కూడా ఇదే రాశిలో ఉండడంతో గ్రహణ యోగం ఏర్పడింది. ఈ గ్రహణ యోగం వలన ఐదు రాశుల వారికి అనేక శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
మేష రాశి వారికి రాహువు–చంద్రుల సంయోగం కారణంగా ఏర్పడిన యోగం వలన అనేక లాభాలు ఉంటాయి. ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. విదేశాలలో ఏదైనా పనులు ఉంటే వాటిని పూర్తి చేసుకుంటారు. ఈ సమయంలో మేష రాశి వారికే ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది.
సింహ రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటారు. కొత్త ప్రణాళికలను రూపొందిస్తారు. ఎప్పటినుంచో మీ చేతికి రాని ధనం ఇప్పుడు వస్తుంది. పేరు, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.
ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అనేక లాభాలు ఉంటాయి. కొత్త బాధ్యతల్ని స్వీకరిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. చాలా కాలం నుంచి ఎంతో కష్టపడి పనిచేసే వారికి ఇప్పుడు సక్సెస్ వస్తుంది.
కుంభ రాశి వారికి ఈ గ్రహణ యోగం అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. రాహువు–చంద్రుడి కారణంగా ఏర్పడిన యోగం కుంభ రాశి వారికి కొత్త ఉద్యోగాలని, కొత్త ప్రాజెక్టులను తీసుకువస్తుంది. పాత అప్పులను తీరుస్తారు. అనుకున్న వాటిని సాధిస్తారు.
మీన రాశి వారికి ఈ సమయం కలిసొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అదృష్టాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. గొడవలు వంటి వాటిని పరిష్కరించుకుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.